CM KCR | పంట న‌ష్ట‌పోయిన రైతుల‌కు రూ. 10 వేలు ప‌రిహారం.. ప్ర‌క‌టించిన సీఎం కేసీఆర్

CM KCR | రాష్ట్ర వ్యాప్తంగా ఇటీవ‌ల కురిసిన వ‌డ‌గ‌ళ్ల వాన‌( Hailstorm ), భారీ వ‌ర్షాల‌కు( Heavy Rains ) ఆయా ప్రాంతాల్లో పంట‌లు దెబ్బ‌తిన‌డంతో రైతులు( Farmers ) తీవ్రంగా న‌ష్ట‌పోయిన సంగ‌తి తెలిసిందే. పంట న‌ష్ట‌పోయిన రైతులంద‌రికీ రూ. 10 వేల చొప్పున ప‌రిహారం ఇస్తున్న‌ట్లు ముఖ్య‌మంత్రి కేసీఆర్( CM KCR ) ప్ర‌క‌టించారు. ఖ‌మ్మం జిల్లా( Khammam Dist )లోని రామాపురం గ్రామంలో వ‌ర్షానికి దెబ్బ‌తిన్న పంట‌ల‌ను ప‌రిశీలించారు. అనంత‌రం అక్క‌డ […]

CM KCR | పంట న‌ష్ట‌పోయిన రైతుల‌కు రూ. 10 వేలు ప‌రిహారం.. ప్ర‌క‌టించిన సీఎం కేసీఆర్

CM KCR | రాష్ట్ర వ్యాప్తంగా ఇటీవ‌ల కురిసిన వ‌డ‌గ‌ళ్ల వాన‌( Hailstorm ), భారీ వ‌ర్షాల‌కు( Heavy Rains ) ఆయా ప్రాంతాల్లో పంట‌లు దెబ్బ‌తిన‌డంతో రైతులు( Farmers ) తీవ్రంగా న‌ష్ట‌పోయిన సంగ‌తి తెలిసిందే. పంట న‌ష్ట‌పోయిన రైతులంద‌రికీ రూ. 10 వేల చొప్పున ప‌రిహారం ఇస్తున్న‌ట్లు ముఖ్య‌మంత్రి కేసీఆర్( CM KCR ) ప్ర‌క‌టించారు. ఖ‌మ్మం జిల్లా( Khammam Dist )లోని రామాపురం గ్రామంలో వ‌ర్షానికి దెబ్బ‌తిన్న పంట‌ల‌ను ప‌రిశీలించారు. అనంత‌రం అక్క‌డ ఏర్పాటు చేసిన స‌మావేశంలో కేసీఆర్ మాట్లాడారు.

గాలి వాన నేప‌థ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ర‌కాల పంటలు క‌లిపి 2 ల‌క్ష‌ల 282 వేల 258 ఎక‌రాల్లో న‌ష్టం జ‌రిగింద‌ని కేసీఆర్ తెలిపారు. అందులో మేజ‌ర్‌గా 1,49,446 ఎక‌రాల్లో మొక్క‌జొన్న, 72,209 ఎక‌రాల్లో వ‌రి( Paddy ), 8 వేల ఎక‌రాల్లో మామిడి, 17 వేల ఎక‌రాల్లో ఇత‌ర పంటలు దెబ్బ‌తిన్నాయి.

తెలంగాణ రాష్ట్రం( Telangana State )లో పెద్ద ఎత్తున పెట్టుబ‌డులు పెట్టి పెండింగ్ ప్రాజెక్టుల‌ను పూర్తి చేయ‌డం, నూత‌న ప్రాజెక్టుల‌ను పూర్తి చేయ‌డం జ‌రిగింది. ప్ర‌పంచంలోనే ఎక్క‌డా లేని విధంగా రైతుల‌కు ప‌థ‌కాలు అమ‌ల‌వుతున్నాయి. రైతులు స్థిర‌ప‌డే స్థితికి వ‌స్తున్నారు. అప్పుల నుంచి తేరుకుంటున్నారు. చాలా మంది మూర్ఖులు ఉన్నారు. వ్య‌వ‌సాయం దండ‌గ అని చెప్పే మూర్ఖులు ఇంకా ఉన్నారు.

త‌ల‌స‌రి ఆదాయంలో తెలంగాణ దేశంలోనే నంబ‌ర్‌వ‌న్‌గా ఉంది. జీఎస్‌డీపీ పెరుగుద‌ల‌లో వ్య‌వ‌సాయం పాత్ర చాలా ఎక్కువ‌గా ఉంది. అద్భుత‌మైన వ్య‌వ‌సాయ రాష్ట్రంగా తెలంగాణ‌ను తీర్చిదిద్దామ‌న్నారు. రైతులు నిరాశ‌కు గురి కావ‌ద్దు. ప్ర‌భుత్వం అండ‌దండ‌గా ఉంటుంది. ఈ దేశంలో ప‌ద్ధ‌తి పాడు అంటూ లేదు. ఇన్సూరెన్స్ కంపెనీల‌కు లాభం క‌ల్పించే బీమాలు ఉన్నాయి త‌ప్పితే పంట న‌ష్టం జ‌రిగితే రైతుల‌కు లాభం చేకూర్చే బీమాలు, బీమా సంస్థ‌లు లేవు.

పాత కేంద్ర ప్ర‌భుత్వాలు అంతే.. ఇప్పుడున్న కేంద్ర ప్ర‌భుత్వ అంతే. బీఆర్ఎస్ అధికారంలోకి వ‌స్తే స‌మ‌గ్ర వ్య‌వ‌సాయ పాల‌సీ తీసుకువ‌స్తాం. భార‌త‌దేశానికే ఒక కొత్త అగ్రిక‌ల్చ‌ర్ పాల‌సీ తీసుకువ‌స్తాం. కేంద్రం నుంచి రూపాయి రాదు. అందుకే కేంద్రానికి పంట న‌ష్టం వివ‌రాలు పంప‌ద‌ల్చుకోలేదు. రాజకీయాలు చేయ‌డం త‌ప్ప రైతుల‌ను పట్టించుకోవ‌డం లేదు. మా రైతుల‌ను మేమే కాపాడుకుంటాం అని కేసీఆర్ స్ప‌ష్టం చేశారు.

తెలంగాణ ప్ర‌భుత్వంలో ఫ్రీ క‌రెంట్, ఫ్రీ వాట‌ర్ ఇస్తున్నాం.. దీంతో వ్య‌వ‌సాయం బాగా జ‌రుగుతుంది. వ్య‌వ‌సాయ రంగం అభివృద్ధి చెంద‌డంతో చాలా మందికి ఉపాధి దొరుకుతుంది. రైతు పుంజుకొని వ్య‌వ‌సాయం చేసుకునేందుకు రూ. 10 వేలు ప్ర‌క‌టిస్తున్నాం. త్వ‌ర‌లోనే వీరికి ప‌రిహారం అంద‌జేస్తాం అని కేసీఆర్ ప్ర‌క‌టించారు.

కౌలు రైతుల‌ను కూడా ఆదుకోవాలి..

కౌలు రైతులను కూడా ఆదుకోవాలని ఈ సందర్బంగా రైతులకు సీఎం కేసీఆర్‌ సూచించారు. పెట్టుబడి పెట్టినోళ్లు వాళ్లు కాబట్టి ప్రభుత్వం ఇచ్చే సాయంలో వాళ్లకు కూడా కొంత ఇచ్చి ఆదుకోవాలని కోరారు. దీనిపై రైతులను కౌలు రైతులను కలెక్టర్‌ పిలిచి మాట్లాడతారని తెలిపారు. తెలంగాణ ప్ర‌భుత్వ‌మే రైతు ప్ర‌భుత్వం. రైతులు ఎవ‌రూ నిరాశ‌కు గురికావొద్దు. భ‌విష్య‌త్‌లో ఉన్న‌త‌మైన గొప్ప పంట‌లు పండించాలి. ధైర్యాన్ని వీడొద్ద‌ని కేసీఆర్ సూచించారు.