Bhola Shankar | భోళా శంకర్ సినిమాలో.. చిరు నోట వెన్నుపోటు డైలాగ్.. ఎవరిని ఉద్దేశించి..!
Bhola Shankar | మెగాస్టార్ చిరంజీవి, అందాల భామ తమన్నా ప్రధాన పాత్రలలో మెహర్ రమేష్ తెరకెక్కించిన చిత్రం భోళా శంకర్. ఎన్నో అంచనాల మధ్య వచ్చిన ఈ సినిమా నెగెటివ్ టాక్ దక్కించుకుంది. ఫస్టాఫ్‌లో కామెడీ పెద్దగా వర్కువట్ కాలేదు. చిరంజీవికి కూడా స్క్రీన్ స్పేస్ తక్కువగా ఉండడం ఫ్యాన్స్‌ని నిరాశ పరచింది. ఇక సెకండ్ హాఫ్ చూస్తే.. ఫ్యామిలీ ఆడియన్స్ ని ఆకట్టుకునే సన్నివేశాలు పడడం కాస్త బెటర్‌గా మారింది.. ఫన్నీ సీన్స్ ఎబ్బెట్టుగా […]

Bhola Shankar |
మెగాస్టార్ చిరంజీవి, అందాల భామ తమన్నా ప్రధాన పాత్రలలో మెహర్ రమేష్ తెరకెక్కించిన చిత్రం భోళా శంకర్. ఎన్నో అంచనాల మధ్య వచ్చిన ఈ సినిమా నెగెటివ్ టాక్ దక్కించుకుంది. ఫస్టాఫ్‌లో కామెడీ పెద్దగా వర్కువట్ కాలేదు. చిరంజీవికి కూడా స్క్రీన్ స్పేస్ తక్కువగా ఉండడం ఫ్యాన్స్‌ని నిరాశ పరచింది.
ఇక సెకండ్ హాఫ్ చూస్తే.. ఫ్యామిలీ ఆడియన్స్ ని ఆకట్టుకునే సన్నివేశాలు పడడం కాస్త బెటర్‌గా మారింది.. ఫన్నీ సీన్స్ ఎబ్బెట్టుగా అనిపించాయి మ్యూజిక్ కూడా అంత అలరించలేక పోయింది. సంగీతంపై కాస్త దృష్టి పెట్టి ఉంటే బాగుండేది. సినిమా మిక్స్ డ్ టాక్ రావడంతో ఈ సినిమా ఎంత వసూళ్లు రాబడుతుందనేది ఇంట్రెస్టింగ్‌గా మారింది.
ఇక ఈ సినిమాలోని వెన్నుపోటు డైలాగ్ ఒకటి ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. మూవీ సెకండాఫ్‌లో సెకండాఫ్‌లో చిరంజీవి ఒంటిరిగా నడుచుకుంటూ వెళుతుండగా, కొందరు రౌడీలు వచ్చి చిరంజీవిని పొడిచేసి వెళ్లిపోతారు. అప్పుడు కీర్తిసురేష్ చిరుని కాపాడే ప్రయత్నం చేస్తుంది. అయితే చిరుని వెనక నుంచి పొడవడంతో రక్తం కారుతుండగా కీర్తి సురేష్ తెగ బాధ పడుతుంది.
ఆ సమయంలో చిరంజీవి.. నాకు ఇలాంటి వెన్నుపోట్లు కామనే అని చెబుతాడు. ఇప్పుడు చిరంజీవి చెప్పిన ఈ డైలాగ్ ప్రకంపనలు పుట్టిస్తుంది. ఈ డైలాగ్ కథ ప్రకారం రాసిందా, లేదంటే పొలిటికిల్ యాంగిల్‌లో కావాలని ఇది పెట్టారా అని చర్చ నడుస్తుంది. ప్రజారాజ్యం పెట్టిన సమయంలో ఎవరైనా చిరుని వెన్నుపోటు పొడిచారా లేక సినిమాల్లో తన అనుకున్న వాళ్లు ముంచేసారా అని సోషల్ మీడియాలో చర్చ మొదలైంది.
పవన్ కళ్యాణ్ రీసెంట్ చిత్రం బ్రోలో అంబంటి రాంబాబుని విమర్శిస్తూ శ్యాంబాబు అని పెట్టారు. ఇప్పుడు అదే స్టైల్‌లో భోళా శంకర్‌లో కూడా ఇలాంటి డైలాగ్ పెట్టారా అని పలువురు ముచ్చటించుకుంటున్నారు. మరి దీనిపై చిత్ర బృందం ఏమైన స్పందిస్తుందా అనేది చూడాలి. ఇక భోళా శంకర్ విషయానికి వస్తే.. చిత్రంలో చిరు సరసన తమన్నా భాటియా హీరోయిన్ గా నటించారు.
కీర్తీ సురేష్.. చిరు సోదరిగా నటించగా, ఆమెకు జోడీగా సుశాంత్ కనిపించారు. తమిళంలో అజిత్ హీరోగా నటించిన ‘వేదాళం’ రీమేక్ గా చిత్రం రూపొందగా, చిరంజీవి ఇమేజ్, ఆయన నుంచి అభిమానులు ఆశించే అంశాలను దృష్టిలో పెట్టుకుని చిత్రంలో పలు మార్పులు చేసినట్టు మెహర్ రమేష్ చెప్పుకొచ్చారు