Choutuppal: RTC బస్సును ఢీ కొట్టిన డీసీఎం.. ఒకరు మృతి

విధాత: యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం లింగోజిగూడెం వద్ద హైదరాబాద్ విజయవాడ రహదారిపై శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. ఆర్టీసీ బస్సును డీసీఎం ఢీకొట్టడంతో జరిగిన ప్రమాదంలో ఏలూరుకు చెందిన బాలకృష్ణ మృతి చెందారు. డీసీఎం డ్రైవర్, క్లీనర్ క్యాబిన్‌లో ఇరుక్కోవడంతో రెండు గంటల పాటు పోలీసులు శ్రమించి వారిని బయటకు తీసి ఆసుపత్రికి తరలిస్తుండగా క్లీనర్ బాలకృష్ణ మృతి చెందారు. బస్సులో ప్రయాణిస్తున్న 30 మంది ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి. […]

  • By: krs |    latest |    Published on : Mar 24, 2023 12:11 AM IST
Choutuppal: RTC బస్సును ఢీ కొట్టిన డీసీఎం.. ఒకరు మృతి

విధాత: యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం లింగోజిగూడెం వద్ద హైదరాబాద్ విజయవాడ రహదారిపై శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందారు.

ఆర్టీసీ బస్సును డీసీఎం ఢీకొట్టడంతో జరిగిన ప్రమాదంలో ఏలూరుకు చెందిన బాలకృష్ణ మృతి చెందారు. డీసీఎం డ్రైవర్, క్లీనర్ క్యాబిన్‌లో ఇరుక్కోవడంతో రెండు గంటల పాటు పోలీసులు శ్రమించి వారిని బయటకు తీసి ఆసుపత్రికి తరలిస్తుండగా క్లీనర్ బాలకృష్ణ మృతి చెందారు.

బస్సులో ప్రయాణిస్తున్న 30 మంది ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు గాయపడిన వారిని చౌటుప్పల్ ఆసుపత్రికి తరలించారు.