CM KCR | సీఎం కేసీఆర్‌కు చిత్రపటం.. బహూకరించిన మంత్రి జగదీష్‌రెడ్డి

CM KCR విధాత: బిఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ ప్లీనరీ సందర్భంగా సీఎం కేసీఆర్ కు ఆయన చిత్రపటాన్ని మంత్రి జి. జగదీష్ రెడ్డి బహుకరించారు. మెదక్ జిల్లాకు చెందిన ఆర్టిస్టు డానియల్ రూపొందించిన కేసీఆర్ చిత్రపటాన్ని మంత్రి జగదీష్ రెడ్డి, శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్ సహా ఉమ్మడి నల్గొండ జిల్లా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజా ప్రతినిధులతో కలిసి కేసిఆర్ కు అందజేశారు. ప్లీనరీకి మంత్రి జగదీష్ […]

CM KCR | సీఎం కేసీఆర్‌కు చిత్రపటం.. బహూకరించిన మంత్రి జగదీష్‌రెడ్డి

CM KCR

విధాత: బిఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ ప్లీనరీ సందర్భంగా సీఎం కేసీఆర్ కు ఆయన చిత్రపటాన్ని మంత్రి జి. జగదీష్ రెడ్డి బహుకరించారు. మెదక్ జిల్లాకు చెందిన ఆర్టిస్టు డానియల్ రూపొందించిన కేసీఆర్ చిత్రపటాన్ని మంత్రి జగదీష్ రెడ్డి, శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్ సహా ఉమ్మడి నల్గొండ జిల్లా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజా ప్రతినిధులతో కలిసి కేసిఆర్ కు అందజేశారు.

ప్లీనరీకి మంత్రి జగదీష్ రెడ్డి తో పాటు ఉమ్మడి నల్గొండ జిల్లా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అంతా గులాబీ రంగు చొక్కాలు, కుర్తాలు ధరించి హాజరైన తీరు ప్లీనరీలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. కేసిఆర్ ప్లీనరీకి వస్తున్న క్రమంలో మంత్రి జగదీష్ రెడ్డి జిల్లా ప్రజా ప్రతినిధులతో కలిసి వేదిక వద్దకు ఆయనను తోడుకొని వచ్చారు. ప్లీనరీలో భాగంగా జగదీష్ రెడ్డి కూడా ప్రసంగించారు.