Cancer | క్యాన్సర్‌ టెస్టు రిపోర్టు చూసి మహిళ భావోద్వేగం..

Cancer న్యూఢిల్లీ: ఏదైనా చిన్న కష్టంలో ఉన్నా.. అది తొలగిపోతే ఎంతో రిలీఫ్‌ అనిపిస్తుంది. పెద్ద కష్టం అయితే.. మనసు చిందులేస్తుంది. అదే.. మృత్యుముఖాన ఉన్నవారికి ‘నీకు ఇంకా జీవితం ఉన్నది’ అనే శుభవార్త వస్తే..! ఆ ఆనందం అంతా ఇంతా కాదు. అది జీవితం గొప్పదనం. అంతటి గొప్ప సంతోషం ఒక మహిళలకు దక్కింది. ఆమె క్యాన్సర్ (cancer) బాధితురాలు. మృత్యువుతో పోరాడుతున్నారు. ఓపికగా చికిత్స పొందారు. ఒక రోజు పరీక్ష చేయించుకుని.. దాని రిపోర్ట్‌ […]

Cancer | క్యాన్సర్‌ టెస్టు రిపోర్టు చూసి మహిళ భావోద్వేగం..

Cancer

న్యూఢిల్లీ: ఏదైనా చిన్న కష్టంలో ఉన్నా.. అది తొలగిపోతే ఎంతో రిలీఫ్‌ అనిపిస్తుంది. పెద్ద కష్టం అయితే.. మనసు చిందులేస్తుంది. అదే.. మృత్యుముఖాన ఉన్నవారికి ‘నీకు ఇంకా జీవితం ఉన్నది’ అనే శుభవార్త వస్తే..! ఆ ఆనందం అంతా ఇంతా కాదు. అది జీవితం గొప్పదనం.

అంతటి గొప్ప సంతోషం ఒక మహిళలకు దక్కింది. ఆమె క్యాన్సర్ (cancer) బాధితురాలు. మృత్యువుతో పోరాడుతున్నారు. ఓపికగా చికిత్స పొందారు. ఒక రోజు పరీక్ష చేయించుకుని.. దాని రిపోర్ట్‌ కోసం మెయిల్‌ ఓపెన్‌ చేశారు.

అందులో ఉన్న సంగతి ఆమెను సంతోషంతో ఉక్కిరిబిక్కిరి చేసేసింది. తాను క్యాన్సర్‌ నుంచి విముక్తి పొందానని రిపోర్టు వచ్చిన సంగతిని వేరే గదిలో పని చేసుకుంటున్న తన భర్త దగ్గరకు వెళ్లింది.అయితే.. ఆయన ఒక మీటింగ్‌లో ఉన్నారు. బయటకు రమ్మని కోరి.. తాను క్యాన్సర్‌ నుంచి బయటపడ్డానని చెప్పుకొని ఆనందబాష్పాలు రాల్చింది.

రిపోర్టు చదువుతున్న సమయంలో ఆమె భావోద్వేగాలు నెటిజన్ల మనసును తాకాయి. అనేక మంది ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు. క్యాన్సర్‌ నుంచి బయటపడిన పలువురు తమ స్వీయ అనుభవాలను పంచుకున్నారు. ‘నాకు ఆ ఫీలింగ్‌ తెలుసు. అంతకు మించింది ఏమీ ఉండదు. నేను నా సీటీ స్కాన్‌ కోసం ఎదురు చూస్తున్నాను. చూడాలి. మళ్లీ ఆరోసారి స్కానింగ్‌కు వెళ్లాల్సి వస్తుందేమో!’ అని ఒక యూజర్‌ రాశారు.