CM Revanth Reddy | రైతులను నష్టపరిస్తే సహించేది లేదు
విధాత: ధాన్యం కొనుగోళ్లలో ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని, రైతుల కష్టాన్ని ఎవరైనా మార్కెట్ కమిటీ అధికారులు.. వ్యాపారులతో కుమ్మక్కై తక్కువ చేసే ప్రయత్నం చేస్తే సహించేది లేదని సీఎం రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు.
జనగామ వ్యవసాయ మార్కెట్‌లో తేమ, తాలు పేరుతో వ్యాపారులతో కుమ్మక్కై ధాన్యం మద్ధతు ధర తగ్గించిన ఘటనపై కాలంలో స్పందించి మార్కెట్ కార్యదర్శిని సస్పెండ్ చేసి, రైతులను మోసం చేయడానికి ప్రయత్నించిన నలుగురు ట్రేడర్లపై క్రిమినల్ కేసులు పెట్టాలని ఆదేశించిన డిషనల్ కలెక్టర్ రోహిత్ సింగ్ ను అభినందిస్తున్నట్లుగా సీఎం రేవంత్‌రెడ్డి ట్విటర్‌లో తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా అధికారులందరూ ధాన్యం కొనుగోళ్ల విషయంలో అప్రమత్తంగా ఉండాలని కోరుతున్నానని, మద్దతు ధర అందించే విషయంలో నిక్కచ్చిగా వ్యవహారించాలని ఆదేశించారు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram