Chandrababu | చంద్రబాబు నలభయ్యేళ్లకు లోకల్ అయ్యారు.. ఇంటికి అనుమతులొచ్చాయోచ్!
Chandrababu విధాత: మొత్తానికి రాజకీయాల్లోకి వచ్చిన నలభయ్యేళ్ల తరువాత చంద్రబాబు ఇప్పుడు.. ఇన్నాళ్లకు లోకల్ అయ్యారు. చంద్రబాబుది మన ఊరు కాదు.. ఆయన హైదాబాద్లోని బంజారా హిల్స్ లో ఉంటారు.. మన ఊరికి ఓట్ల కోసం చుట్టం చూపుగా వస్తారు.. గెలిచినా. ఓడినా ఇక్కడ ఉండరు అని తరచూ వెక్కిరించే జగన్ మోహన్ రెడ్డి ఇక ముందు ఆ మాటలు అనలేరు. ఎందుకంటే కుప్పంలో చంద్రబాబు ఇంటి నిర్మాణానికి పెట్టుకున్న దరకాస్తును కుప్పం మున్సిపాలిటీ ఆమోదించింది. ఈ […]

Chandrababu
విధాత: మొత్తానికి రాజకీయాల్లోకి వచ్చిన నలభయ్యేళ్ల తరువాత చంద్రబాబు ఇప్పుడు.. ఇన్నాళ్లకు లోకల్ అయ్యారు. చంద్రబాబుది మన ఊరు కాదు.. ఆయన హైదాబాద్లోని బంజారా హిల్స్ లో ఉంటారు.. మన ఊరికి ఓట్ల కోసం చుట్టం చూపుగా వస్తారు.. గెలిచినా. ఓడినా ఇక్కడ ఉండరు అని తరచూ వెక్కిరించే జగన్ మోహన్ రెడ్డి ఇక ముందు ఆ మాటలు అనలేరు. ఎందుకంటే కుప్పంలో చంద్రబాబు ఇంటి నిర్మాణానికి పెట్టుకున్న దరకాస్తును కుప్పం మున్సిపాలిటీ ఆమోదించింది. ఈ మేరకు ఇళ్లు నిర్మించు కోవడానికి అనుమతులు ఇచ్చింది.
చంద్రబాబు కుప్పం నుంచి గత 35 ఏళ్లుగా గెలుస్తూ వస్తున్నారు. అయినా సరే ఆయనకు అక్కడ ఇల్లు లేదు. ఈ ఒక్క కారణంతో చంద్రబాబును తరచూ జగన్ నాన్ లోకల్ అంటూ ఎగతాళి చేస్తుంటారు. కుప్పంలో ఇల్లే లేని చంద్రబాబుని గెలిపించినా ఉపయోగం ఏమీ లేదనేది వైసిపి ప్రచారం. ఇక అలాంటి నాయకుడిని ఓడిద్దాం అనే నినాదంతో వైసిపి ముందుకు దూకుతోంది.
దీంతో ఇక్కడ ఇళ్లు కట్టుకోవాలని చంద్రబాబు నిర్ణయించుకుని జాగా కొన్నారు. కుప్పం నియోజకవర్గంలోని శాంతిపురం మండలం శివపురంలో ఇల్లు కట్టుకుంటాను అని చంద్రబాబు అనుమతి కోసం చాన్నాళ్ల క్రితం ఆయన దరఖాస్తు చేసుకోగా దానికి ఇప్పటికీ మోక్షం కలిగింది. స్థానిక టీడీపీ నేతలు ఆ ఇంటి నిర్మాణానికి పునాది వేస్తూ గమ్మున పూర్తి చేసేందుకు పనులు వేగవంతం చేస్తున్నారు.