Bellaiah Naik | ఒక్క ఓటు బీఆరెస్‌కు పడనివ్వం బెల్లయ్య నాయక్
సెప్టెంబర్ 2 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తాం పోలీస్ అధికారులు, ట్రాన్స్‌కోలో మొత్తం రావులే కాంగ్రెస్ పార్టీ ఎస్టీ సెల్ చైర్మన్, బెల్లయ్య నాయక్ Bellaiah Naik | విధాత: బీఆరెస్‌కు ఒక్క ఓటు కూడా పడనివ్వమని కాంగ్రెస్ పార్టీ ఎస్టీ సెల్ చైర్మన్ బెల్లయ్య నాయక్ అన్నారు. ఎస్సీ, ఎస్టీ సెల్ డిక్లరేషన్‌ను ప్రజల్లోకి తీసుకు వెళ్లడానికి సెప్టెంబర్ 2నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఇంటింటికి తిరుగుతామని వెల్లడించారు. మంగళవారం గాంధీభవన్‌లో మీడియాతో మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ […]
- సెప్టెంబర్ 2 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తాం
- పోలీస్ అధికారులు, ట్రాన్స్‌కోలో మొత్తం రావులే
- కాంగ్రెస్ పార్టీ ఎస్టీ సెల్ చైర్మన్, బెల్లయ్య నాయక్
Bellaiah Naik | విధాత: బీఆరెస్‌కు ఒక్క ఓటు కూడా పడనివ్వమని కాంగ్రెస్ పార్టీ ఎస్టీ సెల్ చైర్మన్ బెల్లయ్య నాయక్ అన్నారు. ఎస్సీ, ఎస్టీ సెల్ డిక్లరేషన్‌ను ప్రజల్లోకి తీసుకు వెళ్లడానికి సెప్టెంబర్ 2నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఇంటింటికి తిరుగుతామని వెల్లడించారు. మంగళవారం గాంధీభవన్‌లో మీడియాతో మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్ ని పనికిరాదని మంత్రులు, దానిని చూసి ఎందుకు భయపడుతున్నారని ప్రశ్నించారు.
మహబూబాబాద్ ఎస్పీ శరత్ చంద్ర నాయక్‌ను ఏకా ఎకినా బదిలీ చేయడాన్ని నాయక్ తప్పు పట్టారు. ఎమ్మెల్యే రేఖా నాయక్‌కు బీఆరెస్‌లో టికెట్ ఇవ్వలేదు. శ్యామ్ నాయక్ కాంగ్రెస్‌లో చేరారు.. అందుకే వారి అల్లుడు ఎస్పీ శరత్ చంద్రని ఈప్రభుత్వం ఉద్దేశ పూర్వకంగా బదిలీ చేసిందన్నారు. ఎస్పీ మామ పార్టీ మారినంత మాత్రాన మదిలీ చేయాల్సిన అవసరం ఏమొచ్చిందన్నారు. మీకంత భయమెందుకని అడిగారు.
ఈ ప్రభుత్వపెద్దలు పక్షపాతంగా వ్యవహరిస్తున్నారన్నారు. పోలీస్ అధికారులు, ట్రాన్స్ కోలో మొత్తం రావు లే ఉన్నారన్నారు. దళిత గిరిజనుల పట్ల వివక్ష పూరీతంగా వ్యవహరిస్తుందన్నారు. గిరిజనుల అభివృద్ధి కి మా ప్రభుత్వం లో అన్ని చేస్తామన్నారు. డిక్లరేషన్ అమలు అయితే ఏదేళ్లలో విప్లవత్మక మార్పులు వస్తాయన్నారు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram