Child Marriage: మైనర్ బాలికను.. కాపురానికి ఎత్తుకెళ్తిన భర్తకు షాక్!

Child Marriage:
విధాత, వెబ్ డెస్క్ : మైనర్ బాలిక (Minor Girl)ను బాల్య వివాహం (Child marriage) చేసుకున్న భర్త (Husband) ఆ బాలికను బలవంతంగా కాపురానికి ఎత్తుకెళ్లిన(Forcibly Taken) ఘటన సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. తమిళనాడులో జరిగిన ఈ బాల్య వివాహా ఘటనపై నెటిజన్లు మండి పడుతున్నారు. చిన్నారి పెళ్ళికూతురు రోదించే దృశ్యాలు చూసిన వారిని కన్నీరు పెట్టిస్తున్నాయి.
వివరాల్లోకి వెళితే తమిళనాడు కృష్ణగిరి జిల్లా హోసూర్ గ్రామానికి చెందిన 14 సంవత్సరాల చిన్నారిని బెంగుళూరులోని 29 సంవత్సరాల అబ్బాయికి ఇచ్చి బాల్య వివాహం చేశారు. పెళ్లి అనంతరం అత్తగారి ఇంటికి వెళ్ళనని ఆ చిన్నారి ఏడుస్తున్నా పట్టించుకోకుండా పెళ్లి కొడుకు ఆమెను భుజాలపై ఎత్తుకొని బలవంతంగా తీసుకెళ్లాడు.
అమ్మా.. నాన్న నేను వెళ్లను అంటూ ఆ బాలిక నన్ను వదిలేయమంటూ కన్నీరుమున్నీరుగా రోధిస్తున్నప్పటికి బలవంతంగా భర్త ఆమెను రాక్షసుడి మాదిరిగా కాపురానికి ఎత్తుకెళ్లిన వీడియో వైరల్ గా మారింది. అంతర్జాతీయ మహిళా దినోత్సవానికి ఒక రోజు ముందు ఇలాంటి ఘటన చోటుచేసుకోవడం విషాదకరం. ఈ ఘటన వీడియో వైరల్ కావడంతో మేల్కోన్న పోలీసులు ఆలస్యంగా రంగప్రవేశం చేసి మైనర్ బాలికను బాల్యవివాహం చేసుకుని బలవంతంగా తీసుకెళ్లిన భర్తను, అతడి తమ్ముడిని, బాలిక తల్లిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.