• Telugu News
  • /Latest

Balakrishna | క్లాసికల్ సాంగ్‌తో అదరగొట్టిన బాలయ్య.. నిలబడి చప్పట్లు కొట్టిన ప్రేక్షకులు..!

Balakrishna విధాత‌: నటుడు నందమూరి బాలయ్య బాబు ఏం చేసినా ఆసక్తికరంగా ఉంటుంది. ఆయన అభిమానులకైతే ఆయన ఆడినా.. పాడినా.. డైలాగ్‌ చెప్పినా పూనకం వచ్చేస్తుంది. అట్లా ఉంటుంది మా హీరోతో అంటారు. హీరోలు డైలాగులు చెప్పడం, డ్యాన్స్‌లు చేయడం, ఫైట్లు చేయడం సహజమే. కానీ పాటలు పాడటం అరుదుగానే జరుగుతుంది. అట్లా బాలయ్య బాబు ఆ మధ్య పైసా వసూల్‌ సినిమాలో 'అరె మామ' పాట పాడి అందరి ప్రశంసలు అందుకున్నారు. సినిమాల్లో ఇక బాలయ్య […]

Reported by: Somu | latest | IST
Read Time: 3 mins

Balakrishna

విధాత‌: నటుడు నందమూరి బాలయ్య బాబు ఏం చేసినా ఆసక్తికరంగా ఉంటుంది. ఆయన అభిమానులకైతే ఆయన ఆడినా.. పాడినా.. డైలాగ్‌ చెప్పినా పూనకం వచ్చేస్తుంది. అట్లా ఉంటుంది మా హీరోతో అంటారు. హీరోలు డైలాగులు చెప్పడం, డ్యాన్స్‌లు చేయడం, ఫైట్లు చేయడం సహజమే.

కానీ పాటలు పాడటం అరుదుగానే జరుగుతుంది. అట్లా బాలయ్య బాబు ఆ మధ్య పైసా వసూల్‌ సినిమాలో ‘అరె మామ’ పాట పాడి అందరి ప్రశంసలు అందుకున్నారు. సినిమాల్లో ఇక బాలయ్య బాబు వేసే స్టెప్పుల గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. 50 పదుల వయసు దాటినా ఇంకా ఆయన డ్యాన్స్‌ చేస్తే చూడముచ్చటగా ఉంటుంది. హీరోలు సినిమాల్లో పాడే సమయంలో రికార్డింగ్‌ స్టూడియోల్లోనే కొంత సిగ్గు పడతారు, తడబడతారు.

కానీ బాలయ్య బాబుకు అలాంటివేవీ ఉండదు. ఎక్కడ హమ్‌ చేసినా డేర్‌ అండ్‌ డాషింగ్‌గా ఉంటారు. అలా స్టేజ్‌ మీద బాలయ్య బాబు పాటలు పాడుతుంటే ప్రొఫెషనల్‌ సింగర్స్‌ కూడా ఆశ్చర్యపోయేలా పాడారు. తాజాగా దోహాలో జరుగుతున్న ఒక కార్యక్రమంలో పాల్గొన్న జగదేకవీరుని కథ సినిమాలోని ‘శివశంకరీ శివానందలహరి’ పాట పాడి ఆలరించారు. ఆ పాట పాడాలంటే ప్రొఫెషనల్‌ సింగర్స్‌ కూడా కష్టతరం.

కానీ బాలయ్య బాబు ఆ పాటలో వచ్చే ‘తోం తోం తోం దిరిదిరి తోందిరిదిరి తోం దిరిదిరి తోం దిరిదిరి తోం’ రాగాలను కూడా అద్భతంగా పలికి ఔరా అనిపించారు. ఆ పాట ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. బాలయ్య ప్రయత్నానికి అభిమానులు ఫిదా అవుతున్నారు. ఆయనను ప్రశంసల్లో ముంచెత్తుతున్నారు.