Kalpana Iyer, Ramba Ho Song| “రంబా హో” పాటకు మళ్లీ కల్పనా అయ్యర్ డాన్స్..వైరల్

అలనాటి అందాల తారా కల్పనా అయ్యర్ తాజాగా ఓ పెళ్లి వేడుకలో తన ఐకానిక్ "రంబా హో" పాటకు 45ఏళ్ల తర్వతా .. 70 ఏళ్ళ వయసులో డాన్స్ చేసి అందరిని అశ్చర్చపరిచారు. కల్పనా అయ్యర్ చేసిన డాన్స్ చూసిన వారంతా ఆమెను అభినందిస్తున్నారు. ముదిమి వయసులో ఆమె చూపిన ఎనర్జీ, గ్రేస్ చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు.

Reported by: Y.V. Narsimha Reddy | వినోదం | Feb 01, 2026, 5:54 pm IST
Read Time: 3 mins
Kalpana Iyer, Ramba Ho Song| “రంబా హో” పాటకు మళ్లీ కల్పనా అయ్యర్ డాన్స్..వైరల్

విధాత : అలనాటి అందాల తార కల్పనా అయ్యర్ 45 ఏళ్లక్రితం ‘అర్మాన్’ (1981) చిత్రంలోని ‘రంభ హో’ పాటలో తన డాన్స్ తో ప్రేక్షకులను ఉర్రూతలూగించిన సంగతి తెలిసిందే. ఐకానిక్ హిట్ సాంగ్ గా నిలిచిన “రంబా హో” పాట సినీ ప్రేక్షకుల మదిలో నేటికి క్రేజీ సాంగ్ గా కొనసాగుతుంది. ఇటీవల బాక్సాఫీస్ హిట్ సినిమా ధురంధర్ మూవీలో ఈ పాటను రీమేక్ చేశారు.

తాజాగా ఓ పెళ్లి వేడుకలో కల్పనా అయ్యర్ తన ఐకానిక్ “రంబా హో” పాటకు 70 ఏళ్ళ వయసులో డాన్స్ చేసి అందరిని అశ్చర్చపరిచారు. ఎలాంటి రిహార్సల్ లేకుండా చీరకట్టులోనే 45సంవత్సరాల తర్వాత 70ఏళ్ల వయసులో కల్పనా అయ్యర్ చేసిన డాన్స్ చూసిన వారంతా ఆమెను అభినందిస్తున్నారు. ముదిమి వయసులో ఆమె చూపిన ఎనర్జీ, గ్రేస్ చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు.

ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ధురంధర్ సినిమాలో “రంబా హో” పాటను రీమేక్ చేసినందుకు ఈ సందర్భంగా కల్పనా అయ్యర్ చిత్ర బృందానికి ధన్యవాదాలు తెలిపారు. అయితే తాను ఇంకా ఆ సినిమా చూడలేదన్నారు.