Civils Results | సివిల్స్ ఫ‌లితాల్లో మెరిసిన ఓరుగల్లు ‘అపూర్వ‌’.. అమ్మ‌కు ప్ర‌త్యేక కృత‌జ్ఞ‌త‌లు

Civils Results | యూపీఎస్సీ సివిల్స్ 2022 ఫ‌లితాల్లో తెలుగు రాష్ట్రాల అభ్య‌ర్థులు త‌మ స‌త్తాను చాటారు. మొత్తం 933 మందిని ఎంపిక చేయ‌గా, దాదాపు 50 మందికి పైగా తెలంగాణ‌, ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రాల నుంచి సివిల్ స‌ర్వీసెస్‌కు ఎంపికైన‌ట్లు తెలుస్తోంది. ఈ ఫ‌లితాల్లో ఓరుగ‌ల్లు అపూర్వ మెరిసిపోయారు. ఆలిండియా స్థాయిలో 646వ ర్యాంకు సాధించి, అటు త‌ల్లిదండ్రులు, కుటుంబ స‌భ్యుల నుంచి, ఇటు స్నేహితుల నుంచి ప్ర‌శంస‌ల జ‌ల్లు అందుకుంటోంది. తొలి ప్ర‌య‌త్నంలో మెయిన్స్ వ‌ర‌కు […]

Civils Results | సివిల్స్ ఫ‌లితాల్లో మెరిసిన ఓరుగల్లు ‘అపూర్వ‌’.. అమ్మ‌కు ప్ర‌త్యేక కృత‌జ్ఞ‌త‌లు

Civils Results | యూపీఎస్సీ సివిల్స్ 2022 ఫ‌లితాల్లో తెలుగు రాష్ట్రాల అభ్య‌ర్థులు త‌మ స‌త్తాను చాటారు. మొత్తం 933 మందిని ఎంపిక చేయ‌గా, దాదాపు 50 మందికి పైగా తెలంగాణ‌, ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రాల నుంచి సివిల్ స‌ర్వీసెస్‌కు ఎంపికైన‌ట్లు తెలుస్తోంది.

ఈ ఫ‌లితాల్లో ఓరుగ‌ల్లు అపూర్వ మెరిసిపోయారు. ఆలిండియా స్థాయిలో 646వ ర్యాంకు సాధించి, అటు త‌ల్లిదండ్రులు, కుటుంబ స‌భ్యుల నుంచి, ఇటు స్నేహితుల నుంచి ప్ర‌శంస‌ల జ‌ల్లు అందుకుంటోంది. తొలి ప్ర‌య‌త్నంలో మెయిన్స్ వ‌ర‌కు వెళ్ల‌గ‌లిగింది అపూర్వ‌. అక్క‌డితో ఆగిపోలేదు.

అమ్మ ప్రోత్సాహం, స‌హ‌కారంతో ముందుకు వెళ్లింది. రెండోసారి ఇంట‌ర్వ్యూ వ‌ర‌కు వెళ్లింది. అయిన‌ప్ప‌టికీ తాను వెనుక‌డుగు వేయ‌లేదు. ముచ్చ‌ట‌గా మ‌రోసారి ముందడుగు వేసి.. మూడో ప్ర‌య‌త్నంలో విజ‌యాన్ని ముద్దాడింది. 646వ ర్యాంకు సాధించి అంద‌రి మ‌న్న‌న‌లు పొందుతోంది. ప‌లువురికి ఆద‌ర్శంగా నిలుస్తోంది.

అపూర్వ తండ్రి ప్రొఫెస‌ర్.. త‌ల్లి టీచ‌ర్

అపూర్వ తండ్రి మంద అశోక్ కుమార్.. కాక‌తీయ యూనివ‌ర్సిటీలో ఎక‌నామిక్స్ ప్రొఫెస‌ర్‌గా విధులు నిర్వ‌ర్తిస్తున్నారు. త‌ల్లి ర‌జ‌నీ దేవీ భీమ‌దేవ‌ర‌ప‌ల్లి మండ‌లం మాణిక్య‌పూర్‌లో ప్ర‌భుత్వ ఉపాధ్యాయురాలిగా కొన‌సాగుతున్నారు. అపూర్వ ఉస్మానియా యూనివ‌ర్సిటీలో బీటెక్ పూర్తి చేసి, ప్ర‌స్తుతం ఎంటెక్ చ‌దువుతున్నారు. ఇక ఆమె సోద‌రులిద్ద‌రూ ఉన్న‌త విద్యావంతులే. పెద్ద‌న్న‌య్య అరుణ్ అమెరికాలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ కాగా, చిన్న అన్న‌య్య అభిన‌వ్ పుణెలోని ఓ ఫార్మా కంపెనీలో ప‌ని చేస్తున్నాడు.

అపూర్వ‌కు అభినంద‌న‌ల వెల్లువ‌

సివిల్స్ తుది ఫ‌లితాల్లో స‌త్తా చాటిన అపూర్వ‌కు శాత‌వాహ‌న యూనివ‌ర్సిటీ మాజీ వీసీ ఆచార్య మ‌హ‌మ్మ‌ద్ ఇక్బాల్ అలీ, కేయూ ప్రొఫెస‌ర్లు ఆచార్య కూర‌పాటి వెంక‌ట నారాయ‌ణ‌, డాక్ట‌ర్ ఎర్ర‌బొజ్జు ర‌మేశ్‌, ఇత‌ర అధ్యాప‌కులు అభినంద‌న‌లు తెలియజేశారు.

ఈ జ‌ర్నీలో స‌హ‌క‌రించిన ప్ర‌తి ఒక్క‌రికి ప్ర‌త్యేక కృత‌జ్ఞ‌త‌లు

ఈ సంద‌ర్భంగా అపూర్వ మాట్లాడుతూ.. నా త‌ల్లిదండ్రుల ప్రోత్సాహం, స‌హ‌కారం వ‌ల్లే ఈ విజయం సాధ్య‌మైంది. అమ్మ త‌న‌ను ఎల్ల‌ప్పుడూ ప్రోత్స‌హించేది. వైఫ‌ల్యాలు ఎదురైన‌ప్పుడు అమ్మ త‌న‌కు ధైర్యం నూరిపోసేది. తాను త‌ప్ప‌కుండా విజ‌యం సాధిస్తాన‌నే న‌మ్మ‌కం అమ్మ‌కు ఉండేది. ఈ జ‌ర్నీలో త‌న‌ను ఎంత‌గానో ప్రోత్స‌హించిన త‌న సోద‌రుడికి కూడా ప్ర‌త్యేక కృత‌జ్ఞ‌త‌లు. తాను సివిల్స్ సాధిస్తాన‌న్న న‌మ్మ‌కం త‌న స్నేహితుల‌కు ఎక్కువ‌గా ఉండేది. వారు కూడా నిరంత‌రం ప్రోత్స‌హించే వారు అని తెలిపారు. తాను సివిల్స్ సాధించేందుకు స‌హ‌క‌రించి, ప్రోత్స‌హించిన ప్ర‌తి ఒక్క‌రికీ ప్ర‌త్యేక కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు.