4 రోజుల్లో 6 లక్షల కోట్లు ఆవిరి
-దేశీయ స్టాక్ మార్కెట్లలో కొనసాగుతున్న నష్టాలు విధాత: దేశీయ స్టాక్ మార్కెట్ల (STOCK MARKETS) నష్టాలు.. మదుపరుల సంపదను పెద్ద ఎత్తున కరిగించేస్తున్నాయి. కేవలం 4 రోజుల్లో ఏకంగా 6 లక్షల కోట్ల రూపాయలు ఆవిరైపోయాయి. గత నాలుగు ట్రేడింగ్ సెషన్లలో బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ (BSE) బ్లూచిప్ సూచీ సెన్సెక్స్ 1,300 పాయింట్లకుపైగా పడిపోయింది. దీంతో ఆయా కంపెనీల్లో పెట్టుబడులు పెట్టిన మదుపరులు కూడా భారీగానే నష్టాలను చవిచూడాల్సి వచ్చింది. బుధవారం ట్రేడింగ్‌లోనూ సూచీలు భారీగానే […]

-దేశీయ స్టాక్ మార్కెట్లలో కొనసాగుతున్న నష్టాలు
విధాత: దేశీయ స్టాక్ మార్కెట్ల (STOCK MARKETS) నష్టాలు.. మదుపరుల సంపదను పెద్ద ఎత్తున కరిగించేస్తున్నాయి. కేవలం 4 రోజుల్లో ఏకంగా 6 లక్షల కోట్ల రూపాయలు ఆవిరైపోయాయి. గత నాలుగు ట్రేడింగ్ సెషన్లలో బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ (BSE) బ్లూచిప్ సూచీ సెన్సెక్స్ 1,300 పాయింట్లకుపైగా పడిపోయింది.
దీంతో ఆయా కంపెనీల్లో పెట్టుబడులు పెట్టిన మదుపరులు కూడా భారీగానే నష్టాలను చవిచూడాల్సి వచ్చింది. బుధవారం ట్రేడింగ్‌లోనూ సూచీలు భారీగానే నష్టపోయాయి. బీఎస్ఈ మార్కెట్ విలువ రూ.261.87 లక్షల కోట్లకు క్షీణించింది.
అంతర్జాతీయ స్టాక్ మార్కెట్లలో ఒడిదుడుకులు, అమెరికా ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ వడ్డీరేట్ల పెంపు భయాలు, అదానీ స్టాక్స్‌లో అమ్మకాల ఒత్తిడి, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) మినట్స్, విదేశీ మదుపరుల (FII) పెట్టుబడుల ఉపసంహరణలు, బాండ్ ఈల్డ్స్, భౌగోళిక రాజకీయ అనిశ్చితులు, సెన్సెక్స్, నిఫ్టీ సాంకేతిక స్థాయిలు వంటివి మార్కెట్ నష్టాలకు దారితీస్తున్నాయి.