మెడలో గుచ్చుకున్న త్రిశూలం.. వైద్యం కోసం 65 కి.మీ. ప్రయాణం
Trishul | ఈ వ్యక్తి మృత్యుంజయుడే. మెడలో గుచ్చుకున్న త్రిశూలంతో ఒకట్రెండు కిలోమీటర్లు కాదు.. ఏకంగా 65 కిలోమీటర్లు ప్రయాణించాడు. ఆ తర్వాత సర్జరీ చేయించుకుని ప్రాణాలతో బయటపడ్డాడు. తీవ్ర రక్తస్రావం జరిగినప్పటికీ అతని ప్రాణాలకు ఎలాంటి ముప్పు సంభవించలేదు. ఈ ఘటన పశ్చిమ బెంగాల్‌లోని కల్యాణిలో వెలుగు చూసింది. వివరాల్లోకి వెళ్తే.. భాస్కర్ రామ్ అనే వ్యక్తి నిత్యం పూజలు చేస్తుంటాడు. ఆయన ఇంట్లో 150 ఏండ్ల క్రితం నాటి త్రిశూలం ఉంది. అయితే నవంబర్ […]

Trishul | ఈ వ్యక్తి మృత్యుంజయుడే. మెడలో గుచ్చుకున్న త్రిశూలంతో ఒకట్రెండు కిలోమీటర్లు కాదు.. ఏకంగా 65 కిలోమీటర్లు ప్రయాణించాడు. ఆ తర్వాత సర్జరీ చేయించుకుని ప్రాణాలతో బయటపడ్డాడు. తీవ్ర రక్తస్రావం జరిగినప్పటికీ అతని ప్రాణాలకు ఎలాంటి ముప్పు సంభవించలేదు. ఈ ఘటన పశ్చిమ బెంగాల్‌లోని కల్యాణిలో వెలుగు చూసింది.
వివరాల్లోకి వెళ్తే.. భాస్కర్ రామ్ అనే వ్యక్తి నిత్యం పూజలు చేస్తుంటాడు. ఆయన ఇంట్లో 150 ఏండ్ల క్రితం నాటి త్రిశూలం ఉంది. అయితే నవంబర్ 27వ తేదీన భాస్కర్‌కు మరో వ్యక్తి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. సహనం కోల్పోయిన ఆ వ్యక్తి.. భాస్కర్‌పై 150 ఏండ్ల నాటి త్రిశూలంతో దాడి చేశాడు. త్రిశూలాన్ని మెడపై పొడిచాడు. దీంతో అది ఎడమ వైపు నుంచి కుడి వైపునకు చొచ్చుకెళ్లింది.
భాస్కర్ తీవ్ర రక్తస్రావంతో బాధపడుతూనే.. చికిత్స నిమిత్తం ఏకంగా 65 కిలోమీటర్లు ప్రయాణించాడు. అనంతరం కోల్‌కతాలోని నీల్‌రతన్ సర్కార్ మెడికల్ కాలేజీ ఆస్పత్రికి చేరుకున్నాడు. భాస్కర్‌ను చూసి వైద్యులు షాకయ్యారు. డాక్టర్లు సర్జరీ నిర్వహించి త్రిశూలాన్ని తొలగించారు. అయితే బాధితుడి శరీర అవయవాలతో పాటు ధమనులు, సిరలకు ఎలాంటి నష్టం జరగలేదన్నారు. ఇది వైద్య చరిత్రలోనే వండర్ అని వైద్యులు పేర్కొన్నారు. ప్రస్తుతం భాస్కర్ కోలుకుంటున్నాని డాక్టర్లు స్పష్టం చేశారు.
మెడలో గుచ్చుకున్న త్రిశూలంతో వచ్చిన భాస్కర్‌లో ఎలాంటి భయం చూడలేదని వైద్యులు తెలిపారు. సర్జరీ చేస్తున్న సమయంలో కూడా అతను ఎలాంటి ఆందోళనకు గురి కాలేదని చెప్పారు. అయితే భాస్కర్ పరిస్థితిని చూసి అతని సోదరి స్పృహ కోల్పోయినట్లు తెలిసింది.