Gurugram | భోజ్‌పురి నటిపై అత్యాచారం.. హోటల్‌కు పిలిచి దారుణం

Gurugram ఇంటర్వ్యూ సాకుతో గురుగ్రామ్‌లోని ఓ హోటల్‌కు పిలిచి దారుణం ఇన్‌స్టాగ్రామ్ స్నేహితుడి దుశ్చ‌ర్చ‌.. వివిధ సెక్ష‌న్ల కింద కేసు న‌మోదు విధాత‌: ఆన్‌లైన్ వేదికల ద్వారా ప‌రిచ‌యం అయ్యే వ్య‌క్తుల‌ను న‌మ్మొద్ద‌ని పోలీసులు ఎంత చెప్పినా విన‌క వారి చేతుల్లో చిక్కి అన్ని విధాలుగా న‌ష్ట‌పోతున్నారు. ఇన్‌స్టాగ్రామ్‌లో స్నేహం చేసిన వ్యక్తి తనపై అత్యాచారం చేశాడని భోజ్‌పురి నటి ఫిర్యాదు చేసింది. ఆమె తెలిపిన వివరాల ప్రకారం.. ఓ వ్యక్తి ఇంటర్వ్యూ సాకుతో గురుగ్రామ్‌లోని ఓ […]

Gurugram | భోజ్‌పురి నటిపై అత్యాచారం.. హోటల్‌కు పిలిచి దారుణం

Gurugram

  • ఇంటర్వ్యూ సాకుతో గురుగ్రామ్‌లోని ఓ హోటల్‌కు పిలిచి దారుణం
  • ఇన్‌స్టాగ్రామ్ స్నేహితుడి దుశ్చ‌ర్చ‌.. వివిధ సెక్ష‌న్ల కింద కేసు న‌మోదు

విధాత‌: ఆన్‌లైన్ వేదికల ద్వారా ప‌రిచ‌యం అయ్యే వ్య‌క్తుల‌ను న‌మ్మొద్ద‌ని పోలీసులు ఎంత చెప్పినా విన‌క వారి చేతుల్లో చిక్కి అన్ని విధాలుగా న‌ష్ట‌పోతున్నారు. ఇన్‌స్టాగ్రామ్‌లో స్నేహం చేసిన వ్యక్తి తనపై అత్యాచారం చేశాడని భోజ్‌పురి నటి ఫిర్యాదు చేసింది. ఆమె తెలిపిన వివరాల ప్రకారం.. ఓ వ్యక్తి ఇంటర్వ్యూ సాకుతో గురుగ్రామ్‌లోని ఓ హోటల్‌కు పిలిచి ఈ దారుణానికి పాల్పడ్డాడు. నివేదిక ప్రకారం, నటి మరియు

పోలీసుల కథనం ప్రకారం,

ఢిల్లీలో నివసించే భోజ్‌పూరి న‌టికి ఇన్‌స్టాగ్రామ్‌లో పెద్ద సంఖ్యలో ఫాలోవర్లు ఉన్నారు. ఇన్‌స్టాగ్రామ్ ద్వారా మహేష్ పాండే అనే వ్య‌క్తితో స్నేహం చేసింది. అతను ఆమెకు భోజ్‌పురి చిత్రాలలో నటించే అవకాశం క‌ల్పిస్తాన‌ని న‌మ్మించాడు. జూన్ 29న ఇంటర్వ్యూ కోసం ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని గురుగ్రామ్‌లోని ఒక హోటల్‌కు పిలిచాడు. అనంత‌రం అమెపై లైంగిక‌దాడికి పాల్ప‌డ్డాడు. జ‌రిగిన విషయం ఎవ‌రికైనా చెబితే చంపేస్తానని అత‌డు బెదిరించాడు. ఈ మేర‌కు బాధితురాలు ఫిర్యాదు చేసింది.

“నేను హోటల్‌కు చేరుకున్నప్పుడు. మహేష్ అప్పటికే నన్ను తీసుకెళ్లిన సుభాష్ అనే వ్య‌క్తి నకిలీ ఐడీతో గదిని బుక్ చేశాడు. కొన్ని ప్రశ్నలు అడిగిన తర్వాత అతను తాగడం ప్రారంభించాడు. ఆ తర్వాత అత‌డిని బ‌య‌ట‌కు పంపించాడు. నాపై అత్యాచారం చేశాడు. అని బాధితురాలు పోలీసుల‌కు ఫిర్యాదు చేసింది.

బాధితురాలి ఫిర్యాదు మేర‌కు కేసు న‌మోదు చేసి దర్యాప్తు జరుపుతున్న‌ట్టు గురుగ్రామ్ క్రైమ్ భ్రాంచ్ ఏసీసీ వ‌రుణ్ దహియా తెలిపారు. నిందితుడు మహేష్ గురుగ్రామ్‌లోని చక్కర్‌పూర్ ప్రాంతానికి చెందిన వ్య‌క్తిగా గుర్తించిన‌ట్టు పేర్కొన్నారు.