ఆ ముఖ్యమంత్రి ఆస్తి రూ. 64.97 కోట్లు..
విధాత : ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ 2021, డిసెంబర్ నాటికి రూ. 64.97 కోట్ల ఆస్తులు కలిగి ఉన్నట్లు ఆ రాష్ట్ర అధికారిక పోర్టల్‌లో పేర్కొన్నారు. ఒడిశా మంత్రులు ఇటీవలే తమ ఆస్తుల వివరాలను ప్రభుత్వానికి నివేదించారు. ఆ నివేదిక ప్రకారం.. సీఎం పట్నాయక్ రూ. 12.09 కోట్ల చరాస్తులను కలిగి ఉన్నారు. స్థిరాస్తులు రూ. 52.88 కోట్లు కాగా, ఇవి తల్లిదండ్రులు బీజూ, గ్యాన్ పట్నాయక్ నుంచి సంక్రమించినవి అని పేర్కొన్నారు. ఇక రూ. […]

విధాత : ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ 2021, డిసెంబర్ నాటికి రూ. 64.97 కోట్ల ఆస్తులు కలిగి ఉన్నట్లు ఆ రాష్ట్ర అధికారిక పోర్టల్‌లో పేర్కొన్నారు. ఒడిశా మంత్రులు ఇటీవలే తమ ఆస్తుల వివరాలను ప్రభుత్వానికి నివేదించారు.
ఆ నివేదిక ప్రకారం.. సీఎం పట్నాయక్ రూ. 12.09 కోట్ల చరాస్తులను కలిగి ఉన్నారు. స్థిరాస్తులు రూ. 52.88 కోట్లు కాగా, ఇవి తల్లిదండ్రులు బీజూ, గ్యాన్ పట్నాయక్ నుంచి సంక్రమించినవి అని పేర్కొన్నారు. ఇక రూ. 3.45 లక్షల విలువ చేసే బంగారు ఆభరణాలు, 1980 మోడల్‌కు చెందిన అంబాసిడర్ కారు ఉన్నట్లు తెలిపారు. దేశ రాజధాని న్యూఢిల్లీతో పాటు భువనేశ్వర్, హింజ్లికట్, బార్‌ఘర్‌లో బ్యాంకు ఖాతాలు ఉన్నాయి. ఢిల్లీలోని జన్‌పథ్‌లోని బ్యాంకులో రూ. 72 లక్షలు, భువనేశ్వర్‌లోని ఎస్‌బీఐలో రూ. 21.71 లక్షలు డిపాజిట్ చేసినట్లు పేర్కొన్నారు.