CM KCR | భారీ వర్షాలు.. సీఎం మెదక్ జిల్లా పర్యటన వాయిదా

CM KCR | భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని 23న సీఎం మెదక్ పర్యటన ఖరారు వెల్లడించిన సీఎం కార్యాలయం విధాత: రాష్ట్రంలో భారీ వర్షాలు కురిసే పరిస్థితులున్నాయని వాతావరణ శాఖ 'ఎల్లో అలెర్ట్’ జారీ చేసింది. భారీ వర్షాలు కురిసే వాతావరణం ఉన్న నేపథ్యంలో సీఎం కేసీఆర్‌ ఈ నెల 19న జరుప తలపెట్టిన మెదక్ జిల్లా పర్యటనను 23వ తేదీకి వాయిదా వేశారు. భారీ వర్షాలు కురిసే పరిస్థితులున్నాయని వాతావరణ శాఖ 'ఎల్లో […]

CM KCR | భారీ వర్షాలు.. సీఎం మెదక్ జిల్లా పర్యటన వాయిదా

CM KCR |

  • భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని
  • 23న సీఎం మెదక్ పర్యటన ఖరారు
  • వెల్లడించిన సీఎం కార్యాలయం

విధాత: రాష్ట్రంలో భారీ వర్షాలు కురిసే పరిస్థితులున్నాయని వాతావరణ శాఖ ‘ఎల్లో అలెర్ట్’ జారీ చేసింది. భారీ వర్షాలు కురిసే వాతావరణం ఉన్న నేపథ్యంలో సీఎం కేసీఆర్‌ ఈ నెల 19న జరుప తలపెట్టిన మెదక్ జిల్లా పర్యటనను 23వ తేదీకి వాయిదా వేశారు.

భారీ వర్షాలతో వరదలు వస్తే ప్రజలు ఇబ్బందులకు గురవుతారని, నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండి సహాయక చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంటుందని భావించి ఈ మేరకు మెదక్‌ జిల్లా పర్యటన వాయిదా వేశారు. ఈ మేరకు సీఎం కేసీఆర్‌ మెదక్‌ జిల్లా పర్యటన ఈ నెల23కు వాయిదా వేసినట్లు సీఎం కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది.

సీఎం కేసీఆర్ పర్యటన వాయిదా పడిందనీ జిల్లా కలెక్టర్ రాజర్షి షా మీడియాకు వెల్లడించారు. 23న యదావిధిగా కలెక్టర్ కార్యాలయం, ఎస్పీ కార్యాలయాలను సీఎం ప్రారంభించనున్నారు. బీఆర్ఎస్‌ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభిస్తారు. అనంతరం సీఎస్ఐ చర్చి కాంపౌండ్ స్థలంలో సీఎం కేసీఆర్ బ‌హిరంగ సభ నిర్వహించనున్నారు. అధికారులు ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు.