అణ్వస్త్రాలు, సైనిక బలగాల పెంపుపై చైనా దృష్టి.. బ్లూప్రింట్ సిద్ధం చేసిన ఆర్మీ..!
China nuclear bombs | తైవాన్ విషయంలో అమెరికాతో కొనసాగుతున్న వివాదాల మధ్య చైనా దేశ అణు నిల్వలను పెంచుకోవాలని యోచిస్తున్నది. 2035 వరకు అణ్వాయుధాల సంఖ్యను 900 వరకు పెంచుకోవాలని యోచిస్తున్నట్లు క్యోడో న్యూస్ పేర్కొంది. చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ ఆమోదం తర్వాత పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ బ్లూప్రింట్ సిద్ధం చేసినట్లు సమాచారం. అమెరికాకు వ్యతిరేకంగా చైనా తన సైనిక బలగాన్ని పెంచుకునేందుకు తీవ్రంగా చేస్తోంది. అమెరికా సైతం చైనా వైఖరిని గ్రహించిన అమెరికా దాదాపు […]
China nuclear bombs | తైవాన్ విషయంలో అమెరికాతో కొనసాగుతున్న వివాదాల మధ్య చైనా దేశ అణు నిల్వలను పెంచుకోవాలని యోచిస్తున్నది. 2035 వరకు అణ్వాయుధాల సంఖ్యను 900 వరకు పెంచుకోవాలని యోచిస్తున్నట్లు క్యోడో న్యూస్ పేర్కొంది. చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ ఆమోదం తర్వాత పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ బ్లూప్రింట్ సిద్ధం చేసినట్లు సమాచారం. అమెరికాకు వ్యతిరేకంగా చైనా తన సైనిక బలగాన్ని పెంచుకునేందుకు తీవ్రంగా చేస్తోంది. అమెరికా సైతం చైనా వైఖరిని గ్రహించిన అమెరికా దాదాపు 1500 వరకు అణ్వాయుధాలను పెంచుకోవాలని చైనా యోచిస్తున్నట్లుగా అంచనా వేసింది. తాజా సమాచారం వాస్తవమేనని తేలింది. 2035 నాటికి చైనా సైన్యం ఆధునికీకరణ పనులు పూర్తవనున్నాయి.
అయితే, అణ్వాయుధాల విషయంలో ఉపయోగం లేని వాటిని డ్రాగన్ దేశం వదిలించుకోవచ్చని నిపుణులు భావిస్తున్నారు. రష్యా – ఉక్రెయిన్ మధ్య జరుగుతున్న యుద్ధం జరుగుతుండగా.. మాస్కో దూకుడు పెంచుతున్నది. అయినప్పటికీ నాటో దేశాలు రష్యాపై నేరుగా చర్యలు తీసుకునేందుకు సాహసించడం లేదు. దీనికి కారణం రష్యా వద్ద పెద్ద ఎత్తున అణ్వాయుధాలు నిల్వ ఉండడమే ఇందుకు కారణమని చైనా భావిస్తున్నది. స్టాక్‌హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ నివేదిక ప్రకారం.. రష్యా వద్ద ప్రస్తుతం 5,977 అణ్వాయుధాలు ఉన్నాయి. అమెరికా వద్ద 5,428 అణ్వాయుధాలు ఉన్నాయి. ఈ క్రమంలో డ్రాగన్ దేశం అణ్వాయుధాలను 2027 నాటికి 550కి, 2035 నాటికి 900కి పెంచుకోవాలని యోచిస్తోంది.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram