Niti Aayog | ప్రధాని నీతి ఆయోగ్ సభకు.. సీఎంలు గాయిబ్

Niti Aayog meeting 9మంది సీఎంలు ఆబ్సెంట్ విధాత‌: అదేమిటో గజ ఇతగాడు ఇంటి ముందు కాలువలో పడి కొట్టుకుపోయినట్లు అయింది.. ప్రధాని మోడీకి ఎక్కడెక్కడి ప్రధానులు పాదాభివందనాలు చేస్తారు. ఇంకెవరో రాష్ట్రపతి ఆటోగ్రాఫ్ కోరతారు. ఇంకొందరు మీరు విశ్వ గురువులు అంటారు.. కానీ సొంత దేశంలో మాత్రం చాలా మంది ముఖ్యమంత్రులు వ్యతిరేకంగా ఉంటారు. ఆయన మీటింగ్ పెడితే చాలామంది కావాలనే ఎగ్గొడతారు. ప్రధాని మోడీ శనివారం ఢిల్లీలో ఏర్పాటు చేసిన నీతి ఆయోగ్ భేటీ […]

Niti Aayog | ప్రధాని నీతి ఆయోగ్ సభకు.. సీఎంలు గాయిబ్

Niti Aayog meeting

  • 9మంది సీఎంలు ఆబ్సెంట్

విధాత‌: అదేమిటో గజ ఇతగాడు ఇంటి ముందు కాలువలో పడి కొట్టుకుపోయినట్లు అయింది.. ప్రధాని మోడీకి ఎక్కడెక్కడి ప్రధానులు పాదాభివందనాలు చేస్తారు. ఇంకెవరో రాష్ట్రపతి ఆటోగ్రాఫ్ కోరతారు. ఇంకొందరు మీరు విశ్వ గురువులు అంటారు.. కానీ సొంత దేశంలో మాత్రం చాలా మంది ముఖ్యమంత్రులు వ్యతిరేకంగా ఉంటారు. ఆయన మీటింగ్ పెడితే చాలామంది కావాలనే ఎగ్గొడతారు.

ప్రధాని మోడీ శనివారం ఢిల్లీలో ఏర్పాటు చేసిన నీతి ఆయోగ్ భేటీ ఆయనకు కాస్త చికాకుని
కల్పించే పరిస్థితి తెచ్చింది. ఈ సదస్సుకు తొమ్మిది రాష్ట్రాల ముఖ్యమంత్రులు గైర్హాజరు కావటం నిజంగానే ఇబ్బందికరం అని చెప్పవచ్చు. శనివారం మధ్యాహ్నం ప్రారంభమైన నీతి ఆయోగ్ పాలక మండలి సమావేశానికి.. పాలక మండలి సభ్యులుగా ఉన్న రాష్ట్రాల ముఖ్యమంత్రులు.. లెఫ్టినెంట్ గవర్నర్లు.. కేంద్ర మంత్రులు హాజరు కాగా.. తొమ్మిది రాష్ట్రాల సీఎంలు గైర్హాజరు అయ్యారు.

ఢిల్లీ, బెంగాల్, తమిళనాడు, తెలంగాణ, పంజాబ్ బిహార్ కేర కర్ణాటక రాజస్థాన్ ఇదిలా ఉండగా ఈ ఆబ్సెంట్ ముఖ్యమంత్రులంతా బీజేపీయేతర రాష్ట్రాలవారే ఉన్నారు. కేసీఆర్ అయితే ప్రగతి భవన్ లో ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తో భేటీ అయ్యారు. ఈ భేటీలో అదే పార్టీకి చెందిన పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ ఉన్నారు.

అనారోగ్యం కారణంగా రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ రాలేదు. కేబినెట్ విస్తరణ పనుల్లో బిజీ అంటూ మొన్న గెలిచిన కర్ణాటక సీఎం సిద్ధరామయ్య కూడా వెళ్ళలేదు. ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ మాత్రం ఈ సమావేశానికి వెళ్లారు.