BJP | బిజేపీ జాతీయ కార్యవర్గంలోకి రాజగోపాల్ రెడ్డి!
BJP విధాత: బీజేపీ నేత, మాజీ ఎమ్మెల్యే కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డిని బిజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడిగా నియమిస్తూ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఉత్తుర్వులు జారీ చేశారు. కాంగ్రెస్ నుండి బిజెపిలోకి వచ్చిన రాజగోపాల్ రెడ్డి మునుగోడు ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. కొంత కాలంగా ఈటలతో కలిసి పార్టీలో సరైన గుర్తింపు లేదంటు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో పార్టీ జాతీయ నాయకత్వం రాష్ట్ర పార్టీలో […]

BJP
విధాత: బీజేపీ నేత, మాజీ ఎమ్మెల్యే కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డిని బిజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడిగా నియమిస్తూ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఉత్తుర్వులు జారీ చేశారు. కాంగ్రెస్ నుండి బిజెపిలోకి వచ్చిన రాజగోపాల్ రెడ్డి మునుగోడు ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు.
కొంత కాలంగా ఈటలతో కలిసి పార్టీలో సరైన గుర్తింపు లేదంటు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో పార్టీ జాతీయ నాయకత్వం రాష్ట్ర పార్టీలో మార్పులు చేస్తూ అధ్యకుడిగా ఉన్న బండి సంజయ్ స్థానంలో కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డిని నియమించింది.
ఈటలను ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్ గా నియమించింది. రాజగోపాల్ రెడ్డి కి జాతీయ కార్యవర్గ సభ్యుడి హోదాను కట్టబెట్టింది. అయితే జాతీయ కార్యవర్గ సభ్యుడి పదవితో రాజగోపాల్ రెడ్డి సంతృప్తి చెందుతారా లేక కాంగ్రెస్ నుండి అందుతున్న ఆహ్వానం మేరకు బిజేపీని వీడుతారా అన్నది మునుముందు తేలనుంది.