Chandrababu | ఆర్టీసీ బస్సులో చంద్రబాబు.. ప్రజలతో ముచ్చట్లు

Chandrababu | ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాజకీయ నాయకులు ఓటర్లను ఆకట్టుకునెందుకు ఎన్నెన్ని గిమ్మిక్కులు వేస్తారో అందరికీ తెలిసిందే.. రోడ్ల మీద బండి వద్ద అట్లు వేయడం.. పళ్ళు అమ్మడం..సెలూన్ లో క్షవరం చేయడం వంటివన్నీ ఇదే కోవలోకి వస్తాయి. ఇక ఇప్పుడు చంద్రబాబు సైతం ప్రజలను ఆకర్షించేందుకు ఆర్టీసి బస్సులో ప్రయాణిస్తున్నరు. కోనసీమ జిల్లాలోని ఆలమూరు నుంచి ఆర్టీసీలో చంద్రబాబు ప్రయాణం చేశారు. టికెట్ తీసుకుని రావుల పాలెం వరకు బస్సులో వెళ్తూ ప్రయాణికులతో చంద్రబాబు […]

  • By: krs    latest    Aug 17, 2023 1:46 PM IST
Chandrababu | ఆర్టీసీ బస్సులో చంద్రబాబు.. ప్రజలతో ముచ్చట్లు

Chandrababu |

ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాజకీయ నాయకులు ఓటర్లను ఆకట్టుకునెందుకు ఎన్నెన్ని గిమ్మిక్కులు వేస్తారో అందరికీ తెలిసిందే.. రోడ్ల మీద బండి వద్ద అట్లు వేయడం.. పళ్ళు అమ్మడం..సెలూన్ లో క్షవరం చేయడం వంటివన్నీ ఇదే కోవలోకి వస్తాయి. ఇక ఇప్పుడు చంద్రబాబు సైతం ప్రజలను ఆకర్షించేందుకు ఆర్టీసి బస్సులో ప్రయాణిస్తున్నరు.

కోనసీమ జిల్లాలోని ఆలమూరు నుంచి ఆర్టీసీలో చంద్రబాబు ప్రయాణం చేశారు. టికెట్ తీసుకుని రావుల పాలెం వరకు బస్సులో వెళ్తూ ప్రయాణికులతో చంద్రబాబు ముచ్చటించారు. ప్రభుత్వ పనితీరు, రోడ్ల పరిస్థితిపై ప్రయాణికుల నుంచి చంద్రబాబు గారు ఆరా తీశారు.

దీనిమీద సోషల్ మీడియాలో ట్రోలింగ్స్ మొదలయ్యాయి. ఆయన అధికారంలో ఉన్నన్నాల్లు ఎన్నడూ ఇలా చేయలేదని కొందరు అంటుండగా ఛార్టర్డ్ విమానాల్లో తిరిగే చంద్రబాబును జగన్ ఏకంగా అర్టీసీ బస్సులో తిరిగేలా చేశాడని కొందరు. కామెంట్స్ చేస్తున్నారు. ఆ బస్సులో అందరూ పార్టీ కార్యకర్తలే ఉన్నారని, అది ప్రజల బస్సు కాదని ఇంకొందరు అంటున్నారు.