CM KCR | టీఎస్ ఐపాస్ లాంటి పాల‌సీ ప్ర‌పంచంలో ఎక్క‌డా లేదు : సీఎం కేసీఆర్

CM KCR | విధాత : రాష్ట్ర ప్ర‌భుత్వం ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకొచ్చిన టీఎస్ ఐపాస్ లాంటి పాల‌సీ ప్ర‌పంచంలో ఎక్క‌డా లేద‌ని ముఖ్య‌మంత్రి కేసీఆర్ స్ప‌ష్టం చేశారు. టీఎస్ ఐపాస్ ద్వారా ల‌క్ష‌ల పెట్టుబ‌డులు ఆక‌ర్షించామ‌ని, ఇప్ప‌టికే చాలా ప‌రిశ్ర‌మ‌లు తెలంగాణ‌లో పెట్టుబ‌డులు పెట్టాయ‌ని కేసీఆర్ తెలిపారు. రంగారెడ్డి జిల్లా కొండల్‌ వద్ద నిర్మించిన మేధా గ్రూప్‌ రైల్వేకోచ్‌ ఫ్యాక్టరీని కేసీఆర్ గురువారం ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా అక్క‌డ ఏర్పాటు చేసిన స‌భ‌లో సీఎం పాల్గొని ప్ర‌సంగించారు. […]

CM KCR | టీఎస్ ఐపాస్ లాంటి పాల‌సీ ప్ర‌పంచంలో ఎక్క‌డా లేదు : సీఎం కేసీఆర్

CM KCR | విధాత : రాష్ట్ర ప్ర‌భుత్వం ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకొచ్చిన టీఎస్ ఐపాస్ లాంటి పాల‌సీ ప్ర‌పంచంలో ఎక్క‌డా లేద‌ని ముఖ్య‌మంత్రి కేసీఆర్ స్ప‌ష్టం చేశారు. టీఎస్ ఐపాస్ ద్వారా ల‌క్ష‌ల పెట్టుబ‌డులు ఆక‌ర్షించామ‌ని, ఇప్ప‌టికే చాలా ప‌రిశ్ర‌మ‌లు తెలంగాణ‌లో పెట్టుబ‌డులు పెట్టాయ‌ని కేసీఆర్ తెలిపారు. రంగారెడ్డి జిల్లా కొండల్‌ వద్ద నిర్మించిన మేధా గ్రూప్‌ రైల్వేకోచ్‌ ఫ్యాక్టరీని కేసీఆర్ గురువారం ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా అక్క‌డ ఏర్పాటు చేసిన స‌భ‌లో సీఎం పాల్గొని ప్ర‌సంగించారు.

భారీ పెట్టుబ‌డితో ప్రారంభించిన మేధా గ్రూప్ రైల్వే కోచ్ ఫ్యాక్టరీ యాజ‌మాన్యానికి, మిగ‌తా వారికి హృద‌య‌పూర్వ‌కంగా శుభాకాంక్ష‌లు తెలుపుతున్నాన‌ని కేసీఆర్ పేర్కొన్నారు. ఈ ఫ్యాక్ట‌రీ అద్భుతంగా ఉంది. చాలా గ‌ర్వంగా ఉంది. ఎందుకంటే తెంగాణ రాష్ట్రం ఏర్ప‌డ‌ట‌మే కాదు. గ‌తంలో ఉండే తెలంగాణ‌లో ఒక వెలితి ఉండేది. తెలంగాణ బిడ్డ‌లే ఈ రోజు దేశానికి, ప్ర‌పంచానికి అవ‌స‌ర‌మైన రైళ్ల‌ను త‌యారు చేసే ఇంత అద్భుత‌మైన‌ ప్రాజెక్టు ఇక్క‌డ తేవ‌డం సంతోషంగా ఉంది. దాదాపు రూ. 2,500 కోట్ల పెట్టుబ‌డితో ఫేజ్ 1 పూర్తి చేసి మ్యానుఫ్యాక్చ‌రింగ్ యూనిట్ కూడా ప్రారంభించి ఈ రోజు నాతో ప్రారంభించుకున్నారు. ఈ సంద‌ర్భంగా వారికి శుభాకాంక్ష‌లు తెలుపుతున్నాను. ఈ ఫ్యాక్ట‌రీ ఇంకా ముందుకు పోవాలి అని కేసీఆర్ ఆకాంక్షించారు.

వ్యాక్సినేష‌న్‌ను ప్ర‌పంచానికి స‌ర‌ఫ‌రా చేస్తున్నాం..

ఇవాళ మ‌నం చూస్తున్నాం. హైద‌రాబాద్‌లో ఫార్మా ఇండ‌స్ట్రీ బాగా పెరిగింది. పౌల్ట్రీ ఇండ‌స్ట్రీ బాగా పెరిగింది. అదే విధంగా జీనోమ్ వ్యాలీలో వ్యాక్సినేష‌న్‌ను వ‌న్ థ‌ర్డ్ పై చిలుకు ప్ర‌పంచానికి స‌ర‌ఫ‌రా చేస్తున్నాం. దీనికి సంబంధించి తాను ఎందుకు చెప్తున్నానంటే ఎక్క‌డ ఏది అభ్యుద‌య ప‌థంలో, ప్ర‌గ‌తి ప‌థంలో గుభాళించాల‌న్నా, బ్ర‌హ్మాండంగా రావాల‌న్నా.. దానికి సంబంధించిన ఎకో బిల్డ్ కావాలి. ఆ ఎకోలో భాగంగానే మేం బాగా క‌ఠిన‌మైన నిర్ణ‌యం తీసుకొని ప్ర‌పంచంలోనే ఎక్క‌డా లేని విధంగా టీఎస్ ఐపాస్ తెచ్చాం. ఆ విష‌యం మీకు తెలుసు. టీఎస్ ఐపాస్ తెచ్చిన‌ప్పుడు నేను చాలా శ్ర‌మ ప‌డ్డాను అని కేసీఆర్ గుర్తు చేశారు.

టీఎస్ ఐపాస్ ద్వారా ల‌క్షల కోట్ల పెట్టుబ‌డులు ఆక‌ర్షించాం..

దాదాపు 70 నుంచి 80 దేశాల నుంచి పారిశ్రామిక విధానాల‌ను తెప్పించాం అని సీఎం తెలిపారు. తెలంగాణ ఏర్ప‌డిన కొత్త‌లో బిజినెస్ స‌మ్మిట్స్ అడ్ర‌స్ చేసేట‌ప్పుడు నేను చాలా గ‌ర్వంగా చెప్పేవాడిని. ది టీఎస్ ఐపాస్ ఈస్ గోయింట్ టు బీ ఏ సింగిల్ విండో. వేరే చోట్ల ఉన్నాయి సింగిల్ విండోస్. ప్ర‌ప‌చంలోని చాలా దేశాల్లో, దేశంలోని చాలా రాష్ట్రాల్లో చాలా చోట్ల సింగిల్ విండోస్ ఉన్నాయి. కానీ మ‌న టీఎస్ ఐపాస్ పాల‌సీ ద్వారా ల‌క్ష‌ల కోట్ల పెట్టుబ‌డులు ఆక‌ర్షిస్తున్నాం. ఎంత క‌ఠిన‌మైన చ‌ట్టం అంటే.. 15 రోజుల్లో ప‌రిశ్ర‌మ‌ల‌కు అనుమ‌తిస్తున్నాం. ఏ ఆఫీస‌ర్ టేబుల్ మీద‌ ఫైల్ ఆగిపోతే వాళ్ల‌కు రోజు వెయ్యి జ‌రిమానా వేసేలా చ‌ర్య‌లు తీసుకున్నాం. ఇలాంటి చ‌ర్య‌ల వ‌ల్ల పారిశ్రామిక ప్ర‌గ‌తి పెరుగుతుంది. ఇన్మ‌ఫ‌ర్మేష‌న్ టెక్నాల‌జీ పెరుగుతుంది అని కేసీఆర్ తెలిపారు.

చాలా ఆనందంగా ఉంది..

ఈ రోజు నాకు చాలా ఆనందంగా ఉంద‌ని సీఎం పేర్కొన్నారు. మా వ‌రంగ‌ల్ ముద్దుబిడ్డ‌లు ఇద్ద‌రు క‌శ్య‌ప్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి ఇంత పెద్ద వెంచ‌ర్ తీసుకొచ్చి వంద‌ల మందికి ఉద్యోగాలు క‌ల్పిస్తున్నారు. గొప్ప విష‌య‌మేంటంటే దీంట్లో మ‌లేషియ‌న్ కంపెనీ పెట్టుబ‌డులు పెట్టింది. దీనికి యాంగ్జిల‌రీగా విడి భాగాలు అందించేందుకు మ‌రో ఐదారు ప్ర‌పంచ స్థాయి కంపెనీలు రాబోతున్నాయని కేసీఆర్ తెలిపారు.

మేధాకు ఎల్ల‌వేళ‌లా స‌హాయ‌స‌హ‌కారాలు అందిస్తాం..

ఇంత గొప్ప ప్రాజెక్టు టేకాప్ చేయ‌డ‌మే కాదు.. పూర్తిగా రైల్వే కోచ్ కూడా ఇక్క‌డే త‌యారు చేసే ప‌ద్ధ‌తిలో వారికి ముంబై నుంచి మోనో రైలు ఆర్డ‌ర్ రావ‌డం చాలా గొప్ప విష‌య‌మ‌ని కేసీఆర్ ప్ర‌శంసించారు. భ‌విష్య‌త్‌లో పూర్తి స్థాయిలో రైలు రైలే ఇక్క‌డ త‌యార‌య్యే విధంగా ప్ర‌ణాళిక‌లు ర‌చిస్తామ‌ని క‌శ్య‌ప్ రెడ్డి చెప్పారు. ఇక్క‌డే కాకుండా ఇతర దేశాల‌కు ఎగుమ‌తి చేసే స్థాయికి ఎదుగుతున్నామ‌ని చెప్పారు. వారి చిత్త‌శుద్ధిని నిజంగా అభినందిస్తున్నాను. రాష్ట్ర ప్ర‌భుత్వం త‌ర‌పున అన్ని ర‌కాల స‌హాయ స‌హ‌కారాలు అందిస్తాం. ఈ ప‌రిశ్ర‌మ పెద్ద ఎత్తున అభివృద్ధి చెంద‌డానికి కావాల్సిన స‌హాయ‌స‌హ‌కారం రాష్ట్ర ప్ర‌భుత్వం ఎల్ల‌వేళ‌లా అందిస్తుంది. ఏ ప‌ని ఉన్నా నిమిషాల్లో చేయిస్తాం. మీరు ఇంకా అభివృద్ధి చెందాలి. ఇండ‌స్ట్రీ బాగా పెర‌గాలి. రాష్ట్రానికి, దేశానికి మంచి పేరు తేవాల‌ని కోరుకుంటున్నాను అని చెబుతూ కేసీఆర్ త‌న ప్ర‌సంగాన్ని ముగించారు.