Turbulent Flight Routes 2025 | 2025లో భయపెట్టిన 10 ప్రపంచ విమాన మార్గాలు
2025లో ప్రపంచంలో అత్యంత వాయుకల్లోలం ఉన్న విమాన మార్గాలపై Turbli విడుదల చేసిన నివేదికలో కీలక విషయాలు వెల్లడయ్యాయి. వాతావరణ మార్పుల ప్రభావంతో భయపెడుతున్న మేఘాలు, ప్రయాణికులపై దాని ప్రభావం ఎలా ఉంటుంది?
Turbulence Rising Worldwide: Most Dangerous-Looking Flight Routes of 2025
విధాత సైన్స్ డెస్క్ | హైదరాబాద్:
Turbulent Flight Routes 2025 | విమాన ప్రయాణం అంటే భద్రత, వేగం, సౌకర్యం అనే భావన ప్రజల్లో బలంగా ఉంది. అయితే ఇటీవల కాలంలో విమాన ప్రయాణాల్లో వాయుకల్లోలం (Turbulence) తీవ్రత పెరుగుతూ ప్రయాణికుల్లో ఆందోళన పెంచుతోంది. ముఖ్యంగా వాతావరణ మార్పులు, గాలివానల దిశల్లో మార్పులు, పర్వత ప్రాంతాల ప్రభావం కారణంగా కొన్ని మార్గాల్లో విమానాలు తరచూ కుదుపులకు గురవుతున్నాయి.
ఈ నేపథ్యంలో ప్రముఖ టర్బులెన్స్ అంచనా సంస్థ Turbli 2025 సంవత్సరానికి సంబంధించి ప్రపంచవ్యాప్తంగా 550 ప్రధాన విమానాశ్రయాల మధ్య నడిచే 10 వేలకుపైగా విమాన మార్గాలను విశ్లేషించి నివేదిక విడుదల చేసింది. ఈ నివేదికలో ఏ మార్గాలు అత్యధిక వాయుకల్లోలానికి గురవుతున్నాయో స్పష్టంగా వెల్లడించింది.
ప్రపంచంలో అత్యంత వాయుకల్లోలం(Turbulence) ఉన్న పది మార్గాలు

Turbli సంస్థ శాస్త్రీయ ప్రమాణమైన Eddy Dissipation Rate (EDR) ఆధారంగా వాయుకల్లోలం తీవ్రతను లెక్కించింది. ఈ లెక్కల ప్రకారం 2025లో ప్రపంచంలోనే అత్యంత కుదుపులతో ఉన్న విమాన మార్గంగా అర్జెంటీనా – చిలీ మధ్య ఉన్న మెండోజా – సాంటియాగో రూట్ నిలిచింది. ఈ మార్గం ఆండీస్ పర్వత శ్రేణుల మీదుగా వెళ్లడం వల్ల తరచూ గాలికల్లోలం ఎదురవుతోంది.
1️⃣ మెండోజా – సాంటియాగో (అర్జెంటీనా – చిలీ) : Mendoza (MDZ) – Santiago (SCL)
2️⃣ జినింగ్ – యించువాన్ (చైనా) : Xining (XNN) – Yinchuan (INC)
3️⃣ చెంగ్డు – జినింగ్ (చైనా) : Chengdu (TFU) – Xining (XNN)
4️⃣ కొర్డోబా – సాంటియాగో (అర్జెంటీనా – చిలీ) : Cordoba (COR) – Santiago (SCL)
5️⃣ సాంటా క్రూజ్ – సాంటియాగో (బొలీవియా – చిలీ) : Santa Cruz (VVI) – Santiago (SCL)
6️⃣ చెంగ్డు – లాంఝౌ (చైనా) : Chengdu (TFU) – Lanzhou (LHW)
7️⃣ మెండోజా – సాల్టా (అర్జెంటీనా) : Mendoza (MDZ) – Salta (SLA)
8️⃣ చెంగ్డు – యించువాన్ (చైనా) : Chengdu (CTU) – Yinchuan (INC)
9️⃣ జినింగ్ – లాసా (చైనా – టిబెట్ ప్రాంతం) : Xining (XNN) – Lhasa (LXA)
🔟 డెన్వర్ – జాక్సన్ (అమెరికా) : Denver (DEN) – Jackson (JAC)
మొత్తం టాప్-10 జాబితాలో ఐదు మార్గాలు ఆసియాలో, నాలుగు మార్గాలు దక్షిణ అమెరికాలో ఉండడం గమనార్హం. అమెరికాలోని డెన్వర్ – జాక్సన్ మార్గం కూడా అత్యంత వాయుకల్లోలం ఉన్న జాబితాలో చోటు దక్కించుకుంది.
ఖండాల వారీగా పరిశీలిస్తే, ఉత్తర అమెరికాలో డెన్వర్ – జాక్సన్, యూరప్‌లో నీస్ – జెనీవా, ఆఫ్రికాలో డర్బన్ – జోహానెస్‌బర్గ్, ఓషియానియాలో క్రైస్ట్‌చర్చ్ – వెల్లింగ్టన్ మార్గాలు అత్యంత కుదుపులకు లోనయ్యేవిగా నమోదయ్యాయి.
ఇక దీర్ఘదూర ప్రయాణాల్లో, కుక్ దీవులలోని అవరువా నుంచి ఆస్ట్రేలియాలోని సిడ్నీ వరకు సాగే దాదాపు 5 వేల కిలోమీటర్ల మార్గం ప్రపంచంలోనే అత్యంత వాయుకల్లోలం ఉన్న లాంగ్-హాల్ రూట్‌గా గుర్తింపు పొందింది.
వాతావరణ మార్పులతో అల్లకల్లోలంగా ఆకాశం

వాయుకల్లోలం పెరుగుదలకు ప్రధాన కారణంగా నిపుణులు క్లైమేట్ చేంజ్ను సూచిస్తున్నారు. వాతావరణంలో ఉష్ణోగ్రతల అసమతుల్యత, గాలుల వేగంలో మార్పులు, జెట్ స్ట్రీమ్స్ దిశల మార్పులు దీనికి కారణమవుతున్నాయి. యూనివర్సిటీ ఆఫ్ రీడింగ్ వాతావరణ శాస్త్ర నిపుణులు వెల్లడించిన ప్రకారం, రానున్న సంవత్సరాల్లో ఈ గాలికల్లోలం మరింత పెరిగే అవకాశం ఉంది. అయితే ఆధునిక విమానాలు ఇలాంటి పరిస్థితులను తట్టుకునే విధంగా రూపొందించబడ్డాయని, ప్రయాణికులు అనవసర భయానికి లోనుకావాల్సిన అవసరం లేదని వారు స్పష్టం చేస్తున్నారు.
ఎయిర్‌లైన్స్ సంస్థలు ముందుగానే వాతావరణ నివేదికలను పరిశీలించి ప్రమాదకర మార్గాలను తప్పిస్తూ విమానాలను నడుపుతున్నాయి. దీని వల్ల కొన్నిసార్లు విమాన మార్గాల దూరం పెరగడం, ఆలస్యం కావడం, ఎయిర్‌పోర్టుల్లో ఎక్కువసేపు వేచి ఉండాల్సి రావడం వంటి సమస్యలు ఎదురవుతున్నాయి. అయితే భద్రత పరంగా విమాన ప్రయాణం ఇప్పటికీ అత్యంత నమ్మకమైన రవాణా మార్గంగానే కొనసాగుతోందని విమానయాన నిపుణులు స్పష్టం చేస్తున్నారు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram