సార్.. న‌న్ను పాస్ చేయండి.. లేదంటే మా నాన్న పెళ్లి చేస్తాడు..

ఆమెకు చ‌ద‌వాల‌ని కోరిక ఉంది. కానీ ఇంట్లో ఆ ప‌రిస్థితులు లేవు. ఇక ఈసారి ఫెయిలైతే.. త‌ప్ప‌కుండా పెళ్లి చేస్తార‌ని ఆమెకు తెలుసు

సార్.. న‌న్ను పాస్ చేయండి.. లేదంటే మా నాన్న పెళ్లి చేస్తాడు..

ఆమెకు చ‌ద‌వాల‌ని కోరిక ఉంది. కానీ ఇంట్లో ఆ ప‌రిస్థితులు లేవు. ఇక ఈసారి ఫెయిలైతే.. త‌ప్ప‌కుండా పెళ్లి చేస్తార‌ని ఆమెకు తెలుసు. దీంతో బోర్డు ఎగ్జామ్స్ స‌మాధాన ప‌త్రంలో త‌న ఆవేద‌న‌ను వ్య‌క్త‌ప‌రిచింది. సార్.. న‌న్ను పాస్ చేయండి.. లేదంటే మా నాన్న నాకు పెళ్లి చేస్తార‌ని ఆన్ష‌ర్ షీటులో ఆ బాలిక పేర్కొంది. ఇప్పుడు ఇది సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది.

వివ‌రాల్లోకి వెళ్తే.. బీహార్‌లో టెన్త్ విద్యార్థుల‌కు బోర్డ్ ఎగ్జామ్స్ అవుతున్నాయి. అయితే ఓ బాలిక ఆన్ష‌ర్ షీటులో ఈ విధంగా రాసింది. మా నాన్న రైతు. నా చ‌దువుకు కావాల్సిన డ‌బ్బు కూడా సంపాదించ‌లేక‌పోతున్నాడు. రోజుకు క‌నీసం రూ. 400 సంపాదించ‌లేక‌పోతున్నాడు. దీంతో భ‌విష్య‌త్‌లో న‌న్ను చ‌దివించ‌డం క‌ష్టం. ఈ ప‌రీక్ష‌ల్లో 318 మార్కులు రావాల్సిందే అని నాన్న చెప్పాడు. లేదంటే చ‌ద‌వించ‌న‌ని చెప్పాడు. పెళ్లి చేస్తాన‌ని చెప్పాడు. స‌ర్ ప్లీజ్ సేవ్ మీ.. నాకు పెళ్లి చేసుకోవ‌డం ఇష్టం లేదు ప్లీజ్ స‌ర్ అంటూ ఆన్ష‌ర్ షీటులో ఆమె రాసుకొచ్చింది. బాలిక ఈ విధంగా రాసిన ఆన్ష‌ర్ సీటు నెట్టింట వైర‌ల్ అవుతోంది.