డిసెంబ‌ర్ 31న భారీగా కండోమ్స్ ఆర్డ‌ర్.. స్విగ్గీ ట్వీట్

Swiggy | డిసెంబ‌ర్ 31 అన‌గానే యూత్‌కు గుర్తువ‌చ్చేది మ‌ద్యం. ఇక బిర్యానీలు, కేక్‌లు. సంవ‌త్స‌రం చివ‌రి రోజు కాబ‌ట్టి.. కొత్త ఏడాదంతా గుర్తుండి పోయే విధంగా డిసెంబ‌ర్ 31న వేడుక‌ల‌ను నిర్వ‌హించుకుంటారు. అయితే ఈ ఏడాది మ‌ద్యం, బిర్యానీ, కేక్‌ల స‌ర‌స‌న ఎవ‌రూ ఊహించ‌ని విధంగా కండోమ్స్ వ‌చ్చి చేరాయి. డిసెంబర్ 31న ఆన్‌లైన్‌లో భారీగా కండోమ్స్ ను ఆర్డ‌ర్ చేసిన‌ట్లు స్విగ్గీ వెల్ల‌డించింది. బిర్యానీలు, ఇత‌ర ఆహార ప‌దార్థాల‌తో పాటు కండోమ్స్‌ను కూడా ఆర్ద‌ర్ […]

డిసెంబ‌ర్ 31న భారీగా కండోమ్స్ ఆర్డ‌ర్.. స్విగ్గీ ట్వీట్

Swiggy | డిసెంబ‌ర్ 31 అన‌గానే యూత్‌కు గుర్తువ‌చ్చేది మ‌ద్యం. ఇక బిర్యానీలు, కేక్‌లు. సంవ‌త్స‌రం చివ‌రి రోజు కాబ‌ట్టి.. కొత్త ఏడాదంతా గుర్తుండి పోయే విధంగా డిసెంబ‌ర్ 31న వేడుక‌ల‌ను నిర్వ‌హించుకుంటారు. అయితే ఈ ఏడాది మ‌ద్యం, బిర్యానీ, కేక్‌ల స‌ర‌స‌న ఎవ‌రూ ఊహించ‌ని విధంగా కండోమ్స్ వ‌చ్చి చేరాయి. డిసెంబర్ 31న ఆన్‌లైన్‌లో భారీగా కండోమ్స్ ను ఆర్డ‌ర్ చేసిన‌ట్లు స్విగ్గీ వెల్ల‌డించింది.

బిర్యానీలు, ఇత‌ర ఆహార ప‌దార్థాల‌తో పాటు కండోమ్స్‌ను కూడా ఆర్ద‌ర్ చేసిన‌ట్లు స్విగ్గీ సంస్థ పేర్కొంది. ఏడాది చివ‌రి రోజున రాత్రి 9:30 గంట‌ల స‌మ‌యానికి 2757 కండోమ్స్ ప్యాకెట్ల‌ను యూజ‌ర్లు ఆర్డ‌ర్ చేశార‌ని తెలిపింది. ఆర్డ‌ర్ చేసిన కండోమ్ ప్యాకెట్ల‌ను కేవ‌లం 2.5 నిమిషాల్లోనే డెలివ‌రీ చేసిన‌ట్లు పేర్కొంది.

ఇక కండోమ్స్ విష‌యాన్ని ప‌క్క‌న పెడితే.. డిసెంబ‌ర్ 31న రాత్రి 7 గంట‌ల వ‌ర‌కు ఏకంగా 1.76 ల‌క్ష‌ల చిప్స్ ప్యాకెట్ల‌ను కూడా ఆర్డ‌ర్ చేశారు. రాత్రి 10:25 గంటల వరకు ఫుడ్‌డెలివరీ సంస్థ స్విగ్వీ (Swiggy) ఏకంగా 3.50 లక్షల బిర్యానీ ఆర్డర్లు డెలివరీ చేసింది. హైదరాబాద్‌ బిర్యానీకి 75.4 శాతం ఆర్డర్లు వచ్చినట్లు పేర్కొంది. హైదరాబాద్‌లో బిర్యానీ విక్రయాల్లో టాప్‌లో నిలిచిన రెస్టారెంట్లలో బావర్చి ఒకటని, ప్రతి నిమిషానికి రెండు బిర్యానీలు డెలివరీ చేసినట్టు స్ప‌ష్టం చేసింది. ఇక దేశవ్యాప్తంగా రాత్రి 10.25 గంటల సమయానికి 61,000 పిజ్జాలను డెలివరీ చేసినట్లు స్విగ్గీ తెలిపింది.