CM Chandrababu Met Bill Gates: బిల్ గేట్స్ తో సీఎం చంద్రబాబు భేటీ!
ఢిల్లీలో ఏపీ సీఎం చంద్రబాబు, మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిలేగేట్స్ సమావేశమయ్యారు. విద్య, ఆరోగ్యం, వ్యవసాయ రంగాల్లో గేట్స్ ఫౌండేషన్ ఏపీకి సహకారం అందించనుంది. ఆయా అంశాలకు సంబంధించి ఓప్పందాలపై వారు చర్చించారు.

Chandrababu met Bill Gates: మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ (Bill Gates) తో ఏపీ సీఎం చంద్రబాబు (Chandrababu) భేటీ అయ్యారు. ఢిల్లీలో సుమారు 40 నిమిషాల పాటు వీరిద్దరి సమావేశమయ్యారు. విద్య, ఆరోగ్యం, వ్యవసాయ రంగాల్లో గేట్స్ ఫౌండేషన్ ఏపీకి సహకారం అందించనుంది.
ఆయా అంశాలకు సంబంధించి గేట్స్ ఫౌండేషన్ ప్రతినిధులు, ఏపీ ప్రభుత్వ అధికారులు ఒప్పంద పత్రాలపై సంతకాలు చేసి మార్చుకోనున్నారు. ఈ నేపథ్యంలోనే బిల్ గేట్స్ తో చంద్రబాబు సమావేశమై పలు ఒప్పందాలపై చర్చించారు. గేట్స్ ఫౌండేషన్, ఏపీ ప్రభుత్వం మధ్య కీలక ఒప్పందాలు జరగనున్న నేపథ్యంలో వారి భేటీ కీలకంగా మారింది.
సమావేశం అనంతరం సీఎం చంద్రబాబు మాట్లాడుతూ హెల్త్, ఎడ్యుకేషన్, వ్యవసాయంపై బిల్ గేట్స్ ఫౌండేషన్‌తో పలు ఒప్పందాలు కుదుర్చుకున్నట్లు ప్రకటించారు. బిల్ గేట్స్‌ను అమరావతి, తిరుపతికి రావాలని సీఎం చంద్రబాబు కోరామని.. అందుకు బిల్‌గేట్స్ అంగీకరించారని తెలిపారు. అర్టిఫిషియల్ ఇంటలిజెన్స్, ప్రిడిక్టివ్ అనాలటిక్స్ వంటి అధునాతన సాంకేతికతల వినియోగంతో చర్చించామన్నారు. స్వర్ణ ఆంధ్రప్రదేశ్ 2047 యొక్క విజన్‌ను సాకారం చేయడానికి GoAP పూర్తిగా కట్టుబడి ఉందని ఇందుకు గేట్స్ ఫౌండేషన్ భాగస్వామం కీలకం కానుందన్నారు. 1995 నుంచి బిల్‌గేట్స్‌తో తనకు మంచి సంబంధాలు ఉన్నాయని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. ప్రస్తుతం బిల్‌గేట్స్ భారత్‌లో పర్యటిస్తున్నారు. ఇటీవల కాలంలో దేశంలో మూడోసారి పర్యటిస్తున్న బిల్ గేట్స్ బుధవారం పార్లమెంట్‌లో కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి జేపీ నడ్డాతో భేటీ అయ్యారు.