బుద్ధ వనం.. ఒక బౌద్ధ ప్రపంచం: తమిళనాడు MP
విధాత: నాగార్జునసాగర్‌లో తెలంగాణ ప్రభుత్వం నిర్మించిన బుద్ధవనం ఒక బౌద్ధ ప్రపంచమని తాను ఇక్కడ గడిపిన ప్రతిక్షణం తనకు ఎంతో ప్రశాంతతను హాయిని కలిగించిందని తమిళనాడు ఎంపీ డాక్టర్ తోల్కా పియన్ తిరుమా వాళ్వన్ అన్నారు. శుక్రవారం బుద్ధ వనం సందర్శించిన ఆయనకు బుద్ధవనం ప్రత్యేక అధికారి మల్లేపల్లి లక్ష్మయ్య ఆదేశాల మేరకు బుద్ధవనం సిబ్బంది ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా బుద్ధ వనంలోని బుద్ధుని పాదాలు, బుద్ధ చరితవనం, జాతకవనం, ధ్యానవనం, స్థూప పార్కులను […]

విధాత: నాగార్జునసాగర్‌లో తెలంగాణ ప్రభుత్వం నిర్మించిన బుద్ధవనం ఒక బౌద్ధ ప్రపంచమని తాను ఇక్కడ గడిపిన ప్రతిక్షణం తనకు ఎంతో ప్రశాంతతను హాయిని కలిగించిందని తమిళనాడు ఎంపీ డాక్టర్ తోల్కా పియన్ తిరుమా వాళ్వన్ అన్నారు.
శుక్రవారం బుద్ధ వనం సందర్శించిన ఆయనకు బుద్ధవనం ప్రత్యేక అధికారి మల్లేపల్లి లక్ష్మయ్య ఆదేశాల మేరకు బుద్ధవనం సిబ్బంది ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా బుద్ధ వనంలోని బుద్ధుని పాదాలు, బుద్ధ చరితవనం, జాతకవనం, ధ్యానవనం, స్థూప పార్కులను సందర్శించారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ మహా స్తూప నిర్మాణం తనను ఎంతగానో ఆకట్టుకుందని, ప్రపంచం ఎదుర్కొంటున్న అన్ని సమస్యలకు బుద్ధుని బోధనలే శరణ్యమన్నారు. ఆయనతో పాటు బుద్ధవనం పర్యవేక్షకులు నరసింహారావు, విష్ణు, గైడ్ సత్యనారాయణ, బుద్ధవనం సిబ్బంది తదితరులు ఉన్నారు.