Biryani | ఒక్క రూపాయికే ప్లేట్ బిర్యానీ.. ఎగ‌బ‌డ్డ జ‌నాలు..

Biryani | ద‌మ్ బిర్యానీ.. ఆ పేరు విన‌గానే నోట్లో నీళ్లూరుతాయి. ఎప్పుడెప్పుడు తిందామా అని ఆత్రుత ప‌డుతుంటాం. ఇక మ‌న టేబుల్ మీద‌కు బిర్యానీ వ‌చ్చిందంటే చాలు.. ఆ వాస‌న‌కే క‌డుపు నిండిపోతోంది. మ‌రి అంత‌టి ఘుమ‌ఘుమ‌లాడించే బిర్యానీని రూపాయికే అమ్ముతున్నారంటే.. జ‌నాలు ఎగ‌బ‌డ‌కుండా ఉంటారా..? అంటే నో అని చెప్పొచ్చు. త‌ప్ప‌కుండా ఎగ‌బ‌డుతార‌నే చెప్పొచ్చు. క‌రీంన‌గ‌ర్ జిల్లా కేంద్రంలోని తెలంగాణ చౌక్ స‌మీపంలో కొత్త‌గా ఎంపైర్ హోట‌ల్‌ను శ‌నివారం ప్రారంభించారు. బిర్యానీ ల‌వ‌ర్స్ దృష్టిని […]

Biryani | ఒక్క రూపాయికే ప్లేట్ బిర్యానీ.. ఎగ‌బ‌డ్డ జ‌నాలు..

Biryani | ద‌మ్ బిర్యానీ.. ఆ పేరు విన‌గానే నోట్లో నీళ్లూరుతాయి. ఎప్పుడెప్పుడు తిందామా అని ఆత్రుత ప‌డుతుంటాం. ఇక మ‌న టేబుల్ మీద‌కు బిర్యానీ వ‌చ్చిందంటే చాలు.. ఆ వాస‌న‌కే క‌డుపు నిండిపోతోంది. మ‌రి అంత‌టి ఘుమ‌ఘుమ‌లాడించే బిర్యానీని రూపాయికే అమ్ముతున్నారంటే.. జ‌నాలు ఎగ‌బ‌డ‌కుండా ఉంటారా..? అంటే నో అని చెప్పొచ్చు. త‌ప్ప‌కుండా ఎగ‌బ‌డుతార‌నే చెప్పొచ్చు.

క‌రీంన‌గ‌ర్ జిల్లా కేంద్రంలోని తెలంగాణ చౌక్ స‌మీపంలో కొత్త‌గా ఎంపైర్ హోట‌ల్‌ను శ‌నివారం ప్రారంభించారు. బిర్యానీ ల‌వ‌ర్స్ దృష్టిని ఆక‌ర్షించేందుకు ప్రారంభం రోజున ఆ హోట‌ల్ యాజ‌మాన్యం ఆఫ‌ర్లు ప్ర‌క‌టించింది. కేవ‌లం ఒక్క రూపాయికే ప్లేట్ బిర్యానీని విక్ర‌యిస్తున్న‌ట్లు తెలిపింది. అయితే ఇందుకు ఓ నిబంధ‌న కూడా విధించింది యాజ‌మాన్యం. రూపాయి నోటు తీసుకొస్తేనే ఈ ఆఫ‌ర్ వ‌ర్తిస్తుంద‌ని, లేకపోతే మామూలు రేటుకే బిర్యానీ కొనాల్సి ఉంటుంద‌ని తెలిపింది.

ఇంకేముంది చాలా మంది రూపాయి నోట్లు తీసుకొచ్చి, బిర్యానీని కొనుగోలు చేశారు. ఆ బిర్యానీ కోసం జ‌నాలు ఎగ‌బ‌డ్డారు. మండుటెండ‌లోనూ బారులు తీరారు. హోట‌ల్ ప‌రిస‌ర ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ సంభ‌వించ‌డంతో.. స్థానికులు ఇబ్బందులు ప‌డ్డారు. మొత్తానికి పోలీసులు రంగ ప్ర‌వేశం చేసి జ‌నాల‌ను నిలువ‌రించారు.