Nizamabad | బాల్య వివాహాన్ని ప్రోత్స‌హించిన వారిపై చ‌ర్య‌లు తీసుకోవాలి: ఐద్వా

Nizamabad విధాత, ప్రతినిధి నిజామాబాద్: బాల్య వివాహం చేసుకున్న‌ వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకొని వివాహానికి ప్రోత్సహించిన వారి పై కఠిన చర్యలు తీసుకోవాలని ఐద్వా జిల్లా ప్రధాన కార్యదర్శి సుజాత డిమాండ్ చేశారు. నిజామాబాద్ జిల్లా నవీపేట్ మండలం అబ్బాపూర్ తండాలో మొన్న అర్ధరాత్రి బాల్య వివాహం జరిగిన ఘటనపై నవీపేట్ మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్ లో అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం( ఐద్వా) జిల్లా అధ్యక్షులు ఏ. అనిత ప్రధాన కార్యదర్శి […]

Nizamabad | బాల్య వివాహాన్ని ప్రోత్స‌హించిన వారిపై చ‌ర్య‌లు తీసుకోవాలి: ఐద్వా

Nizamabad

విధాత, ప్రతినిధి నిజామాబాద్: బాల్య వివాహం చేసుకున్న‌ వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకొని వివాహానికి ప్రోత్సహించిన వారి పై కఠిన చర్యలు తీసుకోవాలని ఐద్వా జిల్లా ప్రధాన కార్యదర్శి సుజాత డిమాండ్ చేశారు.

నిజామాబాద్ జిల్లా నవీపేట్ మండలం అబ్బాపూర్ తండాలో మొన్న అర్ధరాత్రి బాల్య వివాహం జరిగిన ఘటనపై నవీపేట్ మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్ లో అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం( ఐద్వా) జిల్లా అధ్యక్షులు ఏ. అనిత ప్రధాన కార్యదర్శి సుజాత లు ఫిర్యాదు చేశారు. అనంతరం బాల్య వివాహం పై ఐసిడిఎస్ అధికారులతో వివరాలు తెలుసుకొని మీడియా సమావేశం నిర్వహించారు.

ఈ సమావేశంలో ఆమె మాట్లాడుతూ 13 సంవత్సరాల అమ్మాయిని ఫకీరాబాద్ కు చెందిన సాహెబ్ రావు వయసు 45 సంవత్సరాలు అర్ధరాత్రి పూట పెళ్లి చేసుకోవడం పట్ల ఆమె తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.
వివాహాన్ని అడ్డుకోవడానికి వెళ్లిన ఐసిడిఎస్ అధికారులపై, మద్దతుగా నిలబడ్డా వారిపై దాడులకు పాల్పడడం ఎంతవరకు సమంజసం అని ప్రశ్నించారు.

పెళ్లి చేసుకున్న సాహెబ్ రావు 60 వేల రూపాయలు అమ్మాయి తండ్రికి ఇచ్చినట్లు తెలిసిందని కన్న కూతురిని కసాయి వాడి చేతిలో అమ్మకానికి పెట్టిన తండ్రి పైన ఈ పెళ్లి చేసుకోవడానికి ప్రోత్సహించిన ఎంపీటీసీ భర్త, పెళ్లి చేసిన పూజారి పైన ప్రోత్సహించిన వారందరి పైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు. భవిష్యత్తులో చిన్నపిల్లల పరిస్థితి దారుణంగా ఉంటుందని ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షురాలు ఏ. అనిత సిపిఎం మండల కార్యదర్శి నాయక్ వాడి శ్రీనివాస్, సిపిఎం పార్టీ మండల నాయకులు కామ్రేడ్ దేవేందర్ సింగ్ పాల్గొన్నారు.