Polavaram | కాసేపట్లో.. పోలవరానికి జగన్, చంద్రబాబు

Polavaram ఉత్కంఠగా సాగనున్న పర్యటనలు విధాత‌: మొన్న చంద్రబాబు పుంగనూరు వెళ్లినందుకే నానా గలాటా జరిగింది. పోలీసుల లాఠీచార్జి .. పోలీస్ వాహనాల దహనం. వరకూ వెళ్ళింది.. మరి అలాంటిది జగన్, చంద్రబాబు ఒకేచోట ఉంటే. ఇంకెలా ఉంటుందో… ఏమో కానీ కాసేపట్లో చంద్రబాబు.. జగన్ ఇద్దరూ ఒకేచోటికి వెళ్ళబోతున్నారు. పోలవరం ప్రాజెక్ట్ ఉన్న పోలవరం నియోజకవర్గంలో ఇద్దరూ ఒకేరోజు పర్యటిస్తున్నారు. ఇద్దరూ రాజమండ్రిలో రాత్రి బస చేస్తారు. 'సాగునీటి ప్రాజెక్టుల విధ్వంసంపై యుద్ధభేరి' పేరిట ఈమధ్య […]

  • By: Somu |    latest |    Published on : Aug 07, 2023 5:16 AM IST
Polavaram | కాసేపట్లో.. పోలవరానికి జగన్, చంద్రబాబు

Polavaram

  • ఉత్కంఠగా సాగనున్న పర్యటనలు

విధాత‌: మొన్న చంద్రబాబు పుంగనూరు వెళ్లినందుకే నానా గలాటా జరిగింది. పోలీసుల లాఠీచార్జి .. పోలీస్ వాహనాల దహనం. వరకూ వెళ్ళింది.. మరి అలాంటిది జగన్, చంద్రబాబు ఒకేచోట ఉంటే. ఇంకెలా ఉంటుందో… ఏమో కానీ కాసేపట్లో చంద్రబాబు.. జగన్ ఇద్దరూ ఒకేచోటికి వెళ్ళబోతున్నారు. పోలవరం ప్రాజెక్ట్ ఉన్న పోలవరం నియోజకవర్గంలో ఇద్దరూ ఒకేరోజు పర్యటిస్తున్నారు.

ఇద్దరూ రాజమండ్రిలో రాత్రి బస చేస్తారు. ‘సాగునీటి ప్రాజెక్టుల విధ్వంసంపై యుద్ధభేరి’ పేరిట ఈమధ్య సాగునీటి ప్రాజెక్టులను సందర్శిస్తున్న ఆయన ఆదివారం రాత్రికి ఏలూరు చేరుకున్నారు. ఏలూరు జిల్లా పోలవరం నియోజకవర్గం పరిధిలో ఉన్న కూనవరం మండలం(అల్లూరి సీతారామరాజు జిల్లా)లో సీఎం.. చింతలపూడి, పట్టిసీమ మీదుగా పోలవరం వెళ్లి ప్రాజెక్టును చంద్రబాబు పరిశీలిస్తారు

సోమవారం ఉదయం పది గంటలకు చింతలపూడి చేరుకుని పరిశీలిస్తారు. మధ్యాహ్నం 12.30కు పోలవరం మండలం పట్టిసీమకు చేరుకుని పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ఇస్తారు. అనంతరం ఎత్తిపోతలను పరిశీలిస్తారు. అక్కడి నుంచి పోలవరం వెళ్లి ప్రాజెక్టును, పనుల తీరును పరిశీలిస్తారు..తన హయాంలో సోమవారాన్ని పోలవారం గా మర్చి తరచూ పనులను పరిశీలించి ప్రాజెక్టును పరుగులు పెట్టించాం కానీ ఇప్పటి ప్రభుత్వం దాన్ని పక్కనబెట్టేసిందని చంద్రబాబు ఆరోపిస్తున్నారు.

ఈ క్రమంలోనే అయన పోలవరం వెళ్తున్నారు. మరోవైపు అదే చింతూరు డివిజన్‌లోని కూనవరంమండలంలో జగన్ పర్యటిస్తారు. మొన్నటి వర్షాలకు ఈ ప్రాంతం మొత్తం మునిగిపోగా వేలాదిప్రజలు ఇబ్బందులు పడ్డారు. అయితే ప్రభుత్వపరంగా సాయం అందించారు కానీ సీఎం మళ్ళీ అక్కడికి వెళ్తే బాగుంటుందని ఐ భావించి ఇప్పుడు జగన్ అక్కడికి వెళ్తున్నారు. మొత్తానికి ఇద్దరు అగ్రనాయకులు దాదాపు ఒకే ప్రాంతంలో పర్యటిస్తుండడంతో పోలీసులు ఉరుకులు పరుగులు పెడుతున్నారు.