బీమ్లా నాయక్‌ డైరెక్టర్‌తో.. బెల్లంకొండ సాయి శ్రీనివాస్..!

విధాత: పవన్ కళ్యాణ్ ఇటీవల మలయాళంలో వచ్చిన అయ్యప్పమ్ కోసియం ఆధారంగా తెలుగులో బీమ్లా నాయక్‌ను రీమేక్ చేశాడు. ఈ చిత్రానికి త్రివిక్రమ్ శ్రీనివాస్ స్క్రీన్ ప్లే, డైలాగ్స్ రాశాడు. రానా కీలక పాత్రలో నటించాడు. నిత్యామీనన్, సంయుక్త మీనన్ హీరోయిన్లుగా నటించగా గత ఏడాది ఫిబ్రవరిలో ఈ సినిమా విడుదల అయింది. ఈ మూవీకి గతంలో శ్రీ విష్ణు,నారా రోహిత్ ల‌తో అప్పట్లో ఒకడుండేవాడు చిత్రాన్ని తెరకెక్కించి మంచి పేరు తెచ్చుకున్న సాగర్ చంద్ర దర్శకత్వం […]

  • By: krs    latest    Jan 30, 2023 8:47 AM IST
బీమ్లా నాయక్‌ డైరెక్టర్‌తో.. బెల్లంకొండ సాయి శ్రీనివాస్..!

విధాత: పవన్ కళ్యాణ్ ఇటీవల మలయాళంలో వచ్చిన అయ్యప్పమ్ కోసియం ఆధారంగా తెలుగులో బీమ్లా నాయక్‌ను రీమేక్ చేశాడు. ఈ చిత్రానికి త్రివిక్రమ్ శ్రీనివాస్ స్క్రీన్ ప్లే, డైలాగ్స్ రాశాడు. రానా కీలక పాత్రలో నటించాడు. నిత్యామీనన్, సంయుక్త మీనన్ హీరోయిన్లుగా నటించగా గత ఏడాది ఫిబ్రవరిలో ఈ సినిమా విడుదల అయింది. ఈ మూవీకి గతంలో శ్రీ విష్ణు,నారా రోహిత్ ల‌తో అప్పట్లో ఒకడుండేవాడు చిత్రాన్ని తెరకెక్కించి మంచి పేరు తెచ్చుకున్న సాగర్ చంద్ర దర్శకత్వం వహించాడు.

అయితే పేరుకే సాగర్ చంద్ర గాని దర్శకత్వం మొత్తం త్రివిక్రమే చేశాడని మీడియాలో నాడు వార్తలు గుప్పుమ‌న్నాయి. ఈ సినిమాకి సాగర్ చంద్ర డ‌మ్మి డైరెక్టర్ మాత్రమే అని వార్తలు వచ్చాయి. ఈ సినిమా విడుదలై నెలలు గడుస్తున్నా మరో హీరో సాగర్ చంద్రకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు.

ఎట్టకేలకు సాగర్‌చంద్రాకు హీరో దొరికాడు. అతను మరెవరో కాదు బెల్లంకొండ సాయి శ్రీనివాస్. అల్లుడు శీను మూవీతో హీరోగా ఇండస్ట్రీలో ప‌రిచ‌యం అయిన పేరు గత కొంతకాలంగా వినిపించడం లేదు. అల్లుడు అదుర్స్ ఫ్లాప్ కావడంతో చత్రపతి హిందీ రీమేక్‌ని వీవీ వినాయకుతో ఏకధాటిగా చేస్తున్నాడు. బాలీవుడ్‌కి చెందిన పెన్ స్టూడియోస్ అధినేత జయంతి లాల్ దీని నిర్మిస్తున్నాడు.

ఈ సినిమా ఎప్పుడు విడుదలవుతుందో తెలీదు. థియేట్రిక‌ల్ రిలీజ్ ఉండదని నేరుగా ఓటీటీలో విడుదల చేస్తారని తెలుస్తోంది. ఈ కారణాల వలన కొన్ని నెలలుగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కూడాలైమ్ లైట్లో కనిపించడం లేదు. మరోవైపు సాగర్ చంద్ర కూడా లైమ్ లైటులో లేడు.

ఇప్పుడు వీరిద్దరూ కలిశారు.చత్రపతి ప్రొడక్షన్లో ఉండగానే భీమ్లా నాయక్ డైరెక్టర్ సాగర్ చంద్రకు బెల్లంకొండ సాయి శ్రీనివాస్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఈ మూవీని 14 ప్లస్ రీల్స్ వారు నిర్మించబోతున్నారు. బెల్లంకొండ శ్రీనివాస్ సినిమా 14 రీల్స్ వారి చేతికి రావడం ఆశ్చర్యమే అని ఇన్సైడ్ టాక్.

మరి ఈ మూవీని తెలుగులో చేస్తున్నారా చత్రపతి తర్వాత పాన్ ఇండియా లెవెల్‌లో చేస్తున్నారా అనేది తెలియాల్సి ఉంది. ఈ సినిమా ద్వారా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ సాగర్ చంద్ర మరలా లైమ్ లైట్‌లోకి వస్తారా లేదా అనేది వేచి చూడాలి..!