CM KCR | దేశానికి రైళ్లు ఇస్తున్న తెలంగాణ: CM KCR

CM KCR మేథా బృందానికి అభినందనలు టీఎస్‌ఐపాస్‌లాంటిది ఎక్కడాలేదు మేథా రైల్వేకోచ్‌ ఫ్యాక్టరీ ప్రారంభం విధాత : తెలంగాణ బిడ్డలే ఈ రోజు దేశానికి, ప్రపంచానికి అవసరమైన రైళ్లు తయారుచేస్తున్నారని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అన్నారు. రూ.2500 కోట్ల పెట్టుబడితో ఫేజ్‌-1ను తాను ప్రారంభించడం సంతోషంగా ఉన్నదని చెప్పారు. హైదరాబాద్‌లో ఫార్మా, పౌల్ట్రీ ఇండస్ట్రీ బాగా పెరిగిందని అన్నారు. జీనోమ్‌వ్యాలీలో వ్యాక్సిన్లు ఉత్పత్తి చేసి, దాదాపు మూడింట ఒకటో వంతు ప్రపంచానికి సరఫరా చేస్తున్నామని తెలిపారు. ఎక్కడ […]

CM KCR | దేశానికి రైళ్లు ఇస్తున్న తెలంగాణ: CM KCR

CM KCR

  • మేథా బృందానికి అభినందనలు
  • టీఎస్‌ఐపాస్‌లాంటిది ఎక్కడాలేదు
  • మేథా రైల్వేకోచ్‌ ఫ్యాక్టరీ ప్రారంభం

విధాత : తెలంగాణ బిడ్డలే ఈ రోజు దేశానికి, ప్రపంచానికి అవసరమైన రైళ్లు తయారుచేస్తున్నారని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అన్నారు. రూ.2500 కోట్ల పెట్టుబడితో ఫేజ్‌-1ను తాను ప్రారంభించడం సంతోషంగా ఉన్నదని చెప్పారు. హైదరాబాద్‌లో ఫార్మా, పౌల్ట్రీ ఇండస్ట్రీ బాగా పెరిగిందని అన్నారు.

జీనోమ్‌వ్యాలీలో వ్యాక్సిన్లు ఉత్పత్తి చేసి, దాదాపు మూడింట ఒకటో వంతు ప్రపంచానికి సరఫరా చేస్తున్నామని తెలిపారు. ఎక్కడ అభ్యుదయ పథంలో, ప్రగతి పథంలో గుబాళించాలన్నా, బ్రహ్మాండంగా రావాలన్న దానికి తగిన ఎకో బిల్డ్‌ కావాలన్న సీఎం.. అందుకే ప్రపంచంలోనే ఎక్కడాలేని విధంగా టీఎస్‌ ఐపాస్‌ను తీసుకువచ్చామని చెబుతూ దాని గొప్పతనాన్ని వివరించారు.

ఇలాంటి చర్యలతో పారిశ్రామిక ప్రగతి, ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ పెరుగుతున్నదని సంతోషం వ్యక్తం చేశారు. మేథా ప్రాజెక్టుకు ముంబై నుంచి మోనో రైలు తయారీకి ఆర్డర్‌ రావడం గొప్ప విషయమన్నారు. పారిశ్రామిక రంగానికి ఏ సమస్యల వచ్చినా పరిష్కరించేందుకు సిద్ధమని సీఎం హామీ ఇచ్చారు. పరిశ్రమ అభివృద్ధికి సంపూర్ణ సహకారం, సహాయం రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుందని తెలిపారు.