Budvel land auction | కొత్త రికార్డులు కొట్టిన బుద్వేల్ భూముల వేలం
Budvel land auction ఎకరాకు అత్యధికం 41.25కోట్లు.. అత్యల్పం 33.25 కోట్లు ప్రభుత్వానికి 3,625.73కోట్ల ఆదాయం విధాత: కోకాపేట్ భూముల వేలం అందించిన భూమ్‌తో బుద్వేల్ భూముల వేలం సైతం కొత్త రికార్డులు కొట్టింది. ఎకరాకు అత్యధికంగా 41.25కోట్లకు అమ్ముడుపోయింది. అత్యల్పంగా 33.25కోట్లు ధర పలికింది. మొత్తం 14ఫ్లాట్లను ఈ వేలం పెట్టారు. అందులో కనీసంగా 3.04ఎకరాల నుంచి గరిష్టంగా 14.33 ఎకరాల ఫ్లాట్లు ఉన్నాయి. వీటి మొత్తం విస్థీర్ణం 100.01ఎకరాలుగా ఉంది. మూడు ఫ్లాట్లు 40కోట్లకు […]
Budvel land auction
- ఎకరాకు అత్యధికం 41.25కోట్లు.. అత్యల్పం 33.25 కోట్లు
- ప్రభుత్వానికి 3,625.73కోట్ల ఆదాయం
విధాత: కోకాపేట్ భూముల వేలం అందించిన భూమ్‌తో బుద్వేల్ భూముల వేలం సైతం కొత్త రికార్డులు కొట్టింది. ఎకరాకు అత్యధికంగా 41.25కోట్లకు అమ్ముడుపోయింది. అత్యల్పంగా 33.25కోట్లు ధర పలికింది.
మొత్తం 14ఫ్లాట్లను ఈ వేలం పెట్టారు. అందులో కనీసంగా 3.04ఎకరాల నుంచి గరిష్టంగా 14.33 ఎకరాల ఫ్లాట్లు ఉన్నాయి. వీటి మొత్తం విస్థీర్ణం 100.01ఎకరాలుగా ఉంది.

మూడు ఫ్లాట్లు 40కోట్లకు పైగా పలికాయి. కనీస ధరగా 20 కోట్లుగా నిర్ణయించగా , బిడ్ ప్రైజ్ 36.25కోట్లుగా పలకడం విశేషం. 100.01ఎకరాలకు 3625.73కోట్ల ఆదాయం వచ్చిందని హెచ్‌ఎండీఏ తెలిపింది. రెండు సెషన్లుగా బుద్వేల్ భూముల వేలం నిర్ణయించారు. తొలి సేషన్‌లో 58.11ఎకారల విస్థీర్ణంలోని ఏడు ఫ్లాట్లకు 1162.20కోట్ల కనీస ధరతో వేలం వేలం వేయగా 2,057.67కోట్లు ఆదాయం వచ్చింది.
రెండో సెషన్‌లో 41.90ఎకరాలకు సంబంధించి ఏడు ఫ్లాట్లను 838కోట్ల కనీస ధరకు వేలం పెట్టగా 1568.06కోట్ల ఆదాయం లభించింది. మొత్తం మీద 14ఫ్లాట్లకు 2000.20కోట్ల అప్‌సెట్ ధరతో వేలం పెట్టగా 3,625.73కోట్ల ఆదాయం రావడం విశేషం. ఇటీవల కోకాపేట నియోపోలిస్ లో 45.33ఎకరాలకు వేసిన వేలంలో 3319.60కోట్లు రావడం గమనార్హం. అయితే కోకాపేటలో ఎకరం 100.75కోట్లు పలకడం దేశంలోనే రికార్డుగా నిలిచింది
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram