Chalaki Chanti | చలాకీ చంటి: హార్ట్ ఎటాక్‌తో చురుకుదనం తగ్గింది కానీ.. పంచులలో పవర్ మాత్రం తగ్గలే..

Chalaki Chanti | ప్రముఖ ఛానల్‌లో ప్రసారమయ్యే జబర్దస్త్ కామెడీ షోతో చాలామంది టాలెంట్ ఉన్న యాక్టర్స్ సినీరంగం వైపు అడుగులు వేశారు. ఇందులో ముఖ్యంగా హైపర్ ఆది, ధనరాజ్, చలాకీ చంటి, సుడిగాలి సుధీర్ వంటి వారు సినిమాల్లోనూ వారి కున్న టాలెంట్‌తో కమెడియన్స్‌గా పరిచయం అయ్యారు. ఇక అందరిలానే చలాకీ చంటి కూడా జబర్దస్త్ కామెడీ షోలో టీం లీడర్ గా ఓ వెలుగు వెలిగాడు. అప్పుడప్పుడు సినిమాల్లో నటించినా పెద్దగా రాణించలేదనే చెప్పాలి. […]

  • Publish Date - August 1, 2023 / 04:44 AM IST

Chalaki Chanti |

ప్రముఖ ఛానల్‌లో ప్రసారమయ్యే జబర్దస్త్ కామెడీ షోతో చాలామంది టాలెంట్ ఉన్న యాక్టర్స్ సినీరంగం వైపు అడుగులు వేశారు. ఇందులో ముఖ్యంగా హైపర్ ఆది, ధనరాజ్, చలాకీ చంటి, సుడిగాలి సుధీర్ వంటి వారు సినిమాల్లోనూ వారి కున్న టాలెంట్‌తో కమెడియన్స్‌గా పరిచయం అయ్యారు. ఇక అందరిలానే చలాకీ చంటి కూడా జబర్దస్త్ కామెడీ షోలో టీం లీడర్ గా ఓ వెలుగు వెలిగాడు. అప్పుడప్పుడు సినిమాల్లో నటించినా పెద్దగా రాణించలేదనే చెప్పాలి.

ఇక టెలివిజన్ షోలలో బిగ్ బాస్‌ను ఫాలో అయ్యేవాళ్ళ చాలా మందే ఉన్నారు. ఈ షోకి చంటి సెలక్ట్ అయ్యాడు బిగ్ బాస్ సీజన్ 6 కంటెస్టెంట్ గా ఎన్నికై తన సహజమైన ధోరణిలో హౌస్‌లో ఓ లెవల్‌లో కామెడీ పండించాడు. కానీ అక్కడి వాతావరణం పడకో ఏమో మధ్యలోనే బయటకు వచ్చేశాడు. ఇక జబర్దస్త్ షోలో కూడా చంటి కనిపించడం లేదు ఈ మధ్య. కారణం అతనికి గుండెనొప్పి వచ్చిందని, పరిస్థితి సీరియస్‌గా ఉందనేలా అప్పట్లో వార్తలైతే వచ్చాయి.

దీంతో చంటి దాదాపు మూడు నెలలుగా ఎలాంటి షో లో కనిపించలేదు. కాకపోతే ఎవరి గురించి ఏదీ ఆగదుగా.. తన స్థానంలో షోలు మిగతా కమెడియన్స్ కొనసాగిస్తున్నారు. అయినా సినిమా వాళ్ల ఆరోగ్యాలు ఎప్పుడు ఎలా ఉంటాయో చెప్పడం కష్టం.. బిజీ షెడ్యూల్స్ మధ్య సమయానికి తిండి సౌకర్యం ఉండదు. ఇక నిద్ర కూడా అంతంత మాత్రమే ఈ అలవాట్లే ఇప్పటి తారల ప్రాణాల మీదకు తెస్తున్నాయి.

చంటి విషయం సరిగా తెలియక తికమకలో ఉన్న ప్రేక్షకులకు.. సడెన్‌గా సుమ అడ్డా షోలో కనిపించి సర్‌ప్రైజ్ చేశాడు చంటి. అయితే మనిషి పూర్తిగా రికవరీ అయినట్టుగా కనిపించలేదు. బరువుతగ్గి, నీరసంగా కనిపించాడు. తన ఆరోగ్యం విషయాన్ని అడిగి మరీ తెలుసుకున్నారు అక్కడి వారు. ఇక తన చురుకుదనం కాస్త తగ్గినా.. తన మార్క్ పంచులతో తనదైన శైలిలో కామెడి పండించాడు చంటి. ఆరోగ్యంగా ఉంటే ఇంకా హుషారుగా ఉండేవాడని, త్వరగా కోలుకుని, రెట్టింపు ఉత్సాహంతో మళ్ళీ కామెడీ పండిస్తే, చూడాలని ఉందని, పలువురు కామెంట్స్ చేస్తున్నారు.

Latest News