Viral: కొద్ది క్ష‌ణాల్లో పెళ్లి.. పెళ్లి పీటలపై వధువు తల్లి! వరుడు షాక్‌

ఉత్తర ప్రదేశ్ లో ఇటీవల పెళ్లిళ్లు చిత్ర విచిత్రంగా సాగుతున్నాయి. తాజాగా పెళ్లి పీటలపై వధువు స్థానంలో ఆమె తల్లి కూర్చోవడం ఓ పెళ్లి కొడుకును షాక్ కు గురి చేసింది.

Viral: కొద్ది క్ష‌ణాల్లో పెళ్లి.. పెళ్లి పీటలపై వధువు తల్లి! వరుడు షాక్‌

Wedding Shock: ఉత్తర ప్రదేశ్ లో ఇటీవల పెళ్లిళ్లు చిత్ర విచిత్రంగా సాగుతున్నాయి. భార్య ప్రేమించిన ప్రియుడితో పెళ్లి చేసిన భర్తలు..కూతురితో నిశ్చితార్ధం జరిపిన యువకుడితో తల్లి లేచిపోవడం వంటి చిత్రాలు చోటుచేసుకున్నాయి. తాజాగా పెళ్లి పీటలపై వధువు స్థానంలో ఆమె తల్లి కూర్చోవడం ఓ పెళ్లి కొడుకును షాక్ కు గురి చేసింది. ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రం మీరట్‌ లోని బ్రహ్మపురిలో ఈ విచిత్ర ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. మీరట్‌లోని బ్రహ్మపురికి చెందిన మొహమ్మద్‌ అజీమ్ (22) కు శామలీ జిల్లావాసి మంతశా (21) తో పెళ్లి కుదిరింది. నిఖా సమయంలో ఆ నిఖా జరిపిస్తున్న మౌల్వీ వధువు పేరు ‘తాహిరా’ అని పలకడంతో వరుడికి అనుమానం వచ్చింది. ముసుగు తొలగించి చూడగా.. మంతశాకు బదులుగా భర్త చనిపోయిన ఆమె తల్లి (45) వధువు పెళ్లి కూతురు వేషధారణలో కూర్చుని ఉంది. దీంతో పెళ్లికొడుకు అవాక్కయ్యాడు. జరిగిన మోసంపై ఆగ్రహం వ్యక్తం చేశాడు.

అయితే అప్పటికే వరుడి అజీమ్ అన్నావదినలు వధువు కుటుంబంతో కుమ్మక్కై అల్లరి చేయకుండా వధువు తల్లినే పెళ్లి చేసుకోవాలంటూ హెచ్చరించారు. లేదంటే అత్యాచారం కేసు పెడుతారని బెదించారు. దాంతో తాను పూర్తిగా మోసపోయానని గ్రహించిన అజీమ్‌ వధువు తల్లిని పెళ్లి చేసుకునేందుకు నిరాకరించాడు. నేరుగా వెళ్లి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పెళ్లి కోసం తాను రూ.5 లక్షలు ఖర్చు పెట్టానని, ఇప్పుడు వారి మోసంతో తాను నష్టపోయానంటూ ఫిర్యాదులో పేర్కొన్నాడు.