Bruce Lee | వీడిన బ్రూస్ లీ మరణ రహస్యం..! కారణం అధిక నీరేనట..!
Bruce Lee | అమెరికన్ మార్షల్ ఆర్ట్స్ లెజెండ్, ఎంటర్ ది డ్రాగన్ స్టార్ బ్రూస్ లీ అంటే తెలియని వారు ఉండరు. బ్రూస్ లీకి ప్రపంచ వ్యాప్తంగా ఫాలోవర్స్ ఉన్నారు. తనకున్న స్పెషాలిటీతో కోట్లాది మంది అభిమానులను సొంతం చేసుకున్నారు. కానీ బ్రూస్ లీ యుక్త వయసులోనే ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయాడు. 32 ఏండ్ల వయసులోనే తన జీవితాన్ని ముగించాడు. బ్రూస్ లీ మరణించిన 49 ఏండ్ల తర్వాత ఆయన మరణ రహస్యాన్ని పరిశోధకులు […]

Bruce Lee | అమెరికన్ మార్షల్ ఆర్ట్స్ లెజెండ్, ఎంటర్ ది డ్రాగన్ స్టార్ బ్రూస్ లీ అంటే తెలియని వారు ఉండరు. బ్రూస్ లీకి ప్రపంచ వ్యాప్తంగా ఫాలోవర్స్ ఉన్నారు. తనకున్న స్పెషాలిటీతో కోట్లాది మంది అభిమానులను సొంతం చేసుకున్నారు. కానీ బ్రూస్ లీ యుక్త వయసులోనే ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయాడు. 32 ఏండ్ల వయసులోనే తన జీవితాన్ని ముగించాడు. బ్రూస్ లీ మరణించిన 49 ఏండ్ల తర్వాత ఆయన మరణ రహస్యాన్ని పరిశోధకులు కనుగొన్నారు. పరిశోధకుల అధ్యయనం ప్రకారం.. సెరిబ్రల్ ఎడెమా(మెదడు వాపు వ్యాధి)తో ప్రాణాలు కోల్పోయాడు.
1575 గ్రాముల వరకు ఉబ్బిన మెదడు..
అయితే బ్రూస్ లీ పోస్టుమార్టం నివేదికను పరిశీలిస్తే.. ఆయన మెదడు 1,575 గ్రాముల వరకు ఉబ్బినట్లు తెలిసింది. ఇది సగటు 1400 గ్రాముల కంటే ఎక్కువగా ఉబ్బి ఉంది. మెదడు వాపు కారణంగానే లీ చనిపోయినట్లు పరిశోధకులు నిర్ధారించారు. హైపోనాట్రేమియా కారణంగా ఎడెమా ఏర్పడి ఉండొచ్చని భావిస్తున్నారు. అధిక మోతాదులో నీరు తీసుకోవడం, శరీరంలోని సోడియం స్థాయిలు కరిగిపోయినప్పుడు హైపోనాట్రేమియా అభివృద్ధి చెందుతుంది. దీంతో మెదడులోని కణాల మధ్య అసమతుల్యత ఏర్పడి, ఫలితంగా ఉబ్బుతాయి. మరణానికి ఇది కూడా ఒక కారణం అని పరిశోధకులు పేర్కొన్నారు.
కిడ్నీ సంబంధిత వ్యాధులు వేధించాయి..
అంతేకాదు.. కిడ్నీ సంబంధిత సమస్యలు కూడా బ్రూస్ లీ ని వేధించాయని, అది కూడా అతను చనిపోవడానికి కారణమైందని శాస్త్రవేత్తలు క్లినికల్ కిడ్నీ జర్నల్‌లో ప్రచురించారు. బ్రూస్ లీ అధికంగా నీరు తీసుకునేవాడు. కానీ అదే స్థాయిలో మూత్ర విసర్జన చేయకపోయేవాడని, దాంతో హైపోనాట్రేమియాకు దారి తీసి ఉండొచ్చని పేర్కొన్నారు. మార్షల్ ఆర్ట్స్ చేసే సమయంలో బ్రూస్ లీ దాహాన్ని పెంచే జ్యూస్‌లు, ప్రోటీన్ డ్రింక్స్ బాగా సేవించే వారని తెలిసింది. అయితే మూత్ర పిండాల వ్యాధితో బాధపడుతున్న సమయంలో నీటిని చాలా తక్కువగా తీసుకోవాలి. కానీ లీ అది చేయలేదని పరిశోధకులు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
ఆ రోజు గంజాయి సేవించాడు..
అయితే బ్రూస్ లీ చనిపోయిన రోజు రాత్రి గంజాయి సేవించాడు. ఆ కొద్దిసేపటికే నీరు తాగేశాడు. అనంతరం లీకి తీవ్రమైన తలనొప్పి రావడంతో పాటు తల తిరగడం వంటి పరిస్థితిని ఎదుర్కొన్నాడు. ఆ బాధను భరించలేక ఈక్వేజిక్ అనే పెయిల్ కిల్లర్ తీసుకుని నిద్రలోకి జారుకున్నాడు. రెండు గంటల తర్వాత లీలో స్పందన, చలనం కనిపించలేదు. దీంతో అతను చనిపోయినట్లు నిర్ధారించారు.
బీ వాటర్ మై ఫ్రెండ్
బ్రూస్ లీ ఎప్పుడు కూడా ఈ కోట్‌ని ఉపయోగించేవాడు. బీ వాటర్ మై ఫ్రెండ్(నీరు కూడా నా స్నేహితుడు) అని లీ చెప్పేవాడు. మొత్తంగా అతను అధికంగా నీరు తీసుకోవడం వల్లే చనిపోయినట్లు తెలుస్తుందని పరిశోధకులు తమ జర్నల్‌లో ముగించారు. బ్రూస్ లీ మరణంపై ఇది పరిశోధకుల అభిప్రాయం మాత్రమే.. ఇదే కారణమని నిర్ధారించలేదు.