ద‌క్షిణామూర్తి స్తోత్ర పారాయ‌ణ ఫ‌లితాలేంటి?

దక్షిణామూర్తి అనగా దక్షిణానికి సంబంధించిన దేవుడు, అనగా శివుడు ! ఇక ఈ దక్షిణం అనేది నరక లోకానికి వెళ్లే దిశ అని చెబుతారు ! ఉత్తరం అనేది స్వర్గలోకానికి వెళ్లే దిశ అంటారు !

ద‌క్షిణామూర్తి స్తోత్ర పారాయ‌ణ ఫ‌లితాలేంటి?

దక్షిణామూర్తి అనగా దక్షిణానికి సంబంధించిన దేవుడు, అనగా శివుడు ! ఇక ఈ దక్షిణం అనేది నరక లోకానికి వెళ్లే దిశ అని చెబుతారు ! ఉత్తరం అనేది స్వర్గలోకానికి వెళ్లే దిశ అంటారు ! అందువలన చనిపోయిన తరువాత నరకం తప్పాలంటే ఈ దక్షిణామూర్తి స్తోత్రం పారాయణం చేయాలంటారు !

ఈ పారాయణంతో పరమశివుడి అనుగ్రహం వల్ల జ్ఞానం వస్తుంది, అంటే ఆధ్యాత్మిక జ్ఞానం మనిషికి కలుగుతుంది ! దానివల్ల వైరాగ్యం వస్తుంది ! అంటే జీవితం మీద విరక్తి పుడుతుంది ! కోరికలు లేకుండా అవుతారు ! ఇది మోక్షానికి మొట్టమొదటి మెట్టు ! దక్షిణామూర్తి స్తోత్రంలో ఈ విషయాలన్నీ ఉంటాయి ! కాబట్టి దక్షిణామూర్తి స్తోత్ర పారాయణం అనేది మోక్ష జ్ఞానం కలిగిస్తుంది !

దక్షిణామూర్తి స్తోత్రం రోజు పారాయణం చేసిన లేక ఆయన ఫోటో ఇంట్లో పెట్టుకుని రోజు ఆయన వంక ఒక్క 10 నిమిషాలు చూసిన చాలు అపరిమిత జ్ఞానాన్ని మాత్రమే కాదు ఒకానొక సందర్భం లో మనకు కలిగిన కష్టం లో నుండి బయట పడేస్తాడు. మీ ఇంటిలో పిల్లలు చదువుకునే చోటులో వాళ్లకు కనబడే విధంగా ఆయన ఫోటో ఒకటి ఉత్తరం వైపు పెట్టండి పిల్లలకు మంచి జ్ఞానాన్ని ప్రసాదిస్తాడు..

ఇక విద్యార్థులకు, వాళ్ళ చదువులకు సంబంధించిన జ్ఞానం లేదా అనుగ్రహం కావాలంటే సరస్వతి దేవి లేదా వినాయకుడి స్తోత్రాలు చదవాలి ! ఇంకా చెప్పాలంటే, హయగ్రీవ స్తోత్ర పారాయణం కూడా చేయాలి !


దక్షిణా మూర్తి స్తోత్రమ్

దక్షిణా మూర్తి స్తోత్రమ్శాంతిపాఠః

ఓం యో బ్రహ్మాణం విదధాతి పూర్వం

యో వై వేదాంశ్చ ప్రహిణోతి తస్మై |

తంహదేవమాత్మ బుద్ధిప్రకాశం

ముముక్షుర్వై శరణమహం ప్రపద్యే ‖

ధ్యానమ్

ఓం మౌనవ్యాఖ్యా ప్రకటితపరబ్రహ్మతత్వంయువానం

వర్శిష్ఠాంతేవసదృషిగణైరావృతం బ్రహ్మనిష్ఠైః |

ఆచార్యేంద్రం కరకలిత చిన్ముద్రమానందమూర్తిం

స్వాత్మరామం ముదితవదనం దక్షిణామూర్తిమీడే ‖

వటవిటపిసమీపే భూమిభాగే నిషణ్ణం

సకలమునిజనానాం జ్ఞానదాతారమారాత్ |

త్రిభువనగురుమీశం దక్షిణామూర్తిదేవం

జననమరణదుఃఖచ్ఛేద దక్షం నమామి ‖

చిత్రం వటతరోర్మూలే వృద్ధాః శిష్యాః గురుర్యువా |

గురోస్తు మౌనవ్యాఖ్యానం శిష్యాస్తుచ్ఛిన్నసంశయాః ‖

ఓం నమః ప్రణవార్థాయ శుద్ధజ్ఞానైకమూర్తయే |

నిర్మలాయ ప్రశాంతాయ దక్షిణామూర్తయే నమః ‖

గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః |

గురుస్సాక్షాత్ పరం బ్రహ్మా తస్మై శ్రీ గురవే నమః ‖

నిధయే సర్వవిద్యానాం భిషజే భవరోగిణామ్ |

గురవే సర్వలోకానాం దక్షిణామూర్తయే నమః ‖

చిదోఘనాయ మహేశాయ వటమూలనివాసినే |

సచ్చిదానంద రూపాయ దక్షిణామూర్తయే నమః ‖

ఈశ్వరో గురురాత్మేతి మూత్రిభేద విభాగినే |

వ్యోమవద్ వ్యాప్తదేహాయ దక్షిణామూర్తయే నమః ‖

అంగుష్థతర్జనీయోగముద్రా వ్యాజేనయోగినామ్ |

శృత్యర్థం బ్రహ్మజీవైక్యం దర్శయన్యోగతా శివః ‖

ఓం శాంతిః శాంతిః శాంతిః ‖



కొలత, కొరత ఎవరికి ఉంటుందో వాడు ఆనందం కోసం వెంపర్లాడతాడు. కానీ కొలత లేని వాడు, కొరత లేని వాడు పరిపూర్ణుడైనటువంటి అప్రమేయుడు గనుక స్వాత్మారామం. ముదిత వదనం-అంత ఆనందం స్వభావమే కాదు రూపం స్వీకరించినప్పుడు కూడా ప్రతి అణువు ఆయనలో ఆనందాన్ని ప్రకటీకరిస్తోంది. అందులో ముఖ్యంగా ముఖం భావస్థానం కనుక పైగా రుద్రయత్తే దక్షిణం ముఖం అన్నాం గనుక ఆ ముఖంలో ఏం కనిపిస్తోంది ‘ముదిత వదనం ఆనందమయమైనటువంటి వదనం. అటువంటి దక్షిణామూర్తి మీడే!!

“వటవిటపి సమీపే భూమిభాగే నిషణ్ణం

సకలముని జనానాం జ్ఞానదాతార మారాత్

త్రిభువన గురుమీశం దక్షిణామూర్తి దేవం

జనన మరణ దుఃఖచ్ఛేద దక్షం నమామి!!”

ఇక్కడ దక్షిణామూర్తి శబ్డంలో దక్షిణ అనే శబ్దానికి నిర్వచనం ఇస్తున్నారు. దక్షిణ అనగా సమర్థత. ఏ సమర్థత? – జనన మరణ దుఃఖాన్ని సమూలంగా ఛేదింపడమనే దక్షత. అది ఎవ్వడి దగ్గరా లేదు. అది దక్షిణామూర్తి ఒక్కరి దగ్గరే ఉన్నది. ఆయన తప్ప ఏ ఒక్కరూ మోక్షాన్ని ఇవ్వలేరు. ఆ మోక్షం ఆయనే ఇవ్వాలి. జనన మరణ దుఃఖచ్ఛేద దక్షతే దక్షిణ – అందుకోసమే ఈమూర్తి ధరించాడు కనుక దక్షిణామూర్తి.

“చిత్రం వటతరోర్మూలే వృద్ధాః శిష్యా గురుర్ యువా.

గురోస్తు మౌనం వ్యాఖ్యానం శిష్యాస్తు ఛిన్న సంశయాః”

ఆయనను ఆశ్రయించినప్పుడు ఉపన్యాసాలు లేవు. ఎందుకంటే అఖండమైన ఆత్మత్వమ్ ఆనందానుభూతి. అంతేకానీ దీపం వెలిగించి నాకు వెలుగునిమ్ము అని ప్రార్థించక్కరలేదు. ఆయన ఇచ్చేదే అది. ఈశ్వర సాక్షాత్కారానభవంతో నాకు జ్ఞానమివ్వు. అని అనక్కరలేదు. జ్ఞానమే ఆయన.

“గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం!

నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః!!”

“ఓం నమః ప్రణవార్థాయ శుద్ధఙ్ఞానైకమూర్తయే!

నిర్మలాయ ప్రశాంతాయ దక్షిణామూర్తయే నమః!!”


కేవల జ్ఞానమే ఆయన మూర్తి. మనకి మూర్తి వేరు, జ్ఞానం వేరు. భగవంతునికి జ్ఞానమే మూర్తి. జ్ఞానమే మూర్తీభవిస్తే దక్షిణామూర్తిగా గోచరిస్తున్నాడు.

అలా ఇక్కడ ఈ తొమ్మిది శ్లోకాల ఔషధాన్ని తయారుచేసి ఈ మందు purpose ఏంటి? అంటే సర్వాత్మత్వ స్ఫుటీకృతం. సర్వమూ ఒకటే ఆత్మ అది తెలుసుకోవాలి. రెండవది లేదు. ఉన్నది ఒక్కటే ఆత్మ. ఏమిటండీ నాముందు లక్ష కనపడుతున్నాయి. అదే కదా సమస్య! అందుకు కదా సాధన, స్తోత్రం, గీత, ఉపనిషత్తు మనకి. సర్వాత్మత్వాన్ని స్ఫుటీకృతం స్పష్టం చేయడానికై ’అముష్మిన్ స్తవే – ఈ స్తోత్రంలో ప్రతిపాదించారు సత్యాన్ని. చదివినంత మాత్రాన తెలిసిపోతోందా. కాదు. శ్రవణాత్- శ్రవణం చేయాలి.

శ్రవణం ఎలా చేయాలో శివపురాణంలో శివుడు చెప్తాడు. “ప్రియుడు ప్రియురాలి గురించి కబుర్లు వినడానికి ఎంత అటెన్షన్ పే చేస్తాడో నా విషయం వినడానికి అంత ఆసక్తి చూపడాన్ని” శ్రవణం అంటారు అన్నాడు. Sweet Nothings అంటారు. ఏమీ ఉండదు కానీ Sweet గా ఉంటుందిట. ప్రియుడు ప్రియురాలి మాటలు వినడానికి ఎంత ఆసక్తి చూపిస్తాడో భగద్విషయాలు వినడానికి శ్రద్ధాళువు అంత ఆసక్తి చూపిస్తాడట.

శ్రవణం తరువాత తదర్థం మననాత్-అర్థాన్ని మననం చేయాలి. మననం చేసినదాన్ని ధ్యానించాలి. ధ్యానించాక కలిగే ఆనందపు అనుభూతిని వ్యక్తీకరించడమే సంకీర్తన. మద్దెలలు, హార్మోనియం పట్టుకొని పాడడం కాదు సంకీర్తన అంటే. సంకీర్తనా గీతం అనే మాటకి శాస్త్రీయమైన అర్థం ఏంటంటే ఆనందానుభూతితో  పలికే వ్యక్తీకరణ. అది జరిగితే అప్పుడు ఆ సర్వాత్మకుడైన ఈశ్వరునితో తాదాత్మ్యం చెంది జీవుడనబడే నేను ఈశ్వరుడికి వేరు అనే భావం పోయి “ఈశ్వరత్వం తథః” దానిని పొందుతాడు.