CM KCR | తెలంగాణ ఆత్మగౌరవ ప్రతీక.. సర్దార్‌ సర్వాయి పాపన్నగౌడ్‌

CM KCR | విధాత : తెలంగాణ బహుజన ఆత్మగౌరవానికి, ధీరత్వానికి సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ ప్రతీకగా నిలిచారని సీఎం కేసీఆర్ కొనియాడారు. సర్వాయి పాపన్న జయంతి సందర్భంగా ఆయనకు నివాళుర్పించిన సీఎం కేసీఆర్ పాపన్న బహుజనుల కోసం చేసిన కృషిని, పోషించిన చారిత్రక పాత్రను స్మరించుకున్నారు. సబ్బండ వర్గాలకు రాజకీయ, సామాజిక సమానత్వం కోసం పాపన్న చేసిన కృషి చరిత్రలో నిలిచిపోతుందన్నారు. కుల, మతాల వివక్ష లేకుండా అన్ని వర్గాలకు రాజ్యాధికారంలో భాగస్వామ్యం దక్కాలనే […]

  • By: Somu |    latest |    Published on : Aug 18, 2023 1:23 PM IST
CM KCR | తెలంగాణ ఆత్మగౌరవ ప్రతీక.. సర్దార్‌ సర్వాయి పాపన్నగౌడ్‌

CM KCR |

విధాత : తెలంగాణ బహుజన ఆత్మగౌరవానికి, ధీరత్వానికి సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ ప్రతీకగా నిలిచారని సీఎం కేసీఆర్ కొనియాడారు. సర్వాయి పాపన్న జయంతి సందర్భంగా ఆయనకు నివాళుర్పించిన సీఎం కేసీఆర్ పాపన్న బహుజనుల కోసం చేసిన కృషిని, పోషించిన చారిత్రక పాత్రను స్మరించుకున్నారు.

సబ్బండ వర్గాలకు రాజకీయ, సామాజిక సమానత్వం కోసం పాపన్న చేసిన కృషి చరిత్రలో నిలిచిపోతుందన్నారు. కుల, మతాల వివక్ష లేకుండా అన్ని వర్గాలకు రాజ్యాధికారంలో భాగస్వామ్యం దక్కాలనే సమ సమాజ ప్రజాస్వామిక స్ఫూర్తితో ఆనాటి కాలంలోనే పాపన్నగౌడ్ పోరాడడం గొప్ప విషయమన్నారు.

విశ్వకీర్తిని పొందిన పాపన్న గొప్పతనాన్ని స్మరించుకునేందుకు ప్రతి ఏటా వారి జయంతి, వర్ధంతి కార్యక్రమాలను తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా ఘనంగా నిర్వహిస్తున్నదని సీఎం కేసీఆర్‌ పేర్కొన్నారు. తెలంగాణ స్వయం పాలనలో సబ్బండ వర్గాలకు రాజకీయ అధికారంలో భాగస్వామ్యం లభించిందని, స్వరాష్ట్రంలో వేలాది మంది దళిత, బహుజన బిడ్డలను నాయకులుగా తీర్చి
దిద్దడం ద్వారా పాపన్నగౌడ్ ఆశయాలను తెలంగాణ ప్రభుత్వం నెరవేరుస్తుందన్నారు.

పాపన్నగౌడ్‌కు పీసీసీ చీఫ్ రేవంత్ నివాళులు

బహుజన విప్లవ వీరుడు సర్దార్ సర్వాయి పాపన్న జయంతి సందర్భంగా గాంధీభవన్ లో ఆయన చిత్రపటానికి నివాళులు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి నివాళులు అర్పించారు. పాపన్నగౌడ్ స్ఫూర్తితో బహుజనుల అభ్యున్నతికి చేస్తున్న కృషిని మునుముందు కూడా కొనసాగిస్తుందన్నారు. బహుజనుల రాజ్యాధికార సాధనలో వారికి చట్టసభలలో సముచిత స్థానం కల్పించేందుకు ప్రయత్నిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే సంపత్, పార్టీ నాయకులు పాల్గొన్నారు.