పిల్ల‌ల‌ను మార్చుకున్న అన్న‌ద‌మ్ములు.. ఎందుకో తెలుసా..?

Maharashtra | ఏ దంప‌తులైనా స‌రే ఒక అమ్మాయి, ఒక అబ్బాయి క‌ల‌గాల‌ని కోరుకుంటారు. కానీ ఈ ఇద్ద‌రు అన్న‌ద‌మ్ముళ్ల‌కు అది జ‌ర‌గ‌లేదు. అన్న‌కేమో ఇద్ద‌రు అబ్బాయిలు, త‌మ్ముడికేమో ఇద్ద‌రు అమ్మాయిలు జ‌న్మించారు. దీంతో ఆ అన్న‌ద‌మ్ముళ్లిద్ద‌రూ త‌మ పిల్ల‌ల‌ను ప‌ర‌స్ప‌రం మార్చుకున్నారు. వివ‌రాల్లోకి వెళ్తే.. మ‌హారాష్ట్ర సాంగ్లీ జిల్లాలోని షెగాల్ గ్రామానికి చెందిన బిరుదేవ్ మానే, అప్పాసో మానే అన్న‌ద‌మ్ములు. బిరుదేవ్ మానేకు ఇద్ద‌రు అబ్బాయిలు జ‌న్మించారు. ఐదేండ్ల కింద‌ట కుమారుడు జ‌న్మించ‌గా, రెండేండ్ల క్రితం […]

పిల్ల‌ల‌ను మార్చుకున్న అన్న‌ద‌మ్ములు.. ఎందుకో తెలుసా..?

Maharashtra | ఏ దంప‌తులైనా స‌రే ఒక అమ్మాయి, ఒక అబ్బాయి క‌ల‌గాల‌ని కోరుకుంటారు. కానీ ఈ ఇద్ద‌రు అన్న‌ద‌మ్ముళ్ల‌కు అది జ‌ర‌గ‌లేదు. అన్న‌కేమో ఇద్ద‌రు అబ్బాయిలు, త‌మ్ముడికేమో ఇద్ద‌రు అమ్మాయిలు జ‌న్మించారు. దీంతో ఆ అన్న‌ద‌మ్ముళ్లిద్ద‌రూ త‌మ పిల్ల‌ల‌ను ప‌ర‌స్ప‌రం మార్చుకున్నారు.

వివ‌రాల్లోకి వెళ్తే.. మ‌హారాష్ట్ర సాంగ్లీ జిల్లాలోని షెగాల్ గ్రామానికి చెందిన బిరుదేవ్ మానే, అప్పాసో మానే అన్న‌ద‌మ్ములు. బిరుదేవ్ మానేకు ఇద్ద‌రు అబ్బాయిలు జ‌న్మించారు. ఐదేండ్ల కింద‌ట కుమారుడు జ‌న్మించ‌గా, రెండేండ్ల క్రితం మ‌ళ్లీ కుమారుడే పుట్టాడు. అప్పాసోకు మొద‌టి బిడ్డ‌(4) పుట్టింది. రెండు నెల‌ల క్రితం మ‌ళ్లీ ఆడ శిశువు జ‌న్మించింది. ఈ క్ర‌మంలో రెండేండ్ల కుమారుడిని, రెండు నెల‌ల ఆడ శిశువును అన్న‌ద‌మ్ములు మార్చుకున్నారు. పిల్ల‌ల‌ను ద‌త్త‌త తీసుకోవ‌డంపై కుటుంబ స‌భ్యులు, స్థానికులు హ‌ర్షం వ్య‌క్తం చేస్తున్నారు.