Chandrababu | పవన్ బాటలోనే చంద్రబాబు.. జగన్ మీద ఢిల్లీకి ఫిర్యాదు లేఖలు!
Chandrababu విధాత: ఢిల్లీ వాళ్ళతో చెప్పి నీతో ఒక ఆటాడిస్తాను జగన్.. చూస్తుండు అని పవన్ మొన్నచెప్పిన మాదిరిగానే చంద్రబాబు సైతం ఢిల్లీ టూర్ పట్టారు. జగన్ ప్రభుత్వం చేస్తున్న అరాచకాలు ఇవిగో.. చూడండి అంటూ కేంద్రానికి చంద్రబాబు లేఖలు రాశారు. రాష్ట్రంలో అరాచకత్వం పెచ్చు మీరిందని, శాంతి భద్రతలు లేవని, రాష్ట్రపతి వెంటనే జోక్యం చేసుకోవాలని కోరుతూ లేఖ రాశారు. ఈ మేరకు ఆయన ప్రధాని మోడీ రాష్ట్రపతి ద్రౌపది ముర్ములకు లేఖ, పుంగనూరు లో […]

Chandrababu
విధాత: ఢిల్లీ వాళ్ళతో చెప్పి నీతో ఒక ఆటాడిస్తాను జగన్.. చూస్తుండు అని పవన్ మొన్నచెప్పిన మాదిరిగానే చంద్రబాబు సైతం ఢిల్లీ టూర్ పట్టారు. జగన్ ప్రభుత్వం చేస్తున్న అరాచకాలు ఇవిగో.. చూడండి అంటూ కేంద్రానికి చంద్రబాబు లేఖలు రాశారు. రాష్ట్రంలో అరాచకత్వం పెచ్చు మీరిందని, శాంతి భద్రతలు లేవని, రాష్ట్రపతి వెంటనే జోక్యం చేసుకోవాలని కోరుతూ లేఖ రాశారు.
ఈ మేరకు ఆయన ప్రధాని మోడీ రాష్ట్రపతి ద్రౌపది ముర్ములకు లేఖ, పుంగనూరు లో తన మీద దాడి జరిగిందని చెబుతూ వీడియోలను, కూడా చంద్రబాబు నాయుడు ఢిల్లీకి పంపారు.
వాస్తవానికి ఆరోజు పుంగనూరు పట్టణంలోకి వెళ్లేందుకు చంద్రబాబుకు అనుమతి లేదు, ఆ ఊళ్ళో బాబు పర్యటన సైతం లేదు. కానీ కేవలం అక్కడ ఉద్రిక్తతలు రెచ్చగొట్టేందుకు మాత్రమే ఆయన పుంగనూరు వచ్చారని పోలీసులు..ప్రభుత్వం చెబుతోంది.
ఈ సందర్భంగా టిడిపి కార్యకర్తలు అత్యుత్సాహంతో చేసిన గలాటాలో దాదాపు 15 మంది పోలీసులు గాయపడ్డారు. దీంతో ఈ కేసులో దాదాపు 280 మంది టిడిపి కార్యకర్తలు నిందితులుగా గుర్తించిన ప్రభుత్వం కేసులు బుక్ చేసి చాలామందిని అరెస్ట్ చేసింది.
ఈ సంఘటనలో పోలీసుల మీద కార్యకర్తలు చేస్తున్న దాడి వీడియోలు పోలీసులు.ప్రభుత్వం విడుదల చేసింది. అయినా సరే చంద్రబాబు ఢిల్లీ పెద్దలకు లేఖ రాసి జగన్ ప్రభుత్వం మీద చర్యలు కోరుతూ లేఖ రాశారు.