Hyderabad | రూ. 7 కోట్ల వజ్రాభరణాలతో ఉడాయించిన కారు డ్రైవర్
Hyderabad | ఓ కారు డ్రైవర్ నమ్మకంగా ఉంటూ.. రూ. 7 కోట్ల వజ్రాభరణాలతో ఉడాయించాడు. ఈ ఘటన హైదరాబాద్ నగరంలోని ఎస్సార్ నగర్ పోలీసు స్టేషన్ పరిధిలో శుక్రవారం సాయంత్రం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. మాదాపూర్‌లోని మై హోం భుజ అపార్ట్‌మెంట్స్‌లో రాధిక అనే మహిళ నివాసం ఉంటుంది. ఆమె నగల వ్యాపారం చేస్తుంది. అయితే అదే అపార్ట్‌మెంట్‌లో ఉన్న నివాసముంటే అనూష రూ. 50 లక్షల విలువ చేసే ఆభరణాలను ఆర్డర్ చేసింది. […]

Hyderabad | ఓ కారు డ్రైవర్ నమ్మకంగా ఉంటూ.. రూ. 7 కోట్ల వజ్రాభరణాలతో ఉడాయించాడు. ఈ ఘటన హైదరాబాద్ నగరంలోని ఎస్సార్ నగర్ పోలీసు స్టేషన్ పరిధిలో శుక్రవారం సాయంత్రం చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే.. మాదాపూర్‌లోని మై హోం భుజ అపార్ట్‌మెంట్స్‌లో రాధిక అనే మహిళ నివాసం ఉంటుంది. ఆమె నగల వ్యాపారం చేస్తుంది. అయితే అదే అపార్ట్‌మెంట్‌లో ఉన్న నివాసముంటే అనూష రూ. 50 లక్షల విలువ చేసే ఆభరణాలను ఆర్డర్ చేసింది.
ఆ నగలను అమీర్‌పేట పరిధిలోని మధురానగర్‌కు తీసుకురావాలని రాధికను అనూష కోరింది. దీంతో తన కారు డ్రైవర్ శ్రీనివాస్(28), సేల్స్‌మెన్ అక్షయ్(30)తో ఆ ఆభరణాలను మధురానగర్‌కు పంపింది రాధిక.
ఇక అక్షయ్ నగలను తీసుకొని అనూష వద్దకు వెళ్లగా, శ్రీనివాస్ కారులోనే ఉన్నాడు. కారులో ఉన్న రూ. 7 కోట్ల విలువ చేసే వజ్రాభరణాలను తీసుకొని కారుతో శ్రీనివాస్ ఉడాయించాడు. అక్షయ్ బయటకు వచ్చి చూడగా.. డ్రైవర్ శ్రీనివాస్ కనిపించలేదు.
దీంతో అప్రమత్తమైన అక్షయ్.. రాధికకు సమాచారం అందించాడు. రాధిక ఎస్సార్ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. డ్రైవర్ శ్రీనివాస్ ఆచూకీ కోసం గాలిస్తున్నారు.