Marriage | వ‌రుడికి షాక్.. క‌ట్నం స‌రిపోలేద‌ని పెళ్లి క్యాన్షిల్ చేసిన వ‌ధువు

Marriage | ఇంకో గంట‌లో పెళ్లి.. అంతలోనే వ‌రుడి( Bride Groom )కి వ‌ధువు( Bride ) షాకిచ్చింది. త‌న‌కు క‌ట్నం( Dowry ) స‌రిపోలేద‌ని, ఈ పెళ్లి ర‌ద్దు చేసుకుంటున్న‌ట్టు వ‌ధువు తెగేసి చెప్పింది. చేసేదేమీ లేక ఎవ‌రి దారినా వారు వెళ్లిపోయారు. ఈ ఘ‌ట‌న మేడ్చ‌ల్ మ‌ల్కాజ్‌గిరి( Medchal Malkajgiri ) జిల్లాలోని ఘ‌ట్‌కేస‌ర్‌లో గురువారం రాత్రి వెలుగు చూసింది. వివ‌రాల్లోకి వెళ్తే.. పోచారం మున్సిపాలిటీకి చెందిన ఓ యువ‌కుడికి, భ‌ద్రాద్రి కొత్త‌గూడెం జిల్లా […]

Marriage | వ‌రుడికి షాక్.. క‌ట్నం స‌రిపోలేద‌ని పెళ్లి క్యాన్షిల్ చేసిన వ‌ధువు

Marriage | ఇంకో గంట‌లో పెళ్లి.. అంతలోనే వ‌రుడి( Bride Groom )కి వ‌ధువు( Bride ) షాకిచ్చింది. త‌న‌కు క‌ట్నం( Dowry ) స‌రిపోలేద‌ని, ఈ పెళ్లి ర‌ద్దు చేసుకుంటున్న‌ట్టు వ‌ధువు తెగేసి చెప్పింది. చేసేదేమీ లేక ఎవ‌రి దారినా వారు వెళ్లిపోయారు. ఈ ఘ‌ట‌న మేడ్చ‌ల్ మ‌ల్కాజ్‌గిరి( Medchal Malkajgiri ) జిల్లాలోని ఘ‌ట్‌కేస‌ర్‌లో గురువారం రాత్రి వెలుగు చూసింది.

వివ‌రాల్లోకి వెళ్తే.. పోచారం మున్సిపాలిటీకి చెందిన ఓ యువ‌కుడికి, భ‌ద్రాద్రి కొత్త‌గూడెం జిల్లా అశ్వారావుపేటకు చెందిన యువ‌తితో పెద్ద‌లు పెళ్లి నిశ్చ‌యించారు. అయితే వ‌రుడి త‌ర‌పు వారు వ‌ధువుకు రూ. 2 ల‌క్ష‌లు క‌ట్నం ఇచ్చేలా కుల పెద్ద‌ల స‌మ‌క్షంలో అంగీకారం కుదిరింది. ఇక గురువారం రాత్రి 7:21 గంట‌ల‌కు వీరికి వివాహం చేయాల‌ని పెద్ద‌లు నిర్ణ‌యించారు. అందుకు ఘ‌ట్‌కేస‌ర్‌లోని ఓ ఫంక్ష‌న్ హాల్‌లో ఏర్పాట్లు చేశారు.

అద‌నపు క‌ట్నం కావాల‌ని..

ముహుర్త స‌మ‌యానికి గంట ముందే వ‌రుడితో పాటు అత‌ని కుటుంబ స‌భ్యులు ఫంక్ష‌న్ హాల్‌కు చేరుకున్నారు. కానీ వ‌ధువు, ఆమె కుటుంబ స‌భ్యులు రాలేదు. ముహుర్తానికి స‌మ‌యం స‌మీపిస్తుండటంతో.. వ‌ధువు కుటుంబ స‌భ్యుల‌ను వ‌రుడి బంధువులు ఆరా తీశారు. మీరిచ్చే క‌ట్నం త‌మ అమ్మాయికి స‌రిపోలేద‌ట‌.. అందుకే పెళ్లి వ‌ద్ద‌ని వ‌ధువు అంటున్న‌ట్లు వ‌రుడి కుటుంబ స‌భ్యుల‌కు స‌మాచారం అందించారు. అద‌నపు క‌ట్నం కావాల‌ని వ‌ధువు డిమాండ్ చేస్తున్న‌ట్లు తెలిపారు.

రూ. 2 ల‌క్ష‌ల‌ను వ‌దులుకున్నారు..

దీంతో తాము మోస‌పోయామ‌ని గ్ర‌హించిన వ‌రుడి కుటుంబ స‌భ్యులు పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. వ‌ధువు కుటుంబ స‌భ్యుల‌ను పోలీసులు స్టేష‌న్‌కు ర‌ప్పించారు. పోలీసులు కౌన్సెలింగ్ చేసిన‌ప్ప‌టికీ వ‌ధువు మ‌న‌సు మార‌లేదు. దీంతో ముందుగా ఇచ్చిన రూ. 2 ల‌క్ష‌ల‌ను కూడా వ‌రుడి కుటుంబ స‌భ్యులు వ‌దులుకున్నారు. అనంత‌రం ఎవ‌రి దారినా వారు వెళ్లిపోయారు.