BJP | మోడీ అంత రిస్క్ చేస్తారా.. తమిళనాడు నుంచి పోటీ చేస్తారా?

BJP | దక్షిణాదిలో ప‌ట్టుకు బీజేపీ ఎత్తుగ‌డ‌లు.. మధురై నుంచి ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ను పోటీకి దించాల‌నే యోచ‌న‌ విధాత‌: 2024 ఎన్నిక్షల్లో మళ్ళీ గెలిచి మూడోసారి అధికారం చేపట్టే లక్ష్యంలో ఉన్న మోడీకి ఈసారి పరిస్థితి అంత అనుకూలంగా ఉండకపోవచ్చు అనే సందేహాల నడుమ కొత్త ఎత్తుగడలు వేసేందుకు బిజెపి సిద్ధం అవుతోందా ? తమకు బలం లేని దక్షిణాది నుంచి ఈసారి ఎంపీ సీట్లు కొట్టే లక్ష్యంతో ముందుకు వెళుతోందా ?? మొన్న […]

BJP | మోడీ అంత రిస్క్ చేస్తారా.. తమిళనాడు నుంచి పోటీ చేస్తారా?

BJP |

  • దక్షిణాదిలో ప‌ట్టుకు బీజేపీ ఎత్తుగ‌డ‌లు..
  • మధురై నుంచి ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ను పోటీకి దించాల‌నే యోచ‌న‌

విధాత‌: 2024 ఎన్నిక్షల్లో మళ్ళీ గెలిచి మూడోసారి అధికారం చేపట్టే లక్ష్యంలో ఉన్న మోడీకి ఈసారి పరిస్థితి అంత అనుకూలంగా ఉండకపోవచ్చు అనే సందేహాల నడుమ కొత్త ఎత్తుగడలు వేసేందుకు బిజెపి సిద్ధం అవుతోందా ? తమకు బలం లేని దక్షిణాది నుంచి ఈసారి ఎంపీ సీట్లు కొట్టే లక్ష్యంతో ముందుకు వెళుతోందా ?? మొన్న కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో తగిలిన దెబ్బకు విరుగుడు కూడా ఈ ప్రాంతం నుంచే కనుగొంటున్నారా.. చూడాలి..

ఈశాన్య భారతంతో బాటు దేశమంతా గెలిచిన బిజెపికి దక్షిణాది రాష్ట్రాలు మాత్రం లొంగడం లేదు. కేరళలో కమ్యూనిష్టులు.. కాంగ్రెస్ ఉన్నాయి. తమిళనడులోనూ డీఎంకే.. అన్నా డీఎంకే ఉన్నాయి.. ఆంధ్రాలో బిజెపికి బోణీ లేదు.. తెలంగాణలో ఒకడుగు ముందుకు.. రెండు ఆడుగులు వెనక్కి పడుతున్నాయి..

ఎంత ఉన్నా దక్షిణాదిలో కర్ణాటకలో మాత్రమే కాస్త బలం ఉంది. దీంతో మిగతా రాష్ట్రాల్లో బలం పుంజుకునేందుకు నరేంద్ర మోడీనే నేరుగా రంగంలోకి దిగాలని భావిస్తున్నారా? మోడీ స్వయంగా రంగంలోకి దిగి.. తమిళనాడులోని ఏదైనా నియోజకవర్గం నుంచి పోటీ చేస్తే.. కమలనాథుల్లో కొత్త జోష్ వస్తుందని ఆశిస్తున్నారు.

ఇందులో భాగంగానే ఇటీవల చోటు చేసుకున్న పరిణామాలు ఉన్నాయని అంటున్నారు. ఆనాడు తమిళ పీఠాధిపతులతో పూజలు చేయడమే కాకుండా రాజదండం పేరుతో తమిళనాడుకు చెందిన రాజవంశీకులకు చెందిన సింగోల్ ను తీసుకొని రావటం ద్వారా తమిళ సంస్కృతికి కు తాము ప్రాధాన్యత ఇస్తామన్న సందేశాన్ని ప్రజలకు ఇస్తున్నట్లు భావిస్తున్నారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో మధురై నుంచి ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ను దించాలన్నయోచనలో ఉన్నారట.

మొన్న తమిళనాడులో కేంద్రహోం మంత్రి అమిత్ షా మాట్లాడుతూ.. దేశ ప్రధానిగా తమిళ వ్యక్తిని చూడాలన్నది తన కల అన్నారు. అంటే నేరుగా ఓ తమిళుడు ప్రధాని అవడం సాధ్యం కాదు కానీ మోడీ తమిళనాడు నుంచి పోటీ చేయటం ద్వారా.. తమిళనాడుకు చెందిన ఎంపీ దేశ ప్రధాని అవ్వొచ్చనేది అమిత్ షా మనసులోని ఆలోచన అంటున్నారు. చూడాలి.. మున్ముందు ఇది ఎన్నిమలుపులు తిరుగుతుందో.. ప్రస్తుతం మోడీ ఉత్తరప్రదేశ్ లోని వారణాసి ఎంపీగా ఉన్నారు.