బుర్జ్ ఖలీఫాను మించిపోనున్న కొత్త టవర్‌.. ఎక్కడ?

"తాటిని త‌న్నేవాడు ఉండే వాడి త‌ల‌త‌న్నేవాడు కూడా ఉంటాడు" అనేది నానుడి. దానిని నిజం చేయ‌బోతున్న‌ది జెడ్డా ట‌వ‌ర్‌

  • By: Somu    latest    Jan 10, 2024 10:56 AM IST
బుర్జ్ ఖలీఫాను మించిపోనున్న కొత్త టవర్‌.. ఎక్కడ?
  • ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన భవనం
  • రికార్డును చెరిపేయ‌నున్న‌ దుబాయ్ ట‌వ‌ర్‌
  • సౌదీ అరేబియాలో నిర్మిత‌మ‌వుతున్న
  • కిలోమీట‌రు పొడ‌వైన భారీ భ‌వ‌నం

విధాత‌: “తాటిని త‌న్నేవాడు ఉండే వాడి త‌ల‌త‌న్నేవాడు కూడా ఉంటాడు” అనేది నానుడి. దానిని నిజం చేయ‌బోతున్న‌ది జెడ్డా ట‌వ‌ర్‌. 14 ఏండ్ల క్రితం దుబాయ్‌లోని బుర్జ్ ఖలీఫా (828 మీటర్ల ఎత్తు) ట‌వ‌ర్ ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన భవనంగా అవతరించింది. ఎన్నో రికార్డులు నెలకొల్పడంతోపాటు గొప్ప పేరు తెచ్చుకున్న‌ది. 2004లో మొద‌లైన దీని నిర్మాణం ఆరేండ్ల‌పాటు నిర్విఘ్నంగా సాగింది. 2010లో భ‌వ‌నం ప్రారంభ‌మైంది. ఈ భవనం దుబాయ్ మధ్యలో భారీ, విభిన్నమైన భ‌వ‌నాల్లో ప్రధాన ఆకర్షణగా నిలిచింది.


ఇప్పుడు దానిని అధిగమించే కొత్త భవనం గురించి చర్చలు జరుగుతున్నాయి. బుర్జ్ ఖలీఫా చ‌రిత్ర‌ను చెరిపేలా ఆ నిర్మాణం ఉండబోతున్న‌ద‌నేది దాని సారాంశం. గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ ప్రకారం.. సౌదీ అరేబియాలో ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న భవనం పూర్తయిన తర్వాత బుర్జ్ ఖలీఫా కంటే కూడా ఎత్తుగా ఉంటుందని భావిస్తున్నారు. అదే జెడ్డా టవర్. దీనిని కింగ్‌డమ్ టవర్ అని కూడా పిలుస్తారు. ఇది 1,000 మీ (1 కిమీ; 3,281 అడుగులు) పొడవు ఉంటుంది. జెడ్డా ఎకనామిక్ కంపెనీ భవనం లగ్జరీ హౌసింగ్, ఆఫీస్ స్పేస్, సర్వీస్డ్ అపార్ట్‌మెంట్లు, లగ్జరీ కండోమినియంల మేళ‌వింపుగా ఈ భ‌వ‌నం ఉండ‌బోతున్న‌ది.


ఇది “ప్రపంచంలోనే ఎత్తైన భ‌వ‌నం” గా ఉంటుందని చెప్తున్నారు. టోక్యో అటాకామా అబ్జర్వేటరీ విశ్వవిద్యాలయం స్ట‌డీ ప్ర‌కారం.. జెడ్డా ట‌వ‌ర్‌ 5,640 మీ (18,503 అడుగులు) ఎత్తులో ఉంటుంది. జెడ్డా టవర్ విలువ‌ $1.23 బిలియన్ (రూ.1,02,10,25,46,000) ధర ట్యాగ్ ద‌క్కిచుకోనున్న‌ది. 20 బిలియన్ డాలర్ల మెగా-ప్రాజెక్ట్‌లో భాగమైన ఈ నార్త్ జెడ్డా సెంటర్‌పీస్ ఐదేండ్ల‌ విరామం తర్వాత 2023లో నిర్మాణాన్ని పునఃప్రారంభించింది. పూర్తి చేయడం మిస్టరీగా ఉన్నప్పటికీ, దాని ప్రతిపాదిత పరిమాణం, సౌకర్యాలు బుర్జ్ ఖలీఫా రికార్డు చెరిపేసేవిగా ఉన్నాయి.