Wrestlers | రెజ్లర్ల భారీ విజయం.. బ్రిజ్ భూషణ్‌పై ఢిల్లీ పోలీసులు చార్జిషీట్
1000 పేజీలతో రోస్ అవెన్యూ జిల్లా కోర్టుకు సమర్పించిన పోలీసులు కేంద్ర క్రీడల మంత్రి హామీ ఇచ్చిన కొద్ది రోజులకే సమర్పణ చార్జ్‌షీట్ తర్వాత జరుగబోయే పరిణామమేమిటీ? విధాత: భారత రెజ్లర్ల (Wrestlers)కు భారీ విజయం లభించింది. రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (డబ్ల్యూఎఫ్‌ఐ) చీఫ్ బ్రిజ్ భూషణ్ శరన్ సింగ్‌కు వ్యతిరేకంగా చార్జిషీట్ దాఖలైంది. మైనర్‌తోపాటు పలువురు రెజర్లపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారనే ఆరోపణలపై బ్రిజ్‌పై చార్జిషీట్ దాఖలు చేయడానికి ఢిల్లీ పోలీసులు గురువారం రోస్ […]

- 1000 పేజీలతో రోస్ అవెన్యూ జిల్లా కోర్టుకు సమర్పించిన పోలీసులు
- కేంద్ర క్రీడల మంత్రి హామీ ఇచ్చిన కొద్ది రోజులకే సమర్పణ
- చార్జ్‌షీట్ తర్వాత జరుగబోయే పరిణామమేమిటీ?
విధాత: భారత రెజ్లర్ల (Wrestlers)కు భారీ విజయం లభించింది. రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (డబ్ల్యూఎఫ్‌ఐ) చీఫ్ బ్రిజ్ భూషణ్ శరన్ సింగ్‌కు వ్యతిరేకంగా చార్జిషీట్ దాఖలైంది. మైనర్‌తోపాటు పలువురు రెజర్లపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారనే ఆరోపణలపై బ్రిజ్‌పై చార్జిషీట్ దాఖలు చేయడానికి ఢిల్లీ పోలీసులు గురువారం రోస్ అవెన్యూ జిల్లా కోర్టుకు చేరుకున్నారు.
అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్‌కు చార్జ్‌షీట్ సమర్పించారు. బీజేపీ ఎంపీ, డబ్ల్యూఎఫ్‌ఐ చీఫ్‌పై లైంగిక వేధింపులు, దాడికి పాల్పడ్డారనే అభియోగాలతో ఐదు ఫిర్యాదులకు సంబంధించి ఢిల్లీ పోలీసులు సుమారు 1000 పేజీల ఛార్జిషీట్‌ను దాఖలు చేసినట్టు తెలుస్తున్నది.
కేంద్ర క్రీడల మంత్రి అనురాగ్ ఠాకూర్ ఈ నెల 7న ఒలింపిక్ పతకాల విజేతలైన రెజ్లర్లు బజరంగ్ పునియా, సాక్షి మాలిక్‌లను కలుసుకుని ఈ నెల 15లోగా ఈ కేసులో ఛార్జిషీట్ దాఖలు చేస్తామని హామీ ఇచ్చిన కొద్ది రోజులకే ఈ పరిణామం చోటుచేసుకున్నది. దీంతో రెజ్లర్జకు భారీ విజయం దక్కినట్టయింది.
రెజ్లర్ల చేసిన డిమాండ్లు ఏమిటంటే?
గత వారం కేంద్రం మంత్రితో జరిగిన చర్చల సందర్భంగా రెజ్లర్లు ప్రధానంగా నాలుగు డిమాండ్లను ప్రభుత్వం ఎదుట పెట్టారు. డబ్ల్యూఎఫ్ఐచీఫ్ బ్రిజ్ భూషణ్ ను అరెస్టు చేయాలి. రెజ్లర్లపై ఎఫ్‌ఐఆర్‌లను ఉపసంహరించుకోవాలి. బ్రిజ్ భూషన్‌తోపాటు ఆయన కుటుంబ సభ్యులను డబ్ల్యూఎఫ్ఐ నుంచి తొలగించాలి. మహిళా నేతృత్వంలో అపెక్స్ రెజ్లింగ్ కమిటీని ఏర్పాటుచేయాలి.
#WATCH | Delhi Police officials arrive at Patiala House Court Complex with a chargesheet in wrestlers issue. pic.twitter.com/9QGofenudE
— ANI (@ANI) June 15, 2023
ప్రభుత్వం వేటిని అంగీకరించిందంటే?
రెజ్లర్లపై నమోదైన ఎఫ్‌ఐఆర్‌ల ఉపసంహరణకు క్రీడా మంత్రి అంగీకరించారు. మహిళా నేతృత్వంలో డబ్ల్యూఎఫ్ఐ అంతర్గత ఫిర్యాదుల పరిష్కార కమిటీని ఏర్పాటు ఆమోదం తెలిపారు. రెజ్లర్ల డిమాండ్ మేరకు అధ్యక్షుడిగా మూడు పర్యాయాలు పూర్తి చేసిన బ్రిజ్ భూషన్‌ను, ఆయన సహచరులను ఎన్నికల్లో పోటీ చేయడానికి అనుమతించబోమని చెప్పారు.
డబ్ల్యూఎఫ్ఐ చీఫ్ వాదన ఏమిటంటే?
డబ్ల్యూఎఫ్ఐ చీఫ్, బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ తనపై వచ్చిన ఆరోపణలను తిరస్కరించారు. “చార్జ్‌షీట్ దాఖలు చేయనివ్వండి, నేను ఏమీ చెప్పనవసరం లేదు. విషయం కోర్టులో ఉన్నది, తీర్పు కోసం వేచి చూద్దాం” అని తెలిపారు. లోక్‌సభ కైసర్‌గంజ్ స్థానానికి పోటీ చేయబోతున్నట్టు తాజాగా ప్రకటించారు. వచ్చే ఏడాది ఎన్నికలు. డబ్ల్యూఎఫ్‌ఐ చీఫ్‌గా తన సంస్కరణల కారణంగా హర్యానాకు చెందిన కాంగ్రెస్ నేతలు తనపై కుట్ర పన్నారని ఆరోపించారు.
చార్జ్‌షీట్ తర్వాత జరుగబోయే పరిణామమేమిటీ?
చార్జ్‌షీట్ దాఖలు చేసిన తర్వాత రెజ్లర్లకు అంతర్గత సమావేశం ఉంటుంది. తదుపరి కార్యాచరణపై చర్చించి తర్వాత మీడియాకు వివరాలు వెల్లడిస్తారు. డబ్ల్యూఎఫ్‌ఐ చీఫ్ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌ను అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ వినేష్ ఫోగట్, బజరంగ్ పునియా, సాక్షి మాలిక్ తదితర అగ్రశ్రేణి రెజ్లర్లు ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నెలల తరబడి నిరసన చేపట్టారు. ఈ కేసుకు సంబంధించి ఢిల్లీ పోలీసులు ఇప్పటివరకు 150 మందికి పైగా వాంగ్మూలాలను నమోదు చేశారు.