Celina Jaitly | వైద్యుడిని కలిసి మీ అంగస్తంభన సమస్యకు ఉపశమనం పొందండి.. క్రిటిక్‌ ఉమైర్‌ సంధుకు గడ్డిపెట్టిన నటి సెలీనా జైట్లీ

Celina Jaitly | తనను తాను ఓ ఫిల్మ్‌ క్రిటిక్‌గా, ఓవర్సీస్ సెన్సార్ బోర్డ్ మెంబర్‌గా చెప్పుకుంటాడు ఉమైర్‌ సంధు. సినిమాలకు సైతం సైతం రివ్యూలు చెప్పడంతో పాటు పలు సినీతారలకు మధ్య అక్రమ సంబంధాలు అంటగట్టడంతో అడ్డగోలుగా ఆరోపణలు చేస్తూ ఉంటాడు. రష్మిక మందన్నాతో అల్లు అర్జున్‌ రిలేషన్‌లో ఉన్నాడంటూ ట్వీ్ట్‌ చేశాడు. అంతకుముందు బాలీవుడ్‌ ముద్దుగుమ్మ ఊర్వశి రౌటెలాను ఉద్దేశించి దిగజారుడు ఆరోపణలు చేశాడు. తాజాగా బాలీవుడ్‌ నటి సెలీనా జైట్లీని ఉద్దేశించి సంచలన […]

Celina Jaitly | వైద్యుడిని కలిసి మీ అంగస్తంభన సమస్యకు ఉపశమనం పొందండి.. క్రిటిక్‌ ఉమైర్‌ సంధుకు గడ్డిపెట్టిన నటి సెలీనా జైట్లీ

Celina Jaitly |

తనను తాను ఓ ఫిల్మ్‌ క్రిటిక్‌గా, ఓవర్సీస్ సెన్సార్ బోర్డ్ మెంబర్‌గా చెప్పుకుంటాడు ఉమైర్‌ సంధు. సినిమాలకు సైతం సైతం రివ్యూలు చెప్పడంతో పాటు పలు సినీతారలకు మధ్య అక్రమ సంబంధాలు అంటగట్టడంతో అడ్డగోలుగా ఆరోపణలు చేస్తూ ఉంటాడు. రష్మిక మందన్నాతో అల్లు అర్జున్‌ రిలేషన్‌లో ఉన్నాడంటూ ట్వీ్ట్‌ చేశాడు.

అంతకుముందు బాలీవుడ్‌ ముద్దుగుమ్మ ఊర్వశి రౌటెలాను ఉద్దేశించి దిగజారుడు ఆరోపణలు చేశాడు. తాజాగా బాలీవుడ్‌ నటి సెలీనా జైట్లీని ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశాడు. సెలీనా జైట్లీ ప్రముఖ నటుడు ఫర్దీన్ ఖాన్‌తో పాటు అతని తండ్రి ఫిరోజ్‌ ఖాన్‌తో శారీరకంగా కలిసిందని, తండ్రి కొడుకులతో పడుకున్న ఏకైక నటి అంటూ ఘోరంగా ట్వీట్‌ చేశాడు. దీనిపై సెలీనా ఘాటుగానే స్పందించింది.

హెచ్చరికలు జారీ చేయడంతో పాటు పరువు నష్టం దావా వేస్తానని చెప్పింది. ‘మిస్టర్ సంధూ కనీసం నువ్వు మనిషిగా ఇప్పుడైనా మారుతావనే ఉద్దేశంతో ఈ పోస్ట్‌ పెడుతున్నా. మీ అంగస్తంభన సమస్య నుంచి ఉపశమనం పొందగలరని ఆశిస్తున్నారు. మీ సమస్యను పరిష్కరించేందుకు ఇతర మార్గాలున్నాయి. వైద్యుడి వద్దకు వెళ్లాలంటూ’ గట్టిగానే గడ్డిపెట్టింది.

Umair Sandhu | అల్లు అర్జున్‌- రష్మిక రిలేషన్‌లో ఉన్నారంటూ.. ఉమైర్‌ సంధు పోస్ట్‌.. మండిపడుతున్న అభిమానులు..!

అంతేకాకుండా ఉమైర్‌ సంధుపై చర్యలు తీసుకోవాలని ట్విట్టర్‌ సేఫ్టీ బృందానికి విజ్ఞప్తి చేసింది. అయితే, ఈ నటి ట్వీట్‌కు స్పందిస్తూ.. ‘ఓహ్ జస్ట్ షటప్! మీరు సీ గ్రేడ్ నటి. మీ ఫిల్మోగ్రఫీ చూడండి. మీరు ఎప్పుడూ సాఫ్ట్ పోర్న్ ఫిల్మ్స్ చేసేవారు. ధనవంతుడిని పెళ్లి చేసుకొని ఆ తర్వాత స్థిరపడ్డారు. మీరు స్వార్థపరురాలు’ మరో ట్వీట్‌ చేశాడు.

ఆ తర్వాత మరో ట్వీట్‌ చేస్తూ.. ‘2003లో జనాషీన్ ఆడిషన్స్ సమయంలో డైరెక్టర్ ఫిరోజ్ ఖాన్ ఆఫీసులో మీరు అతని ఎదుట నగ్నంగా ఉన్నారు’ అంటూ ట్వీట్‌ చేశాడు. ప్రస్తుతం ఇద్దరి ట్వీట్‌ వార్‌ సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. అయితే, నెజిటన్స్‌ సెలీనా జైట్లీకి మద్దతు తెలుపుతున్నారు.

క్రిటిక్‌ పేరుతో అడ్డగోలు విమర్శలు చేసే ఉమైర్‌ సంధుపై చర్యలు తీసుకోవాలని, క్రిమినల్‌ కేసులు పెట్టాలని పలువురు నెజిటన్స్‌ డిమాండ్‌ చేస్తున్నారు. గత కొంతకాలంగా సినిమాల రిలీజ్‌కి విడుదలకు ముందు ఉమైర్‌ సంధు పలు చిత్రాలపై ట్వీట్‌ చేసి వైరల్‌ అయ్యాడు.

సినిమా విడుదల కాక ముందే.. ఆ సినిమా చూశాను.. అది బాగుంది.. ఇది బాగోలేదు అంటూ ఫేక్‌ ట్వీట్లు పెడుతుంటాడు. గతంలో అజ్ఞాతవాసి, సాహో, బీస్ట్, రాధేశ్యామ్, వీరసింహారెడ్డి తదితర సినిమాల సైతం ట్వీట్లు పెట్టాడు. ఇదిలా ఉండగా.. సెలీనా జైట్లీ 2001లో ఫెమినా మిస్‌ ఇండియా టైటిల్‌ను గెలుచుకుంది.

ఆ తర్వాత మిస్‌ యూనివర్స్‌ పోటీలకు ఎంపిక.. రన్నరప్‌గా నాలుగో స్థానంలో నిలిచింది. 2003లో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. జనశీన్‌ హిందీ చిత్రంతో బాలీవుడ్‌కు పరిచయమైంది. 2004లో మంచు విష్ణు హీరోగా తెరకెక్కిన ‘సూర్యం’ చిత్రంతో సెలీనా జైట్లీ హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది.