Bank Holidays | జూన్ మాసం మరో రెండు రోజుల్లో ముగియనుంది. జులై నెల శనివారం నుంచి ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో జులై నెలలో బ్యాంకులకు ఎన్ని రోజులు సెలవులు వస్తున్నాయనే విషయం తెలుసుకుందాం. అయితే ప్రస్తుతం డిజిటల్ చెల్లింపులు కొనసాగుతున్నప్పటికీ.. భారీ మొత్తంలో ఆర్థిక లావాదేవీలు జరిపేవారు, ఇతరత్రా పనులపై పలువురు ఖాతాదారులు బ్యాంకులకు వెళ్లాల్సిన పరిస్థితి తప్పక ఉంటుంది. కాబట్టి బ్యాంకులకు ఏయే రోజుల్లో సెలవులు ఉన్నాయో చెక్ చేసుకుంటే మంచిది. దేశంలోని వివిధ […]
Bank Holidays | జూన్ మాసం మరో రెండు రోజుల్లో ముగియనుంది. జులై నెల శనివారం నుంచి ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో జులై నెలలో బ్యాంకులకు ఎన్ని రోజులు సెలవులు వస్తున్నాయనే విషయం తెలుసుకుందాం.
అయితే ప్రస్తుతం డిజిటల్ చెల్లింపులు కొనసాగుతున్నప్పటికీ.. భారీ మొత్తంలో ఆర్థిక లావాదేవీలు జరిపేవారు, ఇతరత్రా పనులపై పలువురు ఖాతాదారులు బ్యాంకులకు వెళ్లాల్సిన పరిస్థితి తప్పక ఉంటుంది. కాబట్టి బ్యాంకులకు ఏయే రోజుల్లో సెలవులు ఉన్నాయో చెక్ చేసుకుంటే మంచిది.
దేశంలోని వివిధ ప్రాంతాల్లో జులై నెలలో బ్యాంకులకు 15 రోజులు సెలవులు. వాటిల్లో ఐదు ఆదివారాలు, రెండో శనివారం, నాలుగో శనివారం కలిపి ఏడు రోజులు దేశవ్యాప్తంగా సెలవు. మిగతా ఎనిమిది రోజుల్లో వివిధ కారణాలతో దేశంలోని వివిధ రాష్ట్రాల్లో బ్యాంకులు పని చేయవు.
జులై 2(ఆదివారం) – దేశమంతటా సెలవు
జులై 5(బుధవారం) – గురు హర్ గోవింద్ సింగ్ జయంతి -జమ్ము, శ్రీనగర్లలో సెలవు
జులై 6(గురువారం) – మిజోరంలో బ్యాంకులు పని చేయవు
జులై 8(రెండో శనివారం) – దేశమంతటా సెలవు
జులై 9(ఆదివారం) – దేశమంతటా సెలవు
జులై 11(మంగళవారం) – కెర్ పూజ(త్రిపురలో బ్యాంకులకు సెలవు)
జులై 13(గురువారం) – భానూ జయంతి(సిక్కింలో బ్యాంకులకు సెలవు)
జులై 16(ఆదివారం) – దేశమంతటా సెలవు
జులై 17(సోమవారం) – యూ టీరోట్ సింగ్ డే(మేఘాలయలో సెలవు)
జులై 21(శుక్రవారం) – ద్రుక్ప షేజీ(సిక్కింలో సెలవు)
జులై 22 (నాలుగో శనివారం) – దేశమంతటా సెలవు
జులై 23(ఆదివారం) – దేశమంతటా సెలవు
జులై 28 (శుక్రవారం) – జమ్ము కశ్మీర్లో బ్యాంకులు పని చేయవు.
జులై 29(శనివారం) – మొహర్రం సెలవు
జులై 30(ఆదివారం) – దేశమంతటా సెలవు