Warangal | వామపక్ష విద్యార్థి సంఘాల విద్యాసంస్థల బంద్
Warangal వరంగల్లో భారీ ర్యాలీ, ధర్నా విద్యారంగంపై ప్రభుత్వ నిర్లక్ష్యం విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ వామపక్ష విద్యార్థి సంఘాల పిలుపులో భాగంగా ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా బుధవారం పాఠశాలలు, కళాశాలల బంద్ జరిగింది. ప్రభుత్వ,ప్రైవేటు పాఠశాలలు, కళాశాలల తరగతులు బహిష్కరించారు. అనంతరం విద్యార్థుల భారీ ర్యాలీ నిర్వహించి వరంగల్ లో ధర్నా చేపట్టారు. విద్యారంగంపై ప్రభుత్వ నిర్లక్ష్యం రాష్ట్ర ప్రభుత్వ అసమర్థత విధానాల వల్ల విద్యారంగం ప్రభుత్వ విద్యా […]

Warangal
- వరంగల్లో భారీ ర్యాలీ, ధర్నా
- విద్యారంగంపై ప్రభుత్వ నిర్లక్ష్యం
విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ వామపక్ష విద్యార్థి సంఘాల పిలుపులో భాగంగా ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా బుధవారం పాఠశాలలు, కళాశాలల బంద్ జరిగింది. ప్రభుత్వ,ప్రైవేటు పాఠశాలలు, కళాశాలల తరగతులు బహిష్కరించారు. అనంతరం విద్యార్థుల భారీ ర్యాలీ నిర్వహించి వరంగల్ లో ధర్నా చేపట్టారు.
విద్యారంగంపై ప్రభుత్వ నిర్లక్ష్యం
రాష్ట్ర ప్రభుత్వ అసమర్థత విధానాల వల్ల విద్యారంగం ప్రభుత్వ విద్యా సంస్థలు సమస్యల వలయంలో నెట్టివేయబడిందని విద్యార్థి సంఘాల నాయకులు విమర్శించారు. ఈ సందర్భంగా ఏ ఐ ఫ్ డిఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడ్డం నాగార్జున, ఏ.ఐ.ఎస్.బి రాష్ట్ర అధ్యక్షులు హకీమ్ నవీద్, ఏ.ఐ.ఎస్.ఎఫ్ జిల్లా అధ్యక్షులు ఎల్. శరత్, ఎస్.ఎఫ్.ఐ జిల్లా ప్రధాన కార్యదర్శి యార ప్రశాంత్ , పి.డి.ఎస్.యు నగర ఉపాధ్యక్షులు అర్జున్ లు మాట్లాడారు.
కెసిఆర్ ప్రభుత్వం, ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో ఉపాధ్యాయ, అధ్యాపక పోస్టులను భర్తీ చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని అన్నారు. రాష్ట్రంలో కార్పొరేట్ విద్యాసంస్థలు విద్యను అంగడి సరుకుగా మార్చేసి లక్షల రూపాయల ఫీజులను దోచుకుంటున్నారని మండిపడ్డారు. ఫీజుల నియంత్రణ చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యం చెందిందని వారు ఆరోపించారు.
కార్పొరేట్ విద్యాసంస్థలు చేస్తున్న ఫీజుల దోపిడీకి అరికట్టడం కోసం ఫీజుల నియంత్రణ చట్టాన్ని తేవాలని రాష్ట్ర ప్రభుత్వానికి డిమాండ్ చేశారు. మన ఊరు మన బడి పథకాన్ని రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రభుత్వ పాఠశాలలకు వర్తింపచేస్తూ నిధులను సక్రమంగా ఖర్చు చేయాలని వారు ప్రభుత్వానికి డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో ఏఐఎఎస్‌బీ ఉమ్మడి జిల్లా కన్వీనర్ రోహిత్, ఫర్కాన్, ఏఐఎఫ్డిఎస్ జిల్లా అధ్యక్షులు గూడ సాయిరాం, పిట్టల సాయికుమార్, సాయి మోహన్, ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు చుక్క ప్రశాంత్, ఏఐఎస్ఎఫ్ జిల్లా ఉపాధ్యక్షుడు సాగర్, పిడిఎస్‌యూ నాయకులు శశి, అభి, మొహ్సిన్, అక్షిత, శృతి, జ్యోతి, సాయి కుమార్, సాయిరాం, వంశీ, శివ, రాకేష్, శ్రీకర్ తదితరులు పాల్గొన్నారు.