ఇస్తాంబుల్‌లో భారీ పేలుడు.. ఆరుగురు మృతి.. వీడియో వైరల్
Istanbul Blast | టర్కీలోని ఇస్తాంబుల్‌లో భారీ పేలుడు సంభవించింది. నిత్యం రద్దీగా ఉండే ఇస్తిక్‌లాల్ షాపింగ్ వీధిలో పేలుడు సంభవించడంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఈ పేలుళ్లకు ఆరుగురు మృతి చెందగా, మరో 53 మంది తీవ్రంగా గాయపడ్డారు. పేలుడు శబ్దం విన్న స్థానికులు అక్కడ్నుంచి పరుగులు తీశారు. పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను సమీప ఆస్పత్రులకు తరలించారు. ఈ ఘటనపై టర్కీ అధ్యక్షుడు రిసెప్ తాయిప్ ఎర్డోగాన్ స్పందించారు. ఈ పేలుళ్లను […]

Istanbul Blast | టర్కీలోని ఇస్తాంబుల్‌లో భారీ పేలుడు సంభవించింది. నిత్యం రద్దీగా ఉండే ఇస్తిక్‌లాల్ షాపింగ్ వీధిలో పేలుడు సంభవించడంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఈ పేలుళ్లకు ఆరుగురు మృతి చెందగా, మరో 53 మంది తీవ్రంగా గాయపడ్డారు. పేలుడు శబ్దం విన్న స్థానికులు అక్కడ్నుంచి పరుగులు తీశారు. పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను సమీప ఆస్పత్రులకు తరలించారు.
ఈ ఘటనపై టర్కీ అధ్యక్షుడు రిసెప్ తాయిప్ ఎర్డోగాన్ స్పందించారు. ఈ పేలుళ్లను ఆయన తీవ్రంగా ఖండించారు. ఇది ఉగ్రవాదులు చేసిన పనే అని ఆయన పేర్కొన్నారు. పేలుళ్లకు పాల్పడిన వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. దోషుల్ని కఠినంగా శిక్షిస్తామని ఎర్డోగాన్ చెప్పారు.
పేలుళ్లను నా కళ్లారా చూశాను..
ఇస్తిక్‌లాల్ వీధిలో జరిగిన పేలుళ్లను నా కళ్లారా చూశాను అని కెమెల్ డెనిజిక్ తెలిపారు. తనకు 55 మీటర్ల దూరంలోనే పేలుళ్లు సంభవించాయని పేర్కొన్నారు. క్షణాల్లో ఓ నలుగురు వ్యక్తులు కుప్పకూలిపోయారు. పలువురు తీవ్రంగా గాయపడినట్లు తెలిపారు. భారీ శబ్దం వినిపించడంతో చాలా మంది తమ పిల్లలను ఎత్తుకుని పరుగులు తీశారని చెప్పారు.
❗Blast hits central #Istanbul, local media report. pic.twitter.com/s95VcL1BRr
— NonMua (@NonMyaan) November 13, 2022