అంతా బాగుంటే.. 9-10 శాతానికి లోన్లు ఎందుకు: మహేశ్వర్‌రెడ్డి

అప్పుల రాష్ట్రమని ఆర్ధిక శ్వేత పత్రం విడుదల చేసిన నేపధ్యంలో ఇచ్చిన ఎన్నికల హామీలను ఎలా అమలు చేస్తారో ప్రజలకు స్పష్టం చేయాలని మహేశ్వర్‌రెడ్డి డిమాండ్ చేశారు.

  • By: Somu    latest    Dec 20, 2023 10:45 AM IST
అంతా బాగుంటే.. 9-10 శాతానికి లోన్లు ఎందుకు: మహేశ్వర్‌రెడ్డి
  • గత ప్రభుత్వంపై బీజేపీ నేత మహేశ్వరెడ్డి విమర్శలు
  • అప్పుల రాష్ట్రంలో హామీలపై ప్రభుత్వం స్పష్టతనివ్వాలి
  • రేవంత్‌రెడ్డి ప్రభుత్వానికి డిమాండ్‌


విధాత : తెలంగాణ ప్రభుత్వం అప్పుల రాష్ట్రమని ఆర్ధిక శ్వేత పత్రం విడుదల చేసిన నేపధ్యంలో ఇచ్చిన ఎన్నికల హామీలను ఎలా అమలు చేస్తారో ప్రజలకు స్పష్టం చేయాలని బీజేపీ నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి డిమాండ్ చేశారు. ఆర్ధిక శ్వేతపత్రంపై జరిగిన లఘు చర్చలో ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం 72,658కోట్లుగా ఉండేదని, ఇప్పుడు 6లక్షల 71,757కోట్లుగా ఉందని ప్రభుత్వం వెల్లడించిందన్నారు. రాష్ట్రం అప్పుల కుప్పయిందంటూ శ్వేత పత్రం విడుదల చేసినందునా ప్రపంచ స్థాయిలో రాష్ట్రం పరపతి తగ్గిపోతుందని కొత్త అప్పులు కూడా పుట్టవని అలాంటప్పుడు కాంగ్రెస్ ఇచ్చిన హామీలు ఎలా అమలు చేస్తుందని నిలదీశారు.


ఆరు గ్యారంటీలతో పాటు 412హామీల అమలుకు ప్రభుత్వానికి 100రోజుల సమయమిస్తామని, అనంతరం వాటి అమలు కోసం ప్రజల తరుపునా పోరాడుతామన్నారు. గత ప్రభుత్వం మేం అప్పులు చేశాం సంపద సృష్టించామంటుందని, అంతా బాగుంటే 9-10శాతానికి రుణాలు ఎందుకు తీసుకున్నారని, వరల్డ్ బ్యాంకు, ఏసియన్ బ్యాంకుల నుంచి రుణాలు ఎందుకు తీసుకోలేదని ప్రశ్నించారు. తమ పాలనా వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు గత ప్రభుత్వం కేంద్రంపై నిందలు మోపే ప్రయత్నం చేస్తుందన్నారు.


కేంద్రం నుంచి వివిధ మార్గాల ద్వారా రాష్ట్రానికి వచ్చిన నిధుల చిట్టాను మహేశ్వర్‌రెడ్డి సభకు వివరించారు. కేంద్రం ఇచ్చిన నిధులను సద్వినియోగం చేసుకోలేదన్నారు. సీనియర్ లెజిస్లేటర్‌గా ఉన్న మాజీ మంత్రి హరీశ్‌రావు కేంద్రం రైతుల మోటార్లకు మీటర్లు పెట్టమందని, బిల్లులు వసూలు చేయమందని అసత్యాలు చెబుతున్నారని, పదేళ్లుగా ఇదే అసత్యాలతో పాలన సాగించి రాష్ట్రాన్ని ఆగం చేశారన్నారు. ఏపీ సీఎం జగన్ మోటార్లకు మీటర్లు పెట్టారని బిల్లులను ప్రభుత్వమే చెల్లిస్తుందని చెప్పారన్నారు.


రాష్ట్రాన్ని గత ప్రభుత్వం అప్పుల పాలు చేసి, ఆర్థిక వ్యవస్థను ధ్వంసం చేసిందన్నారు. గత ప్రభుత్వం తెచ్చిన కమర్షిల్ రుణాల్లో క్రేడిట్ రేటింగ్ ఏమిచ్చారో వెల్లడించాల్సిన అవసరముందన్నారు. విద్య, వైద్యాన్ని పూర్తిగా విస్మరించారని, దేశంలో చివరి స్థానంలో తెలంగాణ విద్యారంగ పురోగతి ఉండటం సిగ్గుచేటన్నారు. వైద్యంలో కూడా చివరి నుంచి నాల్గవ స్థానంలో ఉందన్నారు. కాగ్ అప్పులు కట్టాడానికి కూడా అప్పులు తెచ్చిన దుర్భర స్థితిలో రాష్ట్రం ఉందని కాగ్ రిపోర్టు వెల్లడించిందన్నారు. అప్పులు తెచ్చి కాంట్రాక్టులతో జేబులు నింపుకున్నారన్నారు.


గత ప్రభుత్వపాలనను కార్నర్ చేసేందుకు చేసిన శ్వేత పత్రం విడుదలతో మునుముందు నష్టం తప్పదన్నారు. శ్వేత పత్రం మేరకు రాబడిలో 35శాతం రెవెన్యూ జీతాలు, పెన్షన్లు, 34శాతం రుణాల రిపేమెంట్లకు పోతుందని, మిగిలిన 31శాతం రెవెన్యూతో కాంగ్రెస్ ఫ్రభుత్వం గత పథకాలను, కొత్త పథకాలను ఎలా ముందుకు తీసుకెలుతారన్నది పెద్ద ప్రశ్నార్ధకంగా మారిందన్నారు. ఆరు గ్యాంరటీలకు 70వేల కోట్లు ఖర్చువతుందన్నారు. ఇక 412హామీల సంగతేమిటో అర్ధం కావడం లేదన్నారు. ప్రభుత్వం ఇప్పుడు ఆర్ధిక పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేస్తున్న తీరు చూస్తే రాష్ట్ర ఆర్ధిక పరిస్థితిని అధ్యయనం చేయకుండా హామీలిచ్చిందా అన్న సందేహాం కల్గుతుందన్నారు. నియంత పాలనలో ఈ రాష్ట్రం నలిగిపోయిందన్నారు.


నిరుద్యోగ భృతిలో గత ప్రభుత్వం మాదిరిగా ఇవ్వకుంటే మేం ఊరుకోమన్నారు. ఆరు గ్యారంటీలతో పాటు 412హామీలను అమలు చేసే దాకా వెంటపడుతామన్నారు. డిసెంబర్ 9న చేస్తామని రెండు లక్షల రుణమాఫీ, 500బోనస్ వెంటనే ఇవ్వాలన్నారు. రాష్ట్ర ఆర్ధిక పరిస్థితిపై సలహాలివ్వడానికి వచ్చిన ఆర్‌బీఐ మాజీ గవర్నర్‌ రఘురామ్‌రాజన్ కూడా ఇంకా అప్పులు చేస్తే మరింత క్షిణిస్తుందన్నారన్నారని, అలాగని ప్రజలపై పన్నుల భారం మోపినా…హామీలు అమలు చేయకపోయినా బీజేపీ ప్రజా ఉద్యమాలు చేపడుతుందన్నారు. రెవెన్యూ పెంచడానికి గత ప్రభుత్వం మాదిరిగా ప్రభుత్వ భూములను అమ్ముకుంటే సహించలేది లేదన్నారు.